హైదరాబాద్ లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ తర్వాత ఎక్కువ మంది MBA వైపు వెళ్తారు. రెండేళ్ల MBA ప్రోగ్రాం తర్వాత బోలెడన్ని కార్పొరేట్ జాబ్ ఆప్షన్లు ఉంటాయి. మెట్రో సిటీలు అయిన సూరత్, బెంగళూరుతో పోలిస్తే హైదరబాద్ లో MBA చేస్తే ఖర్చు తక్కువ.  హైదరాబాద్ లో MBA కాలేజ్ లు టాప్ క్లాస్ బిజినెస్ స్కిల్స్ నేర్పుతున్నాయి. బిజినెస్ ప్రోగ్రాముల్లో అకౌంటింగ్, మానేజ్మెంట్, ఫైనాన్స్ వంటి స్పెషలైజేషన్లు సెలక్ట్ చేసుకోవచ్చు.  అనుభవజ్ఞులైన్ ఫ్యాకల్టీ తో, మంచి ఫెసిలిటీస్ తో హైదరాబాద్ లో 250 వరకు MBA కాలేజ్ లు ఉన్నాయి.


హైదరాబాద్ లో MBA చేయటానికి కావల్సిన అర్హతలు


హైదరాబాద్ లో MBA చేయటానికి ఎలిజిబిలిటీ మీరు ఎంచుకున్న ప్రోగ్రాం ను, కాలేజ్ ను బట్టి ఉంటుంది. సాధారణంగా MBA చేయటానికి కావల్సిన అర్హతలు ఇవి:


హైదరబాద్ లో MBA చేయటానికి గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా స్పెషలైజేషన్ లో బ్యాచలర్ డిగ్రీ ఉండాలి. కొన్ని ఇన్స్టిట్యూట్ లు డిగ్రీ లో 50% మార్కులతో ఉత్తీర్ణత పొందిన వారికి మాత్రమే ప్రవేశం కల్పిస్తాయి.  చాలా వరకు అన్ని MBA ప్రోగ్రములకు MAT,CAT,CMAT లేదా XAT ఎంట్రన్స్ పరీక్షలు పాస్ అవటం తప్పనిసరి. కాలేజ్ ను బట్టి మార్కుల రిక్వైర్మెంట్ వేరుగా ఉంటుంది. హైదరాబాద్ లో కొన్ని కాలేజ్ లు 2,3 సంవత్సరాల వర్క్ ఎక్స్పీరియెన్స్ ఉన్నవారికే MBA ప్రోగ్రాముల్లో ప్రవేశానికి అవకాశం కల్పిస్తున్నాయి. బిజినెస్ కోర్సుల్లో చేరటానికి ఇంగ్లీష్ భాష మీద పట్టు చాలా ముఖ్యం. కాబట్టి IELTS, TOEFL స్కోర్ కూడా కాలేజ్ లు తప్పనిసరి చేస్తున్నాయి.


హైదరాబాద్ లో టాప్ MBA కాలేజ్ లు


IMT హైదరాబాద్


ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ టెక్నాలజీ, హైదరాబాద్..హైదరాబాద్ లోని ప్రముఖ బిజినెస్ కాలేజీల్లో ఒకటి. మార్కెటింగ్, ఫైనాన్స్, జనరల్ మేనేజ్మెంట్ స్పెషలైజేషన్స్ తో PGDM  ప్రోగ్రాం ఆఫర్ చేస్తుంది. ఇది MBA తో సమానమైన బిజినెస్ ప్రోగ్రాం. ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ టెక్నాలజీ డెలోయిట్, విప్రో లాంటి లీడింగ్ కంపెనీల్లో ప్లేస్మెంట్ కలిపిస్తోంది.


IPE హైదరాబాద్


ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైస్, హైదరాబాద్..ఒక ప్రైవేట్ సంస్థ. ఇది 1964 లో స్థాపించబడింది. బిజినెస్ అనలైటిక్స్ అండ్ సిస్టంస్, మార్కెటింగ్, ఫైనాన్స్ వంటి వివిధ స్పెషలైజేషన్లతో PGDM  ప్రోగ్రాములను ఆఫర్ చేస్తోంది.


ISB హైదరాబాద్


ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ 2001 లో స్థాపించబడిన ప్రైవేట్ బిజినెస్ స్కూల్. హైదరాబాద్ లోని టాప్ MBA  కాలేజ్ లలో ఒకటి. ISB హైదరాబాద్ తో పాటూ, మొహాలిలో కూడా ఇంకో క్యాంపస్ ఉంది. విభిన్నమైన కరిక్యూలంతో ఈ కాలేజ్ గ్లోబల్ పాపులాటీ సంపాదించింది. ఇక్కడ వివిధ రకాల పోస్ట్ గ్రాడ్యుయేట్ బిజినెస్ ప్రోగ్రాములను ఆఫర్ చేస్తున్నారు.


యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్


స్కూల్ ఆఫ్ మానేజ్మెంట్ స్టడీస్..యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ లో వివిధ బిజినెస్ ప్రోగ్రములను ఆఫర్ చేస్తోంది. మార్కెటింగ్, ఫైనాన్స్, జనరల్ మానేజ్మెంట్ వివిధ స్పెషలైజేషన్స్ లో ప్రాక్టికల్ నాలెడ్జ్ ఇవ్వటం ఈ ఇన్స్టిట్యూట్ ప్రత్యేకత.


కాలేజ్ రెప్యూటేషన్, ఆఫర్ చేస్తున్న స్పెషలైజేషన్స్, ర్యాంకింగ్, ఫెసిలిటీస్, ఫ్యాకల్టీని బట్టి బిజినెస్ కాలేజ్ లను ఎంపిక చేసుకోవటం మంచిది.