ఆంధ్రప్రదేశ్ గురుకుల విద్యాలయాల సంస్థ నిర్వహణలో ఉన్న డిగ్రీ కళాశాలల్లో ఇంటర్‌లో ప్రవేశాల కోసం నోటిఫికేషన్ విడుదలైంది. ఏపీఆర్‌డీసీ ఉమ్మడి ప్రవేశ పరీక్ష - 2023కు ఏప్రిల్ 4 నుంచి 24 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. ప్రవేశ పరీక్ష హాల్‌టికెట్లను మే 12 నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. మే 20న మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్ష నిర్వహించనున్నారు. ఈ పరీక్ష ఫలితాలను జూన్ 8న ప్రకటిస్తారు. అనంతరం సీట్ల భర్తీ కోసం తొలి విడత కౌన్సెలింగ్ జూన్ 15న, రెండో విడత కౌన్సెలింగ్ జూన్ 22న, మూడో విడత కౌన్సెలింగ్ జూన్ 28న నిర్వహిస్తారు.
వివరాలు...
* ఏపీఆర్‌డీసీ సెట్-2023
సీట్ల సంఖ్య: 152.
అర్హత: ఇంటర్ ఉత్తీర్ణులై ఉండాలి. ఈ ఏడాది ఇంటర్ పరీక్షలకు హాజరైనవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
దరఖాస్తు ఫీజు: రూ.300.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఎంపిక విధానం: ప్రవేశ పరీక్ష ద్వారా.
పరీక్ష విధానం: మొత్తం 150 మార్కులకు రాతపరీక్ష నిర్వహిస్తారు. పరీక్షలో 150 ప్రశ్నలు అడుగుతారు. మల్టీపుల్ ఛాయిస్ విధానంలో ప్రశ్నలు ఉంటాయి. ఇంటర్మీడియట్ స్థాయిలోనే ప్రశ్నలు ఉంటాయి. పరీక్ష సమయం రెండున్నర గంటలు. ఇంగ్లిష్, తెలుగు మాధ్యమాల్లో పరీక్ష ఉంటుంది. ఓఎంఆర్ విధానంలో పరీక్ష ఉంటుంది. రాష్ట్రవ్యాప్తంగా 26 జిల్లా కేంద్రాల్లో పరీక్ష నిర్వహిస్తారు.
ముఖ్యమైన తేదీలు..
* నోటిఫికేషన్ వెల్లడి: 04.04.2023.
* ఆన్‌లైన్ దరఖాస్తు, ఫీజు చెల్లింపు ప్రక్రియ ప్రారంభం: 04.04.2023.
* ఆన్‌లైన్ దరఖాస్తు, ఫీజు చెల్లింపునకు చివరితేది: 24.04.2023
* హాల్‌టికెట్ల విడుదల: 12.05.2023
* పరీక్ష తేది: 20.05.2023. (2.30 PM to 5 PM)
* ఫలితాల వెల్లడి: 08.06.2023.
Also Read:
మిగతా 'పది' పరీక్షలు షెడ్యూలు ప్రకారమే, ఇన్విజిలేటర్ల సెల్‌ఫోన్లపై ప్రత్యేక దృష్టి!
వికారాబాద్ జిల్లా తాండూరులోని ప్రభుత్వ పాఠశాల-1లో సోమవారం ఉదయం తెలుగు ప్రశ్నాపత్రం బయటకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 4న జరిగే పరీక్ష వాయిదా వేసినట్లు సోషల్ మీడియాలో కథనాలు వచ్చాయి. ఈ కథనాలపై రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ స్పందించింది. ఏప్రిల్ 4న జరుగనున్న పదోతరగతి పరీక్ష వాయిదా పడలేదని పాఠశాల విద్యాశాఖ స్పష్టం చేసింది. విద్యార్థులు, తల్లిదండ్రులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపింది. ఏప్రిల్ 4 నుంచి 13 వరకు అన్ని పరీక్షలు నిర్వహిస్తామని స్పష్టం చేసింది. ఇక తెలుగు ప్రశ్నాపత్రాన్ని వాట్సాప్ ద్వారా బయటకు పంపిన వ్యవహారంలో నలుగురు ఉద్యోగులను సస్పెండ్ చేసినట్లు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ శ్రీదేవసేన ప్రకటించారు.
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..
ఇంటర్ అకడమిక్ క్యాలెండర్ విడుదల, ఈ ఏడాది వచ్చే సెలవులివే!
తెలంగాణలో జూనియర్ కళాశాలల అకడమిక్ క్యాలెండర్‌ని ఇంటర్మీడియట్ బోర్డు ప్రకటించింది. రాష్ట్రంలోని అన్ని జూనియర్ కళాశాలలు జూన్ 1న ప్రారంభమవుతాయిన బోర్డు అధికారులు ఏప్రిల్ 1న వెల్లడించారు. జూన్ 1 నుంచే తరగతులు కూడా ప్రారంభమవుతాయని తెలిపారు. ఈ మేరకు 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించిన తాత్కాలిక విద్యా క్యాలెండర్ బోర్డు వెలువరించింది.
అకడమిక్ క్యాలెండర్ కోసం క్లిక్ చేయండి..
సైనిక పాఠశాలలో ఆరో తరగతి, ఇంటర్ ప్రవేశ ప్రకటన విడుదల-పరీక్ష ఎప్పుడంటే?
ఎన్‌డీఏ, ఎస్‌ఎస్‌బీ తదితర సైనిక దళాల్లో అధికారుల నియామకాల ఉద్యోగాల కల్పనే ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం వరంగల్ జిల్లా అశోక్ నగర్‌లో తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ సొసైటీ సైనిక పాఠశాలను బాలుర కోసం ప్రత్యేకంగా ప్రారంభించింది. పాఠశాలలో సైనిక శిక్షణే ప్రధానాంశంగా ఉంటుంది. ఇందుకు సంబంధించి హైదరాబాద్‌లోని తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ(టీటీడబ్ల్యూఆర్‌ఈఐఎస్)... 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించి వరంగల్ జిల్లా అశోక్ నగర్‌లో బాలుర సైనిక స్కూల్ ఆరో తరగతి (సీబీఎస్‌ఈ సిలబస్), ఇంటర్మీడియట్(ఎంపీసీ- సీబీఎస్ఈ సిలబస్)లో ప్రవేశాలకి అర్హులైన విద్యార్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
ప్రవేశాలకు సంబంధించిన పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.