APRJC Phase-2 Results: ఏపీలోని గురుకుల జూనియర్ కాలేజీల్లో ఇంటర్ ప్రథమ సంవత్సరం ప్రవేశాలకు సంబంధించి ఏప్రిల్‌ 25న నిర్వహించిన ఏపీఆర్‌జేసీ-2024 ప్రవేశ పరీక్ష మొదటి విడత (ఫేజ్-1) ఫలితాలను మే 14న విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే మే 29న రెండో విడత (ఫేజ్-2) ఫలితాలను విడుదలచేశారు. అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను అందుబాటులో ఉంచారు. అభ్యర్థులు తమ ఐడీ, పుట్టినతేదీ వివరాలు నమోదుచేసి ఫలితాలు చూసుకోవచ్చు. అభ్యర్థులు ప్రవేశపరీక్షలో సాధించిన మార్కులు, రిజర్వేషన్లు, స్పెషల్ కేటగిరీ, స్థానికత ఆధారంగా గురుకుల విద్యాసంస్థల్లో ప్రవేశాలు కల్పిస్తారు. ఎంపికైన విద్యార్థులకు ఇంటర్‌ ఫస్టియర్‌లో ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సీఈసీ, ఈఈటీ, సీజీటీ గ్రూపుల్లో ప్రవేశాలు కల్పిస్తారు.


'ఫేజ్-2' ఫలితాల కోసం క్లిక్ చేయండి..


ఆంధ్రప్రదేశ్‌ గురుకుల విద్యాలయాల సంస్థ నిర్వహణలో ఉన్న జూనియర్‌ కళాశాలల్లో ఇంటర్‌లో ప్రవేశాల కోసం ఏపీఆర్‌జేసీ ఉమ్మడి ప్రవేశ పరీక్ష (APRJC CET) - 2024 నోటిఫికేషన్‌ మార్చిన విడుదలైన సంగతి తెలిసిందే. పరీక్షకు సంబంధించిన ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ మార్చి 1న ప్రారంభమైంది. ఏప్రిల్ 5 వరకు దరఖాస్తులు స్వీకరించారు. ఇంటర్‌ ప్రథమ సంవత్సరం ప్రవేశ పరీక్ష హాల్‌టికెట్లను ఏప్రిల్ 17న విడుదల చేశారు. ఏప్రిల్ 25న మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్ష నిర్వహించారు. ఈ పరీక్ష ఫలితాలను మే 14న ప్రకటించారు. 


ఏపీఆర్జేసీ ప్రవేశ పరీక్షకు మొత్తం 49,308 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఈ పరీక్షలో అర్హత సాధించిన విద్యార్థులకు గురుకుల జూనియర్ కళాశాలల్లో ఇంటర్ మొదటి సంవత్సరంలో ప్రవేశాలు కల్పిస్తారు. ఆయా కళాశాలల్లో ఇంటర్ ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సీఈసీ, ఈఈటీ, సీజీటీ గ్రూపుల్లో సీట్లు భర్తీచేస్తారు. ఇంటర్‌లో కోర్సుల వారీగా సీట్లను భర్తీ చేసేందుకు తొలి విడత కౌన్సెలింగ్‌ మే 22 నుంచి 25 వరకు నిర్వహించారు. ఇక మే 28  నుంచి 30 వరకు రెండో విడత; జూన్‌ 5 నుంచి 7 వరకు మూడో విడత కౌన్సెలింగ్‌ నిర్వహిస్తారు.


 ALSO READ:


బాసర ట్రిపుల్ ఐటీ ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల, షెడ్యూలు ఇలా
తెలంగాణలోని నిర్మల్ జిల్లా బాసరలోని రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్(బాసర ట్రిపుల్ ఐటీ)లో ఆరేళ్ల బీటెక్‌ కోర్సులో 2024-25 విద్యాసంవత్సరానికి ప్రవేశాలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదలైంది. ఆర్జీయూకేటీ వీసీ ప్రొఫెసర్ వి.వెంకటరమణ మే 27న ప్రవేశ ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ ఏడాది దరఖాస్తు విధానాన్ని SSC బోర్డు సర్వర్‌తో అనుసంధానించినట్లు తెలిపారు. విద్యార్థులకు ఇంటర్‌లో వచ్చిన మార్కుల ఆధారంగా బీటెక్‌లో వివిధ బ్రాంచీల్లోని సీట్లను భర్తీ చేయనున్నట్లు వెంకటరమణ తెలిపారు. తొలి ఏడాదికి ఫీజు రూ.37 వేలు ఉండగా..రీయింబర్స్‌మెంట్ అర్హత ఉన్న వారు ఆ రుసుం చెల్లించాల్సిన అవసరం లేదన్నారు. దానికితోడు రిజిస్ట్రేషన్ ఫీజు రూ.1000, కాషన్ డిపాజిట్ రూ.2 వేలు, ఆరోగ్య బీమా కింద రూ.700... మొత్తం రూ.3,700 అదనంగా చెల్లించాల్సి ఉంటుందన్నారు. ప్రవేశాలకు సంబంధించిన మరిన్ని వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్ లేదా 7416305245, 7416058245, 7416929245 హెల్ప్‌లైన్‌ నెంబర్ల ద్వారా సంప్రదించవచ్చని వీసీ సూచించారు. 
ప్రవేశాలకు సంబంధించిన పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి...