విజయవాడలోని ఆంధ్రప్రదేశ్ ఫిషరీస్ యూనివర్సిటీ(ఏపీఎఫ్‌యూ) క్యాంప్ ఆఫీస్ 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించి బ్యాచిలర్‌ ఆఫ్ ఫిషరీస్ సైన్స్ (బీఎఫ్‌ఎస్‌సీ) ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇంటర్మీడియట్(ఫిజికల్ సైన్సెస్/ బయోలాజికల్ లేదా నేచురల్ సైన్సెస్) ఉత్తీర్ణతతో పాటు ఏపీ ఈఏపీసెట్‌ 2023 ర్యాంక్ సాధించిన వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల విద్యార్థులు ఆగస్టు 07వ తేదీ వరకు దరఖాస్తు చేసుకొవచ్చు.


కోర్సు వివరాలు..


* బ్యాచిలర్ ఆఫ్ ఫిషరీస్ సైన్స్ (బీఎఫ్‌ఎస్సీ)


కళాశాల, సీట్ల వివరాలు..


1. కాలేజ్ ఆఫ్ ఫిషరీ సైన్స్, ముత్తుకూరు (ఎస్‌పీఎస్‌ఆర్‌ నెల్లూరు జిల్లా): 29 


2. కాలేజ్ ఆఫ్ ఫిషరీ సైన్స్, నరసాపురం(పశ్చిమ గోదావరి జిల్లా): 60 


కోర్సు వ్యవధి: 4 సంవత్సరాలు (8 సెమిస్టర్లు)


బోధనా మాధ్యమం: ఇంగ్లిష్


అర్హత: ఇంటర్మీడియట్(ఫిజికల్ సైన్సెస్/ బయోలాజికల్ లేదా నేచురల్ సైన్సెస్) ఉత్తీర్ణతతో పాటు ఏపీ ఈఏపీసెట్‌ 2023 ర్యాంక్ సాధించి ఉండాలి.


వయోపరిమితి: 17 - 22 సంవత్సరాల మధ్య ఉండాలి.


ఎంపిక విధానం: ఏపీ ఈఏపీసెట్‌ 2023 ర్యాంక్, రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ ఆధారంగా ఎంపిక ఉంటుంది.


ముఖ్యమైన తేదీలు..


➥ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం: 24.07.2023.


➥ ఆన్‌లైన్‌ దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ: 07.08.2023.


➥ ఆలస్య రుసుముతో దరఖాస్తుకు చివరి తేదీ: 09.08.2023.


Notification


Website


ALSO READ:


నల్సార్‌ యూనివర్సిటీలో ఎంఏ&అడ్వాన్స్‌డ్ డిప్లొమా ప్రోగ్రామ్‌లో ప్రవేశాలు
హైదరాబాద్‌లోని నల్సార్ యూనివర్సిటీ ఆఫ్ లా, డైరెక్టరేట్ ఆఫ్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ దూరవిద్య విధానంలో 2023-2024 విద్యా సంవత్సరానికి ఎంఏ, అడ్వాన్స్‌డ్ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల విద్యార్థులు ఆన్‌లైన్‌ ద్వారా ఆగస్టు 10 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
కోర్సు పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..


నీట్‌ పీజీ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ విడుదల, నాలుగు దశల్లో కౌన్సెలింగ్ నిర్వహణ!
దేశవ్యాప్తంగా వైద్య కళాశాలల్లో 2023-24వ సంవత్సరానికి సంబంధించిన పీజీ మెడికల్ కౌన్సెలింగ్‌ షెడ్యూలును మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ (ఎంసీసీ) ప్రకటించింది. ఆల్‌ఇండియా కోటా కింద మెడికల్ కాలేజీల్లోని 50 శాతం సీట్లతో పాటు డీమ్డ్, సెంట్రల్ యూనివర్సిటీల్లో ఎండీ, ఎంఎస్, డిప్లొమా, పీజీ డీఎన్‌బీ, ఎండీఎస్ కోర్సుల్లో ప్రవేశాల కోసం మొత్తం 4 రౌండ్లలో కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. నీట్ పీజీ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు కౌన్సెలింగ్ రిజిస్ట్రేషన్ ఫీజు కింద రూ.1000 చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులు రూ.500 చెల్లిస్తే సరిపోతుంది. డీమ్డ్ యూనివర్సిటీలకు దరఖాస్తు చేసుకునేవారు రూ.5000 చెల్లించాల్సి ఉంటుంది. 
కౌన్సెలింగ్ పూర్తి షెడ్యూలు కోసం క్లిక్ చేయండి..


ప్రైవేటు మెడికల్‌ కాలేజీల ఫీజులు ఖరారు, ఫీజులు ఎంతమేర పెరిగాయంటే?
ఏపీలో 2023–24 విద్యా సంవత్సరానికి రాష్ట్రంలోని ప్రైవేట్‌ వైద్య, డెంటల్‌ కళాశాలల్లో ఎంబీబీఎస్, బీడీఎస్‌ కోర్సులకు ఫీజులను ప్రభుత్వం ఖరారు చేసింది. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు జులై 25న ఉత్తర్వులు జారీచేశారు. హైకోర్టు తుది తీర్పునకు లోబడి ఫీజుల అమలు ఉంటుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. 2022–23లో అమలైన ఫీజులను 10 శాతం పెంచుతూ కొత్త ఫీజులను ప్రభుత్వం ఖరారు చేసింది. 
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి.. 


Join Us on Telegram: https://t.me/abpdesamofficial