టెక్నికల్‌ టీచర్స్‌ సర్టిఫికెట్‌ 42 రోజుల సమ్మర్‌ ట్రైనింగ్‌ కోర్సుకు (టీసీసీ) దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్‌ కృష్ణారావు తెలిపారు. హైదరాబాద్‌, హన్మకొండ, నిజామాబాద్‌, నల్గొండ, కరీంనగర్‌ జిల్లాల్లో కోర్సుకు సంబంధించిన శిక్షణను ఇవ్వనున్నట్లు తెలిపారు.ఆయా జిల్లా డీఈఓలను సంప్రదించి దరఖాస్తు ప్రక్రియ గురించి వివరాలు తెలుసుకోవచ్చు. మే 1 నుంచి జూన్‌ 11 వరకు కోర్సు శిక్షణ ఉంటుందని తెలిపారు. అభ్యర్థులు ఏప్రిల్ 21 నుంచి 30 వరకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నట్ల పేర్కొన్నారు.


నలబై రెండు రోజుల శిక్షణ భవితకు రక్షణగా నిలుస్తోంది. ప్రభుత్వ ఉద్యోగం దక్కాలంటే గగనం అవుతున్న ఈ తరుణంలో సులభంగా ఉద్యోగ యోగం సాకారం అయ్యే కోర్సుపై పలువురు ఆసక్తి చూపుతున్నారు. ఎక్కువగా మహిళలు శిక్షణ పొంది ధ్రువపత్రాలు అందుకొని ఉద్యోగాలు పొందుతున్నారు. అందుకే టెక్నికల్‌ టీచర్స్‌ సర్టిఫికెట్‌ (టీటీసీ) కోర్సుకు ఏటా డిమాండ్‌ పెరుగుతోంది.


పాఠశాల స్థాయిలో బాలబాలికలకు వృత్తి నైపుణ్యం అందివ్వాల్సి ఉంటుంది. విద్యార్థులకు వృత్తి నైపుణ్యం అందివ్వాలన్నదే ధ్యేయం. ఆదర్శ పాఠశాలల్లో ప్రత్యేకంగా వృత్తి విద్య కోర్సులు ప్రవేశ పెట్టి పదోతరగతి పూర్తయ్యేలోపు అదనంగా మరో సర్టిఫికెట్‌ విద్యార్థులకు ఇస్తున్నారు. విద్యార్థులకు వృత్తి నైపుణ్యం అందివ్వాలన్నదే ధ్యేయం. ఆదర్శ పాఠశాలల్లో ప్రత్యేకంగా వృత్తి విద్య కోర్సులు ప్రవేశ పెట్టి పదోతరగతి పూర్తయ్యేలోపు అదనంగా మరో సర్టిఫికెట్‌ విద్యార్థులకు ఇస్తున్నారు. 


Also Read:


బీఈడీ, బీపీఈడీ కోర్సుల్లో పెంచిన ఎస్టీ రిజర్వేషన్లు, ఉత్తర్వులు జారీ!
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గతంలో పెంచిన ఎస్టీ రిజర్వేషన్లను అమలు చేయనుంది. బీఈడీ, బీపీఈడీ, యూజీడీపీఈడీ కోర్సుల ప్రవేశాల్లో అమలు చేయనున్నట్లు ఈమేరకు రెండు జీవోలను విడుదల చేసింది. వృత్తిపరమైన ఈ కోర్సుల్లో ఎస్టీలకు గతంలో ప్రభుత్వం 6 శాతం నుంచి 10 శాతంకు పెంచిన రిజర్వేషన్లను అమలు చేయాలని తెలంగాణ ఉన్నత విద్యామండలి ప్రభుత్వానికి ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదనను పరిశీలించిన ప్రభుత్వం ఈమేరకు ఈ కోర్సుల్లో రిజర్వేషన్‌ పెంపు అమలుకు ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఎస్టీ విద్యార్థులకు ఎంతో ప్రయోజనం చేకూరనుంది.
పూర్తివివరాల కోసం క్లి్క్ చేయండి..


పాలిసెట్‌ – 2023 ప్రవేశ పరీక్షకు ఉచిత శిక్షణ, పరీక్ష వివరాలు ఇలా!
ఇంజినీరింగ్ అవసరం లేకుండా, చిన్న వయసులోనే సులువుగా ఉపాధి, ఉద్యోగ అవకాశాలు పొందడానికి 'పాలిటెక్నిక్‌ విద్య' ఉత్తమమైన మార్గమని రాష్ట్ర సాంకేతిక విద్యా శాఖ కమీషనర్‌ చదలవాడ నాగరాణి తెలిపారు. యువతను పాలిటెక్నిక్‌ విద్య వైపు మళ్లించే చర్యలలో భాగంగా అన్ని ప్రభుత్వ పాలిటెక్నిక్‌ లలో పాలిసెట్‌ – 2023 కోసం ఉచిత శిక్షణ అందిస్తున్నామన్నారు. పదోతరగతి విద్యార్ధుల్లో అవగాహన కలిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నామన్నారు. ఇప్పటికే పాలిసెట్‌ తొలివిడద కోచింగ్‌ ప్రక్రియ ఏప్రిల్ 17న ప్రారంభించగా,  ఏప్రిల్ 24 నుండి మరో బ్యాచ్‌ ప్రారంభిస్తున్నామని నాగరాణి వివరించారు. శిక్షణ పొందిన ప్రతి విద్యార్ధికి ఇంగ్లీష్‌, తెలుగు మీడియంలలో ఉచిత స్టడీ మెటీరియల్‌ అందిస్తున్నామన్నారు.
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..