APRJC CET - 2024: ఆంధ్రప్రదేశ్‌ గురుకుల విద్యాలయాల సంస్థ నిర్వహణలో ఉన్న జూనియర్‌ కళాశాలల్లో ఇంటర్‌లో ప్రవేశాల కోసం ఏపీఆర్‌జేసీ ఉమ్మడి ప్రవేశ పరీక్ష (APRJC CET) - 2024 నోటిఫికేషన్‌ మార్చిన విడుదలైంది. పరీక్షకు సంబంధించిన ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ మార్చి 1న ప్రారంభమైంది. ప్రవేశాలు కోరువారు మార్చి 31 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఇంటర్‌ ప్రథమ సంవత్సరం ప్రవేశ పరీక్ష హాల్‌టికెట్లను ఏప్రిల్ 17 నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ఏప్రిల్ 25న మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్ష నిర్వహించనున్నారు. ఈ పరీక్ష ఫలితాలను మే 14న ప్రకటించనున్నారు. అనంతరం ఇంటర్‌లో కోర్సుల వారీగా సీట్లను భర్తీ చేసేందుకు తొలి విడత కౌన్సిలింగ్‌ మే 22 నుంచి 25 వరకు; మే 28  నుంచి 30 వరకు రెండో విడత; జూన్‌ 5 నుంచి 7 వరకు మూడో విడత కౌన్సెలింగ్‌ నిర్వహిస్తారు. 


వివరాలు...


* ఏపీఆర్‌జేసీ సెట్-2024


సీట్ల సంఖ్య: 1149. వీటిలో ఆంధ్రా రీజియన్‌లో 637 సీట్లు, రాయలసీమ రీజియన్‌లో 443 సీట్లు ఉన్నాయి. ఇక మైనార్టీ జూనియర్ కళాశాలల్లో 69 సీట్లు అందుబాటులో ఉన్నాయి.


అర్హత: పదోతరగతి ఉత్తీర్ణులై ఉండాలి. ఈ ఏడాది పదోతరగతి పరీక్షలు రాస్తున్నవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.


దరఖాస్తు ఫీజు: రూ.300.


దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.


ఎంపిక విధానం: ప్రవేశ పరీక్ష ద్వారా.


పరీక్ష విధానం: మొత్తం 150 మార్కులకు రాతపరీక్ష నిర్వహిస్తారు. పరీక్షలో 150 ప్రశ్నలు అడుగుతారు. మల్టీపుల్ ఛాయిస్ విధానంలో ప్రశ్నలు ఉంటాయి. పదోతరగతి స్థాయిలోనే ప్రశ్నలు ఉంటాయి. పరీక్ష సమయం రెండున్నర గంటలు. ఇంగ్లిష్-తెలుగు, ఇంగ్లిష్-ఉర్దూ మాధ్యమాల్లో పరీక్ష ఉంటుంది. ఓఎంఆర్ విధానంలో పరీక్ష ఉంటుంది. రాష్ట్రవ్యాప్తంగా 26 జిల్లా కేంద్రాల్లో పరీక్ష నిర్వహిస్తారు. 


ముఖ్యమైన తేదీలు..


* నోటిఫికేషన్ వెల్లడి: 01.03.2024.


* ఆన్‌లైన్ దరఖాస్తు, ఫీజు చెల్లింపు ప్రక్రియ ప్రారంభం: 01.03.2024.


*  ఆన్‌లైన్ దరఖాస్తు, ఫీజు చెల్లింపునకు చివరితేది:  31.03.2024.


*  హాల్‌టికెట్ల విడుదల:  17.04.2024.


*  పరీక్ష తేది: 25.04.2024 (2.30 PM to 5 PM)


*  ఫలితాల వెల్లడి: 14.05.2024.


మొదటి విడత కౌన్సెలింగ్: 20.05.2024 - 22.05.2024.


రెండో విడత కౌన్సెలింగ్: 28.05.2024 - 30.05.2024.


మూడో విడత కౌన్సెలింగ్: 05.06.2024 - 07.06.2024.


Notificaion


Online Application


Website


ALSO READ:


ఏకలవ్య గురుకుల ప్రవేశ ప్రకటన విడుదల, పరీక్ష ఎప్పుడంటే?
తెలంగాణలోని 23 ఏకలవ్య గురుకుల విద్యాలయాల్లో 2024-25 విద్యా సంవత్సరానికి గాను ఆరో తరగతిలో ప్రవేశాలకు నోటిఫికేషన్ వెలువడింది. ఇంగ్లిష్‌లో మీడియంలో సీబీఎస్ఈ సిలబస్‌తో బోధిస్తారు. అర్హులైన గిరిజన, ఆదివాసి గిరిజన, సంచార గిరిజన, పాక్షిక సంచార గిరిజన, డీనోటిఫైడ్ ట్రైబ్ తదితర కేటగిరీలకు చెందిన విద్యార్థులు మార్చి 22 లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు ఏప్రిల్ 21న ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. ఎంపికైన విద్యార్థులకు ఉచిత వసతి, భోజనం, విద్య, శిక్షణ అందిస్తారు. విద్యార్థులు దరఖాస్తు ఫీజుగా రూ.100 చెల్లించాల్సి ఉంటుంది. ప్రతి ఏకలవ్య ఆదర్శ గురుకుల విద్యాలయంలో ఆరో తరతగతిలో 60 సీట్ల చొప్పున మొత్తం 23 విద్యాలయాల్లో 1,380(690 బాలురు, 690 బాలికలు) సీట్లు కెటాయించారు. ఆరో తరతగతిలో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకొనే  విద్యార్థులు తప్పనిసరిగా 2022-23 విద్యాసంవత్సరంలో 5వ తరగతి చదివి ఉండాలి. విద్యార్థి తల్లిదండ్రుల వార్షికాదాయం రూ.లక్ష(పట్టణ ప్రాంతం), రూ.లక్షన్నర(గ్రామీణ ప్రాంతం) మించకూడదు.
నోటిఫికేషన్, పరీక్ష వివరాల కోసంక్లిక్ చేయండి..


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి...