ఏపీ పాలిసెట్ ప్రవేశాల కౌన్సెలింగ్‌‌కు సంబంధించి దరఖాస్తు గడువును ఆగ‌స్టు 11 వరకు పొడిగించారు. ఆన్‌లైన్‌ ఫీజు చెల్లింపు, దరఖాస్తు సమర్పణ, సర్టిఫికెట్ల పరిశీలనకు ఆగస్టు 11 వరకు గడువును అధికారులు పొడిగించారు. ఆగస్టు 3న టెన్త్‌ అడ్వాన్స్‌ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు వెలువడిన నేపథ్యంలో.. ఆ విద్యార్థులకు మేలు కలిగేలా పాలిసెట్‌ అడ్మిషన్ల షెడ్యూల్‌లో మార్పులు చేశారు.

తాజా షెడ్యూల్‌ ప్రకారం.. ఆగస్ట్‌ 6 నుంచి 11 వరకు పాలిసెట్ ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చు. ఆగస్టు 12 వరకు ఆప్షన్ల సవరణకు అవకాశం ఉంది. అభ్యర్థులకు ఆగస్టు 16న సీట్లను కేటాయించనున్నారు. ఆగస్టు 22 నుంచి తరగతులను ప్రారంభంకానున్నాయి. Revised Schedule of Counselling Website

ఏపీలో ఏపీ పాలిసెట్ 2022 పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఏడాది పాలిటెక్నిక్ కళాశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన పాలిసెట్ ఫలితాలను ఇవాళ విజయవాడలో నైపుణ్యాల అభివృద్ధి శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ విడుదల చేశారు. ఈ ఫలితాల్లో పరీక్ష రాసిన వారిలో 91.84 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు.

Also Read: పేద విద్యార్థుల జీవితాల్లో ‘పరివర్తనం’ - హెచ్‌డీఎఫ్‌సీ పరివర్తన్‌ స్కాలర్‌షిప్‌ ఈ ఏడాది పాలిసెట్ ప్రవేశపరీక్షను ప్రభుత్వం మే 29న నిర్వహించింది. పరీక్ష కోసం మొత్తం 1,38,189 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 1,31,627 మంది పరీక్ష రాశారు. వీరిలో 91.84 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. వీరిలో 90.56 శాతం మంది బాలురు, 93.96 శాతం బాలికలు ఉత్తీర్ణులు అయ్యారు. వీరికి కేటాయించిన ర్యాంకుల ఆధారంగా కౌన్సిలింగ్ నిర్వహించి ప్రవేశాలు ఖరారు చేస్తారు. పాలిటెక్నిక్‌, డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు మే 29న రాష్ట్ర వ్యాప్తంగా 404 పరీక్ష కేంద్రాల్లో పాలిసెట్‌ ప్రవేశపరీక్ష జరిగిన విషయం తెలిసిందే. ముందుగా ప్రకటించిన షెడ్యూలు ప్రకారం జులై 27 నుంచి పాలిసెట్ వెబ్‌కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. జులై 27 నుంచి ఆగస్టు వరకు అభ్యర్థులు ఫీజు చెల్లించడానికి అవకాశం కల్పించారు. ఫీజుగా ఓసీ, బీసీ అభ్యర్థులకు రూ.900; ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.500 గా నిర్ణయించారు. జులై 29 నుంచి ఆగస్టు 5 వరకు సర్టిఫికేషన్ వెరిఫికేషన్ నిర్వహించనున్నారు. ఇక అభ్యర్థులు తమ ర్యాంకుల వారీగా ఆగస్టు 6 నుంచి 16 వరకు వెబ్ ఆప్షన్ల నమోదుకు అవకాశం కల్పించారు. 

Read Also: బీసీ విద్యార్థులకు గుడ్‌న్యూస్, పీఎం యశస్వీ స్కాలర్‌షిప్ దరఖాస్తులు షురూ! ఇక తాజాగా ఏపీ పదోతరగతి సప్లిమెంటరీ ఫలితాలు వెలువడటంతో విద్యార్థుల వెసులుబాటు కోసం దరఖాస్తు గడువును ఆగ‌స్టు 11 వరకు పొడిగించారు. ఆన్‌లైన్‌ ఫీజు చెల్లింపు, దరఖాస్తు సమర్పణ, సర్టిఫికెట్ల పరిశీలనకు ఆగస్టు 11 వరకు గడువును అధికారులు పొడిగించారు. ఆగస్ట్‌ 6 నుంచి 11 వరకు పాలిసెట్ ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చు. ఆగస్టు 12 వరకు ఆప్షన్ల సవరణకు అవకాశం ఉంది. అభ్యర్థులకు ఆగస్టు 16న సీట్లను కేటాయించనున్నారు. ఆగస్టు 22 నుంచి తరగతులు ప్రారంభంకానున్నాయి. ట్యూషన్ ఫీజు ఎంతంటే..?పాలిసెట్ ద్వారా సంబంధిత కళాశాలలో ప్రవేశాలు పొందిన అభ్యర్థులు ట్యూషన్ ఫీజు కింద ప్రభుత్వ ఎయిడెడ్ పాలిటెక్నిక్ అయితే రూ.4,700; ప్రయివేట్ అన్ ఎయిడెడ్, సెకడండ్ షిఫ్ట్ ఇంజినీరింగ్ కళాశాలలు అయితే రూ.25,000 చెల్లించాల్సి ఉంటుంది. నిబంధనల ప్రకారం ఫీజురీయింబర్స్‌మెంట్ అందిస్తారు. 01-07-2021 నాటికి ఓసీ అభ్యర్థులు 20 సంవత్సరాలు, ఎస్సీ,ఎస్టీ,బీసీ అభ్యర్థులు 24 సంవత్సరాలలోపు ఉండాలి. వీరికి మాత్రమే ఫీజు రీయింబర్స్‌మెంట్ వర్తిస్తుంది.

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..