ఏపీలోని ఇంజినీరింగ్ కళాశాలల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఏపీఈఏపీసెట్-2023 కౌన్సెలింగ్ షెడ్యూలును ఉన్నత విద్యామండలి జులై 19న విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో కౌన్సెలింగ్ నోటిఫికేషన్‌ను అందుబాటులో ఉంచింది. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం జులై 24 నుంచి కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభంకానుంది. ఏపీఈఏపీసెట్-2023 కౌన్సెలింగ్‌లో భాగంగా తొలి దశలో ఎంపీసీ స్ట్రీమ్ విద్యార్థులకు యూనివర్సిటీ & ప్రైవేటు ఇంజినీరింగ్ కాలేజీలు, ప్రైవేటు యూనివర్సిటీల కాలేజీలలో కన్వీనర్ కోటా కింద ఇంజినీరింగ్, అగ్రికల్చర్ సీట్లలో ప్రవేశాలు కల్పిస్తారు.
ఏపీఈఏపీసెట్ పరీక్షలో అర్హత సాధించిన విద్యార్థులు జులై 24 నుంచి ఆగస్టు 3 వరకు నిర్ణీత ఫీజు చెల్లించి, రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తిచేయాల్సి ఉంటుంది. అభ్యర్థులు ప్రాసెసింగ్ ఫీజు కింద రూ.1200 చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.600 చెల్లిస్తే సరిపోతుంది. క్రెడిట్ కార్డ్/డెబిట్ కార్డ్/నెట్ బ్యాంకింగ్ ద్వారా ఆన్‌లైన్ విధానంలో ఫీజు చెల్లించవచ్చు.
రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయినవారు ధ్రువపత్రాల పరిశీలన కోసం జులై 25 నుంచి ఆగస్టు 4 వరకు ఆన్‌లైన్ ద్వారా అవసరమైన అన్ని సర్టిఫికేట్లను అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. వీరికి ఆగస్టు 3 నుంచి 8 వరకు వెబ్‌ఆప్షన్ల నమోదుకు అవకాశం కల్పిస్తారు. ఆప్షన్లు మార్చుకోదలచినవారు ఆగస్టు 9న మార్పులు చేసుకోవచ్చు. ఇవన్నీ పూర్తయ్యాక ఆగస్టు 12న అభ్యర్థులకు సీట్లను కేటాయిస్తారు. సీట్లు పొందిన విద్యార్థులు ఆన్‌లైన్ ద్వారా సెల్ప్ రిపోర్టింగ్ చేసి సీటును ధ్రువీకరించుకోవాలి. అనంతరం సంబంధిత కళాశాలల్లో రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది.
ముఖ్యమైన తేదీలు..
➥ ఆన్‌లైన్ ద్వారా ప్రాసెసింగ్ ఫీజు చెల్లింపు, రిజిస్ట్రేషన్ ప్రక్రియ: 24.07.2023 నుంచి 03.08.2023 వరకు.
➥ఆన్‌లైన్ వెరిఫికేషన్ కోసం సర్టిఫికెట్ల అప్‌లోడింగ్: 25.07.2023 నుంచి 04.08.2023 వరకు.
➥ వెబ్ ఆప్షన్ల నమోదు: 03.08.2023 నుంచి 08.08.2023 వరకు.
➥ వెబ్ ఆప్షన్లలో మార్పులు: 09.08.2023.
➥ సీట్ల కేటాయింపు: 12.08.2023.
➥ సెల్ఫ్ రిపోర్టింగ్(ఆన్‌లైన్), సంబంధిత కాలేజీల్లో రిపోర్టింగ్: 13.08.2023 నుంచి 14.08.2023 వరకు.
➥ ఇంజినీరింగ్ తరగతులు ప్రారంభం: 16.08.2023 నుంచి.
ఈ సర్టిపికేట్లు అవసరం..
➥ ఏపీఈఏపీసెట్-2023 ర్యాంక్ కార్డ్
➥ ఏపీఈఏపీసెట్-2023 హాల్ టికెట్
➥ ఆధార్ కార్డ్
➥ S.S.C లేదా అందుకు సమానమైన మార్కుల మెమో
➥ ఇంటర్మీడియట్ లేదా అందుకు సమానమైన మెమో-కమ్-పాస్ సర్టిఫికేట్
➥ ఆరో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు స్టడీ సర్టిఫికెట్లు, ట్రాన్స్‌ఫర్ సర్టిఫికేట్ (T.C)
➥ 01-01-2020న లేదా ఆ తర్వాత జారీ చేసిన ఇన్ కమ్ సర్టిఫికేట్ (వర్తిస్తే) లేదా తెల్ల రేషన్ కార్డు ఉండాలి.
➥ తహసీల్దార్ జారీ చేసిన EWS ఇన్‌కమ్ సర్టిఫికేట్, 2023-24 సంవత్సరానికి చెల్లుబాటు అయ్యేది. (వర్తిస్తే)
➥ అధికారులు జారీ చేసిన క్యాస్ట్ సర్టిఫికేట్
➥ అభ్యర్థికి ఇన్‌స్టిట్యూషల్ ఎడ్యుకేషన్ లేనిపక్షంలో అర్హత పరీక్షకు ముందు 7 సంవత్సరాల కాలానికి సంబంధించిన రెసిడెన్స్ సర్టిఫికేట్
➥ స్థానికేతర అభ్యర్థులకు సంబంధించి, అన్‌రిజర్వ్‌డ్ సీట్ల కింద కేటాయింపు కోసం వారిని పరిగణనలోకి తీసుకోవాలంటే రెసిడెన్స్ సర్టిఫికేట్ లేదా ఎంప్లాయర్ సర్టిఫికేట్, మైనారిటీ సర్టిఫికేట్ సమర్పించాల్సి ఉంటుంది.
ALSO READ:
NITT: నిట్ తిరుచిరాపల్లిలో ఎంటెక్, ఎంఆర్క్ కోర్సులు - ప్రవేశం ఇలా!
తిరుచిరాపల్లిలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, 2023-2024 విద్యా సంవత్సరానికి స్పాన్సర్డ్ కేటగిరీలో ఎంటెక్, ఎంఆర్క్ కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. 60% మార్కులతో సంబంధిత విభాగంలో బ్యాచిలర్స్ డిగ్రీ అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అభ్యర్థులు జులై 31లోగా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. రాత పరీక్ష/ ఆన్‌లైన్ పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు. అభ్యర్థులకు ఆగస్టు 7న ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు.
కోర్సుల పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
బీఆర్క్ ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల, ముఖ్యమైన తేదీలివే!
తెలంగాణలోని ఆర్కిటెక్చర్ కాలేజీల్లో బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్చర్ (బీఆర్క్) సీట్ల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ నిర్వహించే ఆప్టిట్యూడ్ టెస్టు ఎన్‌ఏటీఏ (NATA)–2021లో (లేదా) జేఈఈ మెయిన్స్ పేపర్–2 (బీఆర్క్)–2021లో అర్హత సాధించినవారు, ఇంటర్ (ఎంపీసీ) లేదా తత్సమాన విద్యార్హత ఉన్నవారు, పదోతరగతితోపాటు డిప్లొమా పూర్తిచేసిన వారు ఈ కోర్సుకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. రాష్ట్రవ్యాప్తంగా 10 ఆర్కిటెక్చర్ కాలేజీల్లో 830 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం జులై 12 నుంచి 22 వరకు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కొనసాగనుంది.
ప్రవేశాల పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..
మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..
Join Us on Telegram: https://t.me/abpdesamofficial