ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి 2023 విద్యా సంవత్సరానికి సంబంధించి ఏపీ పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ ఇంజినీరింగ్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌.2023(ఏపీ పీజీఈసెట్‌) నోటిఫికేషన్‌ను విడుదలచేసింది. మార్చి 21న దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. ఏప్రిల్ 30 వరకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగనుంది. ఇక రూ.500 ఆలస్య రుసుముతో మే 6 వరకు, రూ.2000 ఆలస్య రుసుముతో మే 10 వరకు.. చివరగా రూ.5000 ఆలస్య రుసుముతో  మే 14 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. సంబంధిత సబ్జెక్టుల్లో బీటెక్‌/బీఫార్మసీ ఉత్తీర్ణత పొందిన/చివరి ఏడాది పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే గేట్‌/జీప్యాట్‌ అర్హత సాధించిన అభ్యర్థులకు వేరుగా నోటిఫికేషన్‌ విడుదలచేస్తారు. 


వివరాలు...


* ఏపీపీజీఈసెట్ . 2023


కోర్సులు: ఎంటెక్, ఎంఫార్మసీ, ఫార్మ్.డి.


అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో బీటెక్‌/బీఫార్మసీ ఉత్తీర్ణత పొందినవారు దరఖాస్తుకు అర్హులు. చివరి ఏడాది పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. 


దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.


దరఖాస్తు ఫీజు: దరఖాస్తు ఫీజుగా ఓసీ అభ్యర్థులు రూ.1200, బీసీ అభ్యర్థులు రూ.900, ఎస్సీ.ఎస్టీ అభ్యర్థులు రూ.700 చెల్లించాలి.


ఎంపిక విధానం: ఆన్‌లైన్‌ కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.


పరీక్ష విధానం: మొత్తం  120 మార్కులకు కంప్యూటర్ ఆధారిత రాతపరీక్ష నిర్వహిస్తారు. ఆబ్జెక్టివ్ విధానంలో ప్రశ్నలు అడుగుతారు. ఇంగ్లిష్ మీడియలోనే ప్రశ్నలు ఉంటాయి. పరీక్షలో ఎలాంటి నెగెటివ్ మార్కులు ఉండవు. విద్యార్థులకు డిగ్రీ స్థాయిలో చదివిన సబ్జెక్టుల నుంచే ప్రశ్నలు ఇస్తారు. అభ్యర్థుల సౌలభ్యం కోసం మాక్ టెస్టులకు వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. పరీక్షలో కనీసం అర్హత మార్కులను 25 శాతం అంటే 30 మార్కులుగా నిర్ణయించారు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఎలాంటి కనీస అర్హత మార్కులు లేవు. 


ముఖ్యమైన తేదీలు...


➥ నోటిఫికేషన్ వెల్లడి: 19.03.2023.


➥ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 21.03.2023.


➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 30.04.2023.


➥ రూ.500 ఆలస్యరుసముతో దరఖాస్తుకు చివరితేది: 01.05.2023 . 06.05.2023.


➥ రూ.2000 ఆలస్యరుసముతో దరఖాస్తుకు చివరితేది: 07.05.2023 . 10.05.2023.


➥ రూ.5000 ఆలస్యరుసముతో దరఖాస్తుకు చివరితేది: 11.05.2023 . 14.05.2023.


➥ దరఖాస్తుల సవరణకు అవకాశం: 15.05.2023 . 16.05.2023.


➥ హాల్‌టికెట్ల డౌన్‌లోడ్: 22.05.2023 నుంచి.


➥ పీజీఈసెట్ పరీక్ష తేది: 28.05.2023 . 30.05.2023 వరకు.


పరీక్ష సమయం: మొదటి సెషన్: ఉ.10.00 గం. . మ.12.00 గం., రెండో సెషన్: మ. 03.00 గం. . సా. 5.00 గం. వరకు


Notifiction


Online Application


Also Read:


JEE Advanced 2023: జూన్‌ 4న జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష - దరఖాస్తు ప్రారంభం ఎప్పుడంటే?
జేఈఈ అడ్వాన్స్‌డ్‌ 2023 పరీక్ష షెడ్యూలు ఇటీవల వెల్లడైన సంగతి తెలిసిందే. ఈ ఏడాది జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్షను ఐఐటీ గువాహటి నిర్వహించనుంది. దేశవ్యాప్తంగా జూన్‌ 4న జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష నిర్వహించనుంది. జేఈఈ మెయిన్ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు ఏప్రిల్‌ 30 నుంచి మే 7 వరకు ఆన్‌లైన్‌ దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
జేఈఈ అడ్వాన్స్‌డ్ 2023 పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..


జేఈఈ మెయిన్‌ సెషన్‌ 2 అడ్మిట్ కార్డులు వచ్చేస్తున్నాయి, ఎప్పుడంటే?
దేశంలోని ప్రఖ్యాత విద్యా సంస్థల్లో ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే జేఈఈ మెయిన్ 2023 సెషన్-2కు సంబంధించి అడ్మిట్ కార్డులను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ త్వరలోనే విడుదల చేయనుంది. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం ఏప్రిల్ 6 నుంచి 12 వరకు సెషన్-2 పరీక్షలు జరుగనున్నాయి. ఈ పరీక్షల అడ్మిట్ కార్డులను వారం రోజుల్లో అడ్మిట్ కార్డులను విడుదల చేయనున్నట్టు ఎన్టీఏ తెలిపింది. 
పరీక్ష పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి.. 


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..