ఏపీలో పలు ప్రవేశ పరీక్షల షెడ్యూల్ విడుదలయ్యాయి. ఇంజినీరింగ్, ఫార్మసీ ప్రవేశాలకు నిర్వహించే ఏపీఈఏపీసెట్-2023 పరీక్ష తేదీలను రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేసింది. మే 15 నుంచి 18 వరకు ఇంజినీరింగ్, మే 22, 23 తేదీల్లో ఫార్మసీ పరీక్షలు నిర్వహించనున్నట్లు ఓ ప్రకటనలో పేర్కొంది. ఈఏపీసెట్ దరఖాస్తుకు ఈనెల 11 నుంచి ఏప్రిల్ 15 వరకు గడువు ఇచ్చింది. అలాగే మే 5న ఈసెట్ నిర్వహించనుండగా.. దరఖాస్తుకు మార్చి 10 నుంచి ఏప్రిల్ 10 వరకు అవకాశం కల్పించింది. మే 24, 25న ఐసెట్ పరీక్షలు జరపగా.. దరఖాస్తుకు మార్చి 20 నుంచి ఏప్రిల్ 19 వరకు గడువు ఇచ్చింది.



* ఏపీ ఉన్నత విద్యామండలి గతంలో ప్రకటించిన షెడ్యూలు ప్రకారం ఏపీఈఏపీసెట్ (ఎంపీసీ) స్ట్రీమ్ అభ్యర్థులకు  మే 15 నుండి 22 తేదీల మధ్య జరగాల్సిన పరీక్షలు మే 15 నుంచి 18 వరకు నిర్వహించనున్నారు. అదేవిధంగా ఏపీ ఈఏపీసెట్ (బైపీసీ) స్ట్రీమ్ పరీక్ష మే 23 నుండి 25 తేదీల మధ్య జరగాల్సి ఉండగా మే 22, 23 తేదీల్లోనే ముగించనున్నారు.


* ఇక ఈసెట్ పరీక్షను మే 5న, పీజీఈసెట్ పరీక్ష మే 28 నుండి 30 తేదీల మధ్య నిర్వహించనున్నారు. అదేవిధంగా మే 25,26 తేదీల్లో ఐసెట్‌, మే 20న లాసెట్‌, మే 20న ఎడ్‌సెట్‌, జూన్‌ 6 నుండి 10వ తేదీల మధ్య పీజీసెట్ పరీక్ష నిర్వహించనున్నారు.


చివరగా జూన్‌ 12 నుండి 14 తేదీల మధ్య ఆర్‌సెట్‌ పరీక్ష నిర్వహించనున్నారు. అయితే ఏదైనా కారణాల రీత్యా ఈ తేదీల్లో కొంత మార్పులు ఉండే అవకాశం కూడా ఉందని ఉన్నత విద్యా మండలి తెలిపింది. 


పరీక్షల షెడ్యూలు..


➥ ఏపీఈఏపీసెట్(ఎంపీసీ) పరీక్ష మే 15 నుండి 18 వరకు


➥ ఏపీ ఈఏపీసెట్ (బైపీసీ) ప్రవేశపరీక్షను మే 22 నుండి 23 వరకు


➥ ఈసెట్ పరీక్ష మే 5న


➥ పీజీఈసెట్ మే 28 నుండి 30 వరకు


➥ ఐసెట్ పరీక్ష మే 24, 25 తేదీల్లో


➥ లాసెట్‌ పరీక్ష మే 20న


➥ ఎడ్‌సెట్‌ మే 20న


➥ పీజీసెట్‌ పరీక్ష జూన్‌ 6 నుండి 10వ తేదీల మధ్య నిర్వహించనున్నారు.


➥ ఇక జూన్‌ 12 నుండి 14 తేదీల మధ్య ఆర్‌సెట్‌ పరీక్ష నిర్వహించనున్నారు. 


Also Read:


టీఎస్‌ లాసెట్ - 2023 దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం, చివరితేది ఎప్పుడంటే? 
తెలంగాణలో లాసెట్, పీజీఎల్ సెట్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. మార్చి 1న లాసెట్, పీజీఎల్ సెట్ నోటిఫికేషన్ విడుదల కాగా.. మార్చి 2 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తు మొదలైంది. మార్చి 2 నుంచి ఏప్రిల్ 6 వరకు లాసెట్, పీజీఎల్ సెట్‌కు దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఆలస్య రుసుంతో మే 3 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు. మే 16 నుంచి పరీక్ష హాల్‌టికెట్లు జారీ చేయనున్నారు. మే 25న టీఎస్‌ లాసెట్‌, టీఎస్‌ పీజీఎల్‌సెట్‌ ప్రవేశ పరీక్షను ఆన్‌లైన్‌లో నిర్వహించనున్నారు.
లాసెట్ నోటిఫికేషన్, దరఖాస్తు కోసం క్లిక్ చేయండి..


TS PGECET - 2023 దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం, పరీక్ష ఎప్పుడంటే?
తెలంగాణలో TS PGECET-2023 దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. అభ్యర్థులు ఎలాంటి ఆల‌స్య రుసుం లేకుండా ఏప్రిల్ 30 వ‌ర‌కు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. మే 2 నుంచి 4 మ‌ధ్యలో ద‌ర‌ఖాస్తుల‌ను ఎడిట్ చేసుకునేందుకు అవ‌కాశం క‌ల్పించారు. రూ.250 ఆల‌స్య రుసుంతో మే 5 వ‌ర‌కు, రూ. 1000 ఆలస్య రుసుముతో మే 10 వరకు, రూ.2,500 ఆలస్య రుసుముతో మే 15 వరకు, రూ.5,000 ఆల‌స్య రుసుంతో మే 24 వ‌ర‌కు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. మే 21 నుంచి టీఎస్ పీజీఈసెట్ వెబ్‌సైట్ నుంచి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవ‌చ్చు. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం మే 29 నుంచి జూన్ 1 వరకు పీజీఈసెట్ పరీక్షలు నిర్వహించనున్నారు.
నోటిఫికేషన్, దరఖాస్తు కోసం క్లిక్ చేయండి..


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..