ఆంధ్రప్రదేశ్‌లో ఎంసీఏ, ఎంబీఏ కోర్సు్లో ప్రవేశాలకు నిర్దేశించిన ఏపీఐసెట్-2022 కౌన్సెలింగ్ ప్రక్రియ అక్టోబరు 9న ప్రారంభమైంది. ఐసెట్ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం స్లాట్ బుకింగ్ చేసుకోవాలి. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం అక్టోబరు 9 నుంచి 22 వరకు కౌన్సెలింగ్ ప్రక్రియ కొనసాగనుంది. అభ్యర్థులు కౌన్సెలింగ్ రిజిస్ట్రేషన్ ఫీజుగా రూ.1200 చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.600 చెల్లిస్తే సరిపోతుంది.

ఐసెట్ షెడ్యూలు ఇలా..

✦ అక్టోబరు 9 నుంచి 12 వరకు అభ్యర్థులు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. 
✦ రిజిస్ట్రేషన్ చేసుకున్నవారికి అక్టోబరు 10 నుంచి 14 మధ్య సర్టిఫికేట్ వెరిఫికేషన్ నిర్వహిస్తారు.
✦ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అభ్యర్థులు అక్టోబరు 14 నుంచి 16 వరకు వెబ్ఆప్షన్లు నమోదుచేసుకోవాల్సి ఉంటుంది.
✦అభ్యర్థులు అక్టోబరు 17న వెబ్ ఆప్షన్లలో ఏమైనా మార్పులు ఉంటే సరిచేసుకోవచ్చు.
✦ అక్టోబరు 19న అభ్యర్థులకు సీట్లను కేటాయిస్తారు.
✦ సీట్లు పొందినవారు అక్టోబరు 20 నుంచి 22 మధ్య సంబంధిత కళాశాలల్లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది.

అక్టోబరు 9 నుంచి 12 వరకు రిజిస్ట్రేషన్
అక్టోబరు 10 నుంచి 14 వరకు సర్టిఫికేట్ వెరిఫికేషన్
అక్టోబరు 14 నుంచి 16 వరకు వెబ్‌ఆప్షన్లు
అక్టోబరు 17 వెబ్ఆప్షన్ల మార్పు
అక్టోబరు 19 సీట్ల కేటాయింపు
అక్టోబరు 20 నుంచి 22 వరకు కాలేజీలో రిపోర్టింగ్
తరగతులు ప్రారంభం అక్టోబరు 24 నుంచి


AP ICET 2022 కౌన్సెలింగ్ కోసం ఎలా దరఖాస్తు చేయాలి?

✦ AP ICET కౌన్సెలింగ్ వెబ్‌సైట్, https://icet-sche.aptonline.in/ వెళ్లాలి.
✦ ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాలి.
✦ రిజిస్ట్రేషన్ నంబర్, ఇతర వివరాలను నమోదు చేసి లాగిన్ కావాలి.
✦ అవసరమైన వివరాలను నింపాలి.
✦ బుక్ స్లాట్, సర్టిఫికేట్ వెరిఫికేషన్‌ ఎంచుకోవాలి.
✦ ఎంపిక నమోదు కోసం లాగిన్ చేయాలి.
✦ సేవ్ చేసిన ఎంపిక ప్రక్రియను ప్రింట్ తీసుకుని.. లాగ్ అవుట్ చేయండి.

కౌన్సెలింగ్ వెబ్‌సైట్:   https://icet-sche.aptonline.in/ICET/Views/index.html


కావాల్సిన డాక్యుమెంట్లు..

  • ఏపీ ఐసెట్ 2022 హాల్‌టికెట్
  •  ఏపీ ఐసెట్ 2022 ర్యాంకు కార్డు
  • ట్రాన్స్‌ఫర్ సర్టిఫికేట్ (టీసీ)
  • డిగ్రీ మార్కుల మెమో, ప్రొవిజనల్ సర్టిఫికేట్
  • ఇంటర్ లేదా డిప్లొమా మార్కుల మెమో
  • పదోతరగతి మార్కుల మెమో
  • 9వ తరగతి నుంచి డిగ్రీ వరకు స్టడీ సర్టిఫికేట్లు
  • రెసిడెన్స్ సర్టిఫికేట్
  • ఇన్‌కమ్ సర్టిఫికేట్
  • కులధ్రువీకరణ సర్టిఫికేట్
  • ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్
  • లోకల్ సర్టిఫికేట్
  • NCC/CAP, మైనార్టీ అభ్యర్థులు సంబంధిత సర్టిఫికేట్లు కలిగి ఉండాలి.

Counselling Notification


ఏపీలోని పీజీ కళాశాలల్లో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి జూలై 25న రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన ఏపీ ఐసెట్‌(AP ICET)-2022 ఫలితాలను ఆగస్టు 8న విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఫలితాలతోపాటు ఐసెట్ ర్యాంకు కార్డులను కూడా ఏపీ ఉన్నత విద్యా మండలి అధికారులు విడుదల చేశారు. ఈ ఫలితాల్లో మొత్తం 87.83 శాతం మంది అర్హత సాధించారు. ఏపీ ఐసెట్-2022 పరీక్షకు మొత్తం 42,496 మంది హాజరుకాగా 37,326 మంది అర్హత సాధించారు. ఫలితాల్లో అత్యధికంగా బాలురు 87.98 శాతం పాస్‌ అయ్యారు. ఇక అమ్మాయిలు విషయానికొస్తే 87.68 శాతం ఉత్తీర్ణత సాధించారు. 

 

Also Read:

నేషనల్‌ లా యూనివర్సిటీ ప్రవేశాలకు నోటిఫికేషన్ - దరఖాస్తు, పరీక్ష వివరాలు ఇలా!
న్యూఢిల్లీలోని నేషనల్‌ లా యూనివర్సిటీ (ఎన్‌ఎల్‌యూ)-అకడమిక్‌ ప్రోగ్రామ్‌లలో ప్రవేశానికి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. బీఏ ఎల్‌ఎల్‌బీ (ఆనర్స్‌), ఎల్‌ఎల్‌ఎం, పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌లు అందుబాటులో ఉన్నాయి. ఆలిండియా లా ఎంట్రెన్స్‌ టెస్ట్‌ (ఏఐఎల్‌ఈటీ) 2023 ద్వారా ప్రవేశాలు కల్పిస్తారు. బీఏ ఎల్‌ఎల్‌బీ(ఆనర్స్‌), ఎల్‌ఎల్‌ఎం ప్రోగ్రామ్‌లలో ఒక్కోదానిలో అయిదు సీట్లను విదేశీ అభ్యర్థులకు మరో అయిదు సీట్లను ఓసీఐ/ పీఐఓ అభ్యర్థులకు; పీహెచ్‌డీలో రెండు సీట్లను విదేశీయులకు ప్రత్యేకించారు. వీరికి అకడమిక్‌ మెరిట్‌ ఆధారంగా అడ్మిషన్స్‌ ఇస్తారు. వీరు ఎంట్రెన్స్‌ టెస్ట్‌ రాయనవసరం లేదు.
ప్రవేశ ప్రకటన, పరీక్ష వివరాల కోసం క్లిక్ చేయండి..

 

EFLU: ఇఫ్లూలో పార్ట్-టైమ్ లాంగ్వేజ్ కోర్సులు, దరఖాస్తు చేసుకోండి!
హైదరాబాద్‌లోని ఇంగ్లిష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ (ఇఫ్లూ) ‌2022-2023 విద్యా సంవత్సరానికి వివిద విదేశీ భాషల్లో పార్ట్ టైమ్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు. సరైన అర్హతలు ఉన్నవారు ఆన్‌లైన్ విధానంలో అక్టోబరు 10 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
కోర్సులు, ఇతర వివరాల కోసం క్లిక్ చేయండి..


జగనన్న విదేశీ విద్యా దీవెన దరఖాస్తు గడువు పొడిగింపు, ఎన్నిరోజులంటే?

విదేశీ విశ్వవిద్యాలయాలు/విద్యా సంస్థల్లో పీజీ, పీహెచ్‌డీ, ఎంబీబీఎస్‌ అభ్యసించాలనుకునే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఈబీసీ, కాపు విద్యార్థులకు నిర్దేశించిన 'జగనన్న విదేశీ విద్యాదీవెన' పథకం దరఖాస్తు గడువును అక్టోబరు 30 వరకు పొడిగించారు. వాస్తవానికి సెప్టెంబరు 30తో గడువు ముగియగా.. మరో నెలపాటు పెంచారు. 
జగనన్న విదేశీ విద్యా దీవెన పథకం పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..


జేఎన్‌టీయూహెచ్‌లో పార్ట్ టైమ్ పీజీ కోర్సులు, చివరితేది ఎప్పుడంటే
హైదరాబాద్‌లోని జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ 2022-23 విద్యా సంవత్సరానికి ఎంటెక్, ఎంబీఏ పార్ట్‌టైమ్ పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది. సరైన అర్హతలున్న అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అక్టోబరు 17 వరకు దరఖాస్తుల సమర్పణకు అవకాశం ఉంది. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు నవంబరు 15 నుంచి 17 వరకు ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు.
కోర్సులు, ముఖ్యమైన తేదీల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..