TS SSC Results 2024: తెలంగాణలో పదోతరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాలు కాసేపట్లో (ఏప్రిల్ 30న) వెల్లడించనున్నారు అధికారులు. ఉదయం 11 గంటలకు హైదరాబాద్‌లోని SCERT కాంప్లెక్స్, గోదావరి ఆడిటోరియలో విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం ఫలితాలను విడుదల చేయనున్నారు. ఈ ఏడాది మార్చి 18 నుంచి ఏప్రిల్ 2 వ‌ర‌కు రాష్ట్రవ్యాప్తంగా 2,676 ప‌రీక్షా కేంద్రాల్లో టెన్త్ పరీక్షలు నిర్వహించారు. పరీక్షలకు మొత్తం 5,08,385 మంది విద్యార్థులు హాజ‌ర‌య్యారు. ఇందులో బాలురు 2,57,952 మంది; బాలికలు 2,50,433 మంది ఉన్నారు. ఫలితాలను అధికారిక వెబ్‌సైట్ తోపాటు https://telugu.abplive.com//amp వెబ్‌సైట్‌లోనూ అందుబాటులో ఉంచనున్నారు.


అధికారిక వెబ్‌సైట్లు:


http://results.bse.telangana.gov.in/


http://results.bsetelangana.org/ 


రాష్ట్రంలో 11 జిల్లాల్లోని 19 కేంద్రాల్లో టెన్త్ జవాబుపత్రాల మూల్యాంకనం ప్రక్రియను అధికారులు చేపట్టారు.  టెన్త్ జవాబుపత్రాల మూల్యాంకన ప్రక్రియ ఏప్రిల్ 20తో ముగిసింది. ఎన్నికల సంఘం నుంచి అనుమతి రావడంతో ఫలితాల వెల్లడికి అధికారులు సన్నాహాలు ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఫలితాలను డీకోడింగ్ ప్రక్రియ పూర్తవడంతో ఫలితాలను అధికారులు వెల్లడించనున్నారు. ఎన్నికల కోడ్‌ దృష్ట్యా మంత్రులుకాకుండా విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం వీటిని విడుదల చేయనున్నారు. 


27 రోజుల్లోనే ఫలితాలు..
తెలంగాణ‌లో గతేడాది ఏప్రిల్ 3 నుంచి ఏప్రిల్ 13 వరకు పదోతరగతి పరీక్షలు నిర్వహించారు. ఫలితాలను మే 10న విడుద‌ల చేశారు. అయితే ఈ సారి లోక్ స‌భ ఎన్నిక‌ల నేపథ్యంలో..  మార్చి 18 నుంచి ఏప్రిల్ 2 వరకు పరీక్షలు నిర్వహించారు. గతేడాది ఫలితాల ప్రకటనకు 27 రోజుల సమయం పట్టింది. ఈసారి కూడా 27 వ్యవధిలోనే ఫలితాలను ప్రకటించనున్నారు. 


పదోతరగతి ఫలితాలను ఇలా చూసుకోండి..


➥  విద్యార్థులు ఫలితాల కోసం మొదట BSE Telangana అధికారిక సైట్‌ని సందర్శించాలి-https://bse.telangana.gov.in/


➥ హోమ్‌పేజీలో అందుబాటులో 'TS SSC Results 2024' లింక్‌పై క్లిక్ చేయాలి.


➥ విద్యార్థులు తమ హాల్‌టికెట్ నెంబరు నమోదు చేసి, 'Submit' బటన్ మీద క్లిక్ చేయాలి.


➥ విద్యార్థులకు సంబంధించిన ఫలితాలు కంప్యూటర్ స్క్రీన్ మీద కనిపిస్తాయి. 


➥ ఆ తర్వాత దానిని డౌన్‌లోడ్ చేసుకోవాలి. ప్రింట్ తీసుకొని భవిష్యత్ అవసరాల కోసం భద్రపరచుకోవాలి.


తెలంగాణలో పదోతరగతి పరీక్షలు ఈ ఏడాది మార్చి 18తో పరీక్షలు ప్రారంభంకాగా..  మార్చి 30తో ప్రధాన పరీక్షలు, ఏప్రిల్ 2తో ఒకేషనల్ పరీక్షలు (Telangana 10th Class Exams) ముగిశాయి.  మార్చి 18న ఫస్ట్ లాంగ్వేజ్, మార్చి 19న సెకండ్ లాంగ్వేజ్, మార్చి 21న థర్డ్ లాంగ్వేజ్, మార్చి 23న మ్యాథమెటిక్స్, మార్చి 26న ఫిజికల్ సైన్స్, మార్చి 28న బయలాజికల్ సైన్స్,  మార్చి 30న సోషల్ స్టడీస్ పరీక్ష నిర్వహించారు. ఇక ఏప్రిల్ 1న  ఓరియంటెల్ పేపర్-1, ఒకేషనల్ కోర్సులకు, ఏప్రిల్ 2న ఓరియంటెల్ పేపర్-2 పరీక్ష నిర్వహించారు. ఆయాతేదీల్లో ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్షలు నిర్వహించారు. అయితే సైన్స్‌ పరీక్షకు మాత్రం ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.50 వరకు, ఒకేషనల్ కోర్సుకు ఉదయం 9.30 నుంచి 11.30 గంటల వరకు పరీక్ష నిర్వహించారు. ఈ ఏడాది పదోతరగతి పరీక్షలకు దాదాపు 5.50 లక్షలకుపైగా విద్యార్థులు హాజరయ్యారు.


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి...