ఏపీ ఓపెన్ స్కూల్ సొసైటీ 2022-23 విద్యా సంవత్సరానికి పదోతరగతి, ఇంటర్మీడియట్ కోర్సులలో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది. చదువుకోవాలని కోరిక వుండి వివిధ కారణాల వల్ల చదువు కొనసాగించలేనివారి కోసం ముఖ్యంగా బాలికలు, గ్రామీణ యువత, పనిచేయి స్త్రీ, పురుషులు, ఎస్సీలు, ఎస్టీలు, ప్రత్యేక అవసరాలు గల వారికి  విద్యనందించడమే ఓపెన్ స్కూల్ యొక్క ముఖ్య ఉద్దేశం.

వివరాలు..

* ఓపెన్ టెన్త్, ఇంటర్ ప్రవేశాలు 2022-23

1)  పదోతరగతి ప్రవేశాలు

అర్హతలు: అభ్యర్థి ఏదైనా పాఠశాలలో చదివినట్లయితే, టీసీ/ రికార్డ్ షీట్ సమర్పించాలి. లేదా అభ్యర్థి ఏ పాఠశాలలోనైనా ప్రవేశం పొందకపోయినా పదో తరగతి చదివే సామర్థ్యం ఉన్నా అర్హులే. 

వయోపరిమితి: 2022, ఆగస్టు 31 నాటికి కనీస వయస్సు 14 సంవత్సరాలు నిండి ఉండాలి. గరిష్ఠ వయోపరిమితి లేదు.

2)  ఇంటర్ ప్రవేశాలు 

గ్రూపులు: ఎంపీసీ, బైపీసీ, ఎంబైపీసీ, ఎంఈసీ, హెచ్ఈసీ, సీఈసీ.

అర్హతలు: గుర్తింపు పొందిన బోర్డు నుంచి పదోతరగతి ఉత్తీర్ణత.

వయోపరిమితి: 2022, ఆగస్టు 31 నాటికి కనీస వయస్సు 15 సంవత్సరాలు. ప్రవేశానికి గరిష్ఠ వయోపరిమితి లేదు.

బోధనా మాధ్యమం: తెలుగు, ఉర్దూ, ఇంగ్లీషు మరియి ఒరియా భాషల్లో ఏదైనా ఒక మాధ్యమాన్ని ఎంచుకోవచ్చు.

ప్రవేశ కాలపరిమితి: ఓపెన్ స్కూల్‌లోని ఏకోర్సులోనైన రిజిస్ట్రేషన్ పొందిన నాటి నుండి 5 సంవత్సరాల వరకు అడ్మిషన్ చెల్లుబాటు అవుతుంది.

పరీక్షా విధానం: ఏపీ ఓపెన్ స్కూల్ సంవత్సరంలో రెండుసార్లు పబ్లిక్ పరీక్షలను నిర్వహిస్తుంది. అభ్యర్ధులు రిజిస్ట్రేషన్ అయిన ఐదు సంవత్సరాల కాలంలో తొమ్మిదిసార్లు పబ్లిక్ పరీక్షలకు హాజరుకావొచ్చు. ప్రతి సంవత్సరం మార్చి/ఏప్రిల్ మరియి జూలై/ఆగస్టు సమయాలలో పరీక్షలు నిర్వహిస్తారు. ఫీజు వివరాలు:  * పదోతరగతి ప్రవేశాల కోసం జనరల్ పురుష అభ్యర్థులు రిజిస్ట్రేషన్ ఫీజుగా రూ.100 చెల్లించాలి. అన్ని వర్గాల స్త్రీలు, ఎస్సీ,ఎస్సీ, బీసీ, దివ్యాంగులు, ట్రాన్స్‌జెండర్, ఎక్స్-సర్వీస్‌మెన్ విభాగాలకు చెందినవారికి ఫీజు నుంచి మినహాయింపు ఉంది.  అడ్మిషన్ ఫీజు కింద జనరల్ పురుష అభ్యర్థులు 5 సబ్జెక్టుల వరకు రూ.1300, ఇతరులు రూ.900 చెల్లించాలి. ఇక మైగ్రేషన్ ఉన్నవారు రూ.200 చెల్లించాలి. ఒక్కో అదనపు సబ్జెక్టుకు రూ.200 అదనంగా చెల్లించాలి. * ఇంటర్ ప్రవేశాల కోసం జనరల్ పురుష అభ్యర్థులు రిజిస్ట్రేషన్ ఫీజుగా రూ.200 చెల్లించాలి. అన్ని వర్గాల స్త్రీలు, ఎస్సీ,ఎస్సీ, బీసీ, దివ్యాంగులు, ట్రాన్స్‌జెండర్, ఎక్స్-సర్వీస్‌మెన్ విభాగాలకు చెందినవారికి ఫీజు నుంచి మినహాయింపు ఉంది. అడ్మిషన్ ఫీజు కింద జనరల్ పురుష అభ్యర్థులు 5 సబ్జెక్టుల వరకు రూ.1400, ఇతరులు రూ.1100 చెల్లించాలి. ఒక్కో అదనపు సబ్జెక్టుకు రూ.200 అదనంగా చెల్లించాలి.   

ముఖ్యమైనతేదీలు..

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 05.10.2022.

నిర్ణీత రుసుముతో అడ్మిషన్ ఫీజు చెల్లింపు చివరి తేదీ: 07.10.2022.

ఆన్‌లైన్  దరఖాస్తుకు చివరి తేదీ (ఆలస్య రుసుముతో): 26.10.2022.

రూ.200 ఆలస్య రుసుముతో అడ్మిషన్ ఫీజు చెల్లింపునకు చివరి తేదీ: 28.10.2022

 

SSC Aposs 2022 - 23 Prospectus

 

Inter Aposs 2022 - 23 Prospectus 

 

REGISTRATION FORM FOR SSC & INTER 

 

APPLY FOR SSC & INTER

 

Website 

 

Also Read:NVS: నవోదయ విద్యాలయాల్లో తొమ్మిదో తరగతి ప్రవేశాలు, పరీక్ష ఎప్పుడంటే?జవహర్ నవోదయ విద్యాలయాల్లో 2023-24 విద్యా సంవత్సరానికి గాను తొమ్మిదో తరగతిలో ప్రవేశాల కోసం నవోదయ విద్యాలయ సమితి ప్రకటన విడుదల చేసింది. దీనిద్వారా దేశవ్యాప్తంగా ఉన్న  650 జవహర్ నవోదయ విద్యాలయాల్లో 9వ తరగతి ప్రవేశాలు కల్పిస్తారు. రాతపరీక్ష ఆధాంగా విద్యార్థులను ఎంపికచేస్తారు. ప్రస్తుతం 8వ తరగతి చదువుతున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.ప్రవేశప్రకటన, ఎంపిక విధానం వివరాల కోసం క్లిక్ చేయండి..

Also Read:

AUSDE: ఏయూ దూరవిద్య కోర్సుల నోటిఫికేషన్‌ విడుదలవిశాఖపట్నంలోని ఆంధ్ర యూనివర్సిటీ 2022-23 విద్యా సంవత్సరానికి సంబంధించి దూరవిద్య కోర్సుల్లో ప్రవేశానికి నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఏయూ స్కూల్ ఆఫ్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ద్వారా డిగ్రీ, పీజీ, డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలు కల్పించనున్నారు. ఆంధ్ర యూనివర్సిటీ ఏడాదిలో రెండు సార్లు దూరవిద్య ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేస్తుంటుంది. ఆయా కోర్సుల్లో ప్రవేశాలు పొందాలనుకునే అభ్యర్థులు నోటిఫికేషన్‌లో సూచించినట్లు ఇంటర్‌, డిగ్రీ కోర్సులో ఉత్తీర్ణులై ఉండాలి. ఈ కోర్సుల్లో ప్రవేశాలకు ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ సెప్టెంబరు 5 నుంచి ప్రారంభమైంది. ఆసక్తి, అర్హతలు ఉన్న అభ్యర్థులు సెప్టెంబరు 10 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. రూ.500 ఆలస్య రుసుంతో అక్టోబర్‌ 31 వరకు దరఖాస్తు చేసుకునే వెసులుబాటు కల్పించారు. నోటిఫికేషన్ తదితర వివరాల కోసం క్లిక్ చేయండి

 

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..