తెలంగాణలోని డిగ్రీ కళాశాలల్లో కొత్తగా బీఎస్సీ ఆనర్స్ కోర్సును అందుబాటులోకి తేనున్నారు. 2023-24 విద్యాసంవత్సరం నుంచే కళాశాలల్లో హానర్స్ కోర్సును ప్రవేశపెట్టాలని రాష్ట్ర ఉన్నత విద్యామండలి నిర్ణయించింది. జనవరి 20న హైదరాబాద్‌లోని విద్యామండలి కార్యాలయంలో నిర్వహించిన పాలకమండలి సమావేశంలో ఈ మేరకు ఆమోదముద్ర వేశారు. ఈ సమావేశంలో విద్యామండలి ఛైర్మన్ ఆర్.లింబాద్రి, విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ, కళాశాల విద్యాశాఖ కమిషనర్ నవీన్ మిత్తల్, ఇతర ముఖ్య అధికారులు పాల్గొన్నారు.
రెండేళ్ల క్రితం తొలిసారిగా పొలిటికల్ సైన్స్, ఆర్థికశాస్త్రంలో బీఏ ఆనర్స్ కోర్సును ప్రవేశపెట్టారు. హైదరాబాద్‌లోని నిజాం కళాశాల, కోఠి మహిళా కళాశాల (ప్రస్తుతం మహిళా విశ్వవిద్యాలయం), బేగంపేట మహిళా, సిటీ కళాశాలల్లో ఈ కోర్సు అందుబాటులో ఉంది. తాజాగా బీఎస్సీకి కూడా ఆనర్స్‌ను విస్తరించారు. మూడేళ్ల వ్యవధి గల ఈ కోర్సులో కంప్యూటర్ సైన్స్ కేంద్రీకృతంగా సిలబస్ ఉంటుంది.
అందుకే మూడేళ్ల ఆనర్స్ కోర్సు - ఉన్నత విద్యామండలి ఛైర్మన్ లింబాద్రి
హైదరాబాద్‌కు ప్రతి సంవత్సరం ఎన్నో అంతర్జాతీయ ఐటీ సంస్థలు వస్తున్నాయని, పలు పరిశ్రమలు సైతం వివిధ రకాల కొలువుల్లో డిగ్రీ విద్యార్థులను నియమించుకునేందుకు ఆసక్తి చూపుతున్నాయని ఉన్నత విద్యామండలి ఛైర్మన్ లింబాద్రి తెలిపారు. ఈ నేపథ్యంలో కంప్యూటర్ సైన్స్‌ను ఓ సబ్జెక్టుగా కాకుండా పూర్తిస్థాయిలో బోధించేలా ఆనర్స్ కోర్సును రూపొందిస్తున్నామన్నారు. డిగ్రీలో పేద విద్యార్థులు ఎక్కువగా చేరుతుంటారు. వారు తమ కుటుంబాలకు ఆసరాగా నిలిచేందుకు ఏదో ఒక చిన్న ఉద్యోగంలో త్వరగా చేరాలనుకుంటారు. అందుకే మూడేళ్ల ఆనర్స్ కోర్సును అందించాలని సమావేశం నిర్ణయించింది. రాష్ట్రంలోని 10కి పైగా ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో ఈ కోర్సును ప్రవేశపెట్టేందుకు కళాశాల విద్యాశాఖ కమిషనర్ నవీన్ మిత్తల్ సుముఖంగా ఉన్నారు. ప్రైవేట్ కళాశాలలు కూడా ఈ కోర్సును అందుబాటులోకి తీసుకురావచ్చు. అందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తామని లింబాద్రి పేర్కొన్నారు.
Also Read:
జేఈఈ మెయిన్ అడ్మిట్ కార్డులు వచ్చేశాయ్! డైరెక్ట్ లింక్ ఇదే! పరీక్ష తేదీలివే!
జేఈఈ మెయిన్ 2023 పరీక్షల మొదటి విడత అడ్మిట్ కార్డులను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ జనవరి 21న విడుదల చేసింది. అభ్యర్థులు అప్లికేషన్ నెంబరు, పుట్టినతేది వివరాలు నమోదుచేసి అడ్మిట్ కార్డు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ముందుగా ప్రకటించిన షెడ్యూలు ప్రకారం జనవరి 24, 25, 28, 29,30, 31 తేదీల్లో జేఈఈ మెయిన్ పరీక్ష నిర్వహించనున్నారు. కాగా జనవరి 28న మాత్రం కేవలం పేపర్-2 పరీక్ష నిర్వహించనున్నారు.
జేఈఈ మెయిన్ హాల్‌టికెట్ల కోసం క్లిక్ చేయండి...
'ప్రతిభావంతులకు' సహకారం, ఓఎన్‌జీసీ 'ఉపకారం' - ఏడాదికి రూ.48,000 స్కాలర్‌షిప్!
ఆయిల్ & నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్(ఓఎన్‌జీసీ) 2021-22 విద్యా సంవత్సరానికిగాను వివిధ స్కాలర్‌షిష్‌ల కోసం డిగ్రీ, పీజీ విద్యార్థుల నుంచి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. జనరల్, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు ఈ ఉపకారవేతనాలు పొందడానికి అర్హులు. విద్యార్థుల వయసు 30 సంవత్సరాలలోపు ఉండాలి. విద్యార్థుల కుటుంబ వార్షికాదాయం రూ.2 లక్షల్లోపు ఉండాలి. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. ఎంపికైన విద్యార్థులకు ఏడాదికి రూ.48,000 స్కాలర్‌షిప్ అందుతుంది.
స్కాలర్‌షిప్ వివరాల కోసం క్లిక్ చేయండి..