తెలంగాణలోని మహాత్మా జోతిబా ఫులే బీసీ గురుకులాల్లో బీఎస్సీ కోర్సులో ప్రవేశాల కోసం నోటిఫికేషన్ వెలువడిన సంగతి తెలిసిందే. దరఖాస్తు గడువు జులై 31తోనే ముగియగా.. ఆగస్టు 16 వరకు పొడిగించారు. తెలంగాణకు చెందిన మహిళా అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. వనపర్తి, కరీంనగర్‌‌లోని అగ్రికల్చరల్‌ కాలేజీల్లో ప్రవేశాలు కల్పించనున్నారు. ఎంసెట్‌, అగ్రిసెట్‌ ర్యాంకుల ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు. సరైన అర్హతలున్నవారు ఆగస్టు 16న సాయంత్రం 5 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు.


వివరాలు..


* బీఎస్సీ(ఆనర్స్‌) అగ్రికల్చర్‌ కోర్సు 


సీట్ల సంఖ్య: 240 (బీసీ - 180 , ఎస్సీ- 36, ఎస్టీ- 12, ఓసీ/ఈబీసీ-5, అనాథలు-7).


కోర్సు వ్యవధి: నాలుగేళ్లు.


అగ్రికల్చరల్‌ కాలేజీలు: వనపర్తి, కరీంనగర్‌. 


అర్హతలు: ఇంటర్‌ (బయాలజీ, ఫిజికల్‌ సైన్సెస్‌) ఉత్తీర్ణులై ఉండాలి. ఎంసెట్‌, అగ్రిసెట్‌ ర్యాంకు కలిగి ఉండాలి. తెలంగాణకు చెందిన మహిళా అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. గ్రామీణ ప్రాంతాల్లో నివసించే అభ్యర్థులు అయితే వారి తల్లిదండ్రుల వార్షికాదాయం రూ.లక్షన్నరకు మించకూడదు. పట్టణ ప్రాంతాల వారైతే రూ.2 లక్షలకు మించరాదు.


వయోపరిమితి: 17 – 22 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు అయితే 25 సంవత్సరాలు మించరాదు.


దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.


ఎంపిక విధానం: ఎంసెట్‌, అగ్రిసెట్‌ ర్యాంకుల ఆధారంగా ఈ కాలేజీల్లో ప్రవేశాలను కల్పిస్తారు.


దరఖాస్తు ఫీజు: రూ.1000.


* ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేదీ: 16.08.2023.


Pay Application Registration Fee


Notification


Website


ALSO READ:


GATE 2024: 'గేట్‌-2024' షెడ్యూలు వచ్చేసింది, ఆగస్టు 24 నుంచి దరఖాస్తుల స్వీకరణ
దేశంలోని ఐఐటీలతోపాటు ఇతర ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థల్లో ఎంటెక్, పీహెచ్‌డీ తదితర కోర్సుల్లో ప్రవేశాలకు ఏటా నిర్వహించే గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజినీరింగ్(GATE-2024) దరఖాస్తు ప్రక్రియ ఆగస్టు 24 నుంచి ప్రారంభంకానుంది. ఈసారి గేట్ నిర్వహణ బాధ్యతను బెంగళూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్‌(ఐఐఎస్‌సీ) చేపట్టింది. 'గేట్‌'లో ఇప్పటివరకు మొత్తం 29 ప్రశ్నపత్రాల్లో పరీక్షలు జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈసారి కొత్తగా డేటా సైన్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(డీఏ) ప్రశ్నపత్రాన్ని ప్రవేశపెట్టనున్నారు. దీంతో గేట్ పరీక్షలో మొత్తం పేపర్ల సంఖ్య 30కి చేరినట్లయింది.
గేట్-2024 వివరాల కోసం క్లిక్ చేయండి..


ఆర్‌ఐఎంసీలో 8వ తరగతి ప్రవేశాలకు నోటిఫికేషన్‌, వివరాలు ఇలా!
డెహ్రాడూన్‌‌లోని రాష్ట్రీయ ఇండియన్‌ మిలిటరీ కాలేజ్‌(ఆర్‌ఐఎంసీ)లో ఎనిమిదో తరగతి (2024 జులై సెషన్) ప్రవేశాలకు ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (ఏపీపీఎస్సీ) నోటిఫికేషన్‌ విడుదల చేసింది. స్థానిక బాలురు, బాలికలు దరఖాస్తు చేసుకోవచ్చు. రాత పరీక్ష, వైవా, మెడికల్‌ ఎగ్జామినేషన్‌ ద్వారా ప్రవేశాలు కల్పిస్తారు. సరైన అర్హతలున్న విద్యార్థులు అక్టోబరు 15 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. వీరికి డిసెంబరు 2న ప్రవేశపరీక్ష నిర్వహిస్తారు.
ప్రవేశాల పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..


కాళోజీ వర్సిటీలో మాస్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ కోర్సు, డిగ్రీ అర్హత చాలు
తెలంగాణలో మాస్టర్‌ ఆఫ్‌ పబ్లిక్‌ హెల్త్‌ (ఎంపీహెచ్‌) కోర్సులో ప్రవేశాలకు కాళోజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ప్రవేశ పరీక్ష ద్వారా సీట్లను భర్తీ చేస్తారు. ఏదైనా డిగ్రీ అర్హత ఉన్న అభ్యర్థులు ఆగస్టు 1 నుంచి 13 వరకు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తులు సమర్పించవచ్చు. కంప్యూటర్‌ ఆధారిత ప్రవేశపరీక్షను ఆగస్టు 27న నిర్వహించనున్నారు. సెప్టెంబర్‌ 2న ఫలితాలు వెల్లడించనున్నారు. 
కోర్సు వివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..