AP TET-2024 Hall tickets: ఏపీలో టీచర్‌ ఎలిజిబిలిటి టెస్ట్‌ (APTET)- 2024 పరీక్ష హాల్‌టికెట్లను విద్యాశాఖ ఫిబ్రవరి 23న విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్లను అందబాటులో ఉంచింది. అభ్యర్థులు తమ ఐడీ నెంబరు, పుట్టినతేదీ వివరాలు నమోదుచేసి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం ఫిబ్రవరి 27 నుంచి మార్చి 9 వరకు  కంప్యూటర్ ఆధారిత విధానంలో టెట్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఆయారోజుల్లో ప్రతిరోజూ రెండు సెషన్లలో టెట్‌ పరీక్షలు నిర్వహిస్తారు. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మొదటి సెషన్‌లో, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెండో సెషన్‌లో పరీక్షలు నిర్వహిస్తారు. టెట్ ప్రాథమిక 'కీ' మార్చి 10న విడుదల చేయనున్నారు. ఆన్సర్ కీపై మార్చి 11 వరకు ఈ కీపై అభ్యంతరాలు స్వీకరిస్తారు. అనంతరం మార్చి 13న టెట్ తుది ఆన్సర్ కీని విడుదల చేయనున్నారు. మార్చి 14న టెట్‌ తుది ఫలితాలు విడుదల చేయనున్నారు.  డీఎస్సీలో టెట్ మార్కులకు 20 శాతం వెయిటేజీ ఉంటుంది. 


ఏపీటెట్ హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోండి..


➥ ముందుగా అఫీషియల్‌ వెబ్‌సైట్‌‌‌లోకి వెళ్లాలి - https://aptet.apcfss.in/


➥ అక్కడ హోమ్‌ పేజీలో APTET 2024 హాల్‌ టికెట్‌ అనే లింక్‌పై క్లిక్‌ చేయండి. 


➥ అభ్యర్థులు లాగిన్‌ కోసం తమ ఐడీతోపాటు, పుట్టిన తేదీ వివరాలు నమోదుచేయాలి. 


➥ కంప్యూటర్ స్క్రీన్ మీద టెట్ హాల్‌‌టికెట్ కనిపిస్తుంది. డౌన్‌లోడ్‌ ఆప్షన్‌పై క్లిక్‌ చేసి డౌన్‌లోడ్‌ చేసుకోవాలి.


ఏపీటెట్ 2024 హాల్‌టికెట్ల కోసం క్లిక్ చేయండి..



ఏపీటెట్ పరీక్ష విధానం (AP TET 2024 Exam Pattern):


* పేపర్-1(ఎ): మొత్తం 150 మార్కులకు కంప్యూటర్ ఆధారిత రాతపరీక్ష నిర్వహిస్తారు. పరీక్షలో మొత్తం 150 మల్టీపుల్ ఛాయిస్ ప్రశ్నలు అడుగుతారు. ఇందులో ఛైల్డ్ డెవలప్‌మెంట్ అండ్ పెడగోగి 30 ప్రశ్నలు-30 మార్కులు, లాంగ్వేజ్-1 (తెలుగు/ఉర్దూ/హిందీ/కర్ణాటక/తమిళం/ఒడియా)-30 ప్రశ్నలు-30 మార్కులు, లాంగ్వే్జ్-2(ఇంగ్లిష్)-30 ప్రశ్నలు-30 మార్కులు, మ్యాథమెటిక్స్-30 ప్రశ్నలు-30 మార్కులు, ఎన్విరాన్‌మెంటల్ స్టడీస్-30 ప్రశ్నలు-30 మార్కులు ఉంటాయి.


* పేపర్-1(బి): మొత్తం 150 మార్కులకు కంప్యూటర్ ఆధారిత రాతపరీక్ష నిర్వహిస్తారు. పరీక్షలో మొత్తం 150 మల్టీపుల్ ఛాయిస్ ప్రశ్నలు అడుగుతారు. ఇందులో ఛైల్డ్ డెవలప్‌మెంట్ అండ్ పెడగోగి (స్పెషల్ ఎడ్యుకేషన్)-30 ప్రశ్నలు-30 మార్కులు, లాంగ్వేజ్-1 (తెలుగు/ఉర్దూ/హిందీ/కర్ణాటక/తమిళం/ఒడియా)-30 ప్రశ్నలు-30 మార్కులు, లాంగ్వే్జ్-2(ఇంగ్లిష్)-30 ప్రశ్నలు-30 మార్కులు, మ్యాథమెటిక్స్-30 ప్రశ్నలు-30 మార్కులు, ఎన్విరాన్‌మెంటల్ స్టడీస్-30 ప్రశ్నలు-30 మార్కులు ఉంటాయి.


* పేపర్-2(ఎ): మొత్తం 150 మార్కులకు కంప్యూటర్ ఆధారిత రాతపరీక్ష నిర్వహిస్తారు. పరీక్షలో మొత్తం 150 మల్టీపుల్ ఛాయిస్ ప్రశ్నలు అడుగుతారు. ఇందులో ఛైల్డ్ డెవలప్‌మెంట్ అండ్ పెడగోగి-30 ప్రశ్నలు-30 మార్కులు, లాంగ్వేజ్-1(తెలుగు/ఉర్దూ/హిందీ/కర్ణాటక/తమిళం/ఒడియా/సంస్కృతం)-30 ప్రశ్నలు-30 మార్కులు, లాంగ్వే్జ్-2(ఇంగ్లిష్)-30 ప్రశ్నలు-30 మార్కులు, మ్యాథమెటిక్స్ & సైన్స్/సోషల్ స్టడీస్/లాంగ్వేజ్-1(తెలుగు/ఇంగ్లిష్/ఉర్దూ/హిందీ/కర్ణాటక/తమిళం/ఒడియా/సంస్కృతం)-60 ప్రశ్నలు-60 మార్కులు ఉంటాయి.


* పేపర్-2(బి): మొత్తం 150 మార్కులకు కంప్యూటర్ ఆధారిత రాతపరీక్ష నిర్వహిస్తారు. పరీక్షలో మొత్తం 150 మల్టీపుల్ ఛాయిస్ ప్రశ్నలు అడుగుతారు. ఇందులో ఛైల్డ్ డెవలప్‌మెంట్ అండ్ పెడగోగి (స్పెషల్ ఎడ్యుకేషన్)-30 ప్రశ్నలు-30 మార్కులు, లాంగ్వేజ్-1 (తెలుగు/ఉర్దూ/హిందీ/కర్ణాటక/తమిళం/ఒడియా)-30 ప్రశ్నలు-30 మార్కులు, లాంగ్వే్జ్-2(ఇంగ్లిష్)-30 ప్రశ్నలు-30 మార్కులు, మ్యాథమెటిక్స్-30 ప్రశ్నలు-30 మార్కులు, ఎన్విరాన్‌మెంటల్ స్టడీస్-30 ప్రశ్నలు-30 మార్కులు ఉంటాయి.


ఏపీటెట్ సిలబస్, పరీక్ష విధానం కోసం క్లిక్ చేయండి..


APTET Information Bulletin


అర్హత మార్కులు: ఏపీటెట్‌కు సంబంధించిన పేపర్-1, పేపర్-2 పరీక్షల్లో కనీస అర్హత మార్కులను ఓసీలకు 60 శాతంగా; బీసీలకు 50 శాతంగా; ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు,ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులకు 40 శాతంగా నిర్ణయించారు.


ఏపీ డీఎస్సీ-2024 పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..