AP 10th Supplementary Exams: నేటి నుంచి ఏపీలో పదోతరగతి సప్లిమెంటరీ పరీక్షలు, టైమ్ టేబుల్ వివరాలు ఇలా

Ap SSC Supplementary Exams: ఏపీలో పదోతరగతి పబ్లిక్ పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థులకు మే 24 నుంచి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభంకానున్నాయి. జూన్ 3 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు.

Continues below advertisement

AP SSC Supplementary Exams: ఏపీలో పదోతరగతి పబ్లిక్ పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థులకు మే 24 నుంచి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభంకానున్నాయి. జూన్ 3 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. పదోతరగతి సప్లిమెంటరీ పరీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా 1,61,877 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. ఆయా తేదీల్లో ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నాం 12.45 గంటల వరకు పదోతరగతి పరీక్షలు నిర్వహించనున్నారు. అయితే సైన్స్ (ఫిజిక్స్, బయాలజీ) పరీక్షలను మాత్రం ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నాం 11.30 గంటల వరకు నిర్వహించనున్నారు. విద్యార్థులను ఉదయం 8.45 నుంచే పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించనున్నారు.

Continues below advertisement

పదోతరగతి సప్లిమెంటరీ పరీక్షలకు సంబంధించిన హాల్‌టికెట్లను ఇప్పటికే అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచిన సంగతి తెలిసిందే. విద్యార్థులు తమ పేరు, జిల్లా, పాఠశాల, పుట్టినతేదీ వివరాలు నమోదుచేసి నేరుగా హాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు హాల్‌టికెట్‌తో పాటు ఏదైనా గుర్తింపు కార్డును వెంట తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఒకవేళ హాల్‌టికెట్‌పై ఏవైనా తప్పులుంటే, పాఠశాల ప్రధానోపాధ్యాయుడి దృష్టికి తీసుకెళ్లాలి. ఇప్పటికే పరీక్ష ఫీజు చెల్లించపు గడువు ముగియగా.. రూ.50 ఆలస్య రుసుముతో మే 23 వరకు ఫీజు చెల్లించవచ్చు.

టెన్త్ సప్లిమెంటరీ పరీక్షల హాల్‌టికెట్ల కోసం క్లిక్ చేయండి..

పాఠశాలలవారీగా పదోతరగతి సప్లిమెంటరీ పరీక్షల హాల్‌టికెట్ల కోసం క్లిక్ చేయండి..

 ఏపీ పదోతరగతి సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూలు ఇలా..

➥  మే 24: ఫస్ట్‌ ల్యాంగ్వేజ్‌ పేపర్-1

➥  మే 25: సెకండ్‌ ల్యాంగ్వేజ్‌

➥  మే 27: ఇంగ్లిష్‌

➥  మే 28: మ్యాథమెటిక్స్‌

➥  మే 29: ఫిజికల్ సైన్స్

➥  మే 30: జీవ శాస్త్రం

➥  మే 31: సోషల్ స్టడీస్‌

➥ జూన్ 1న: కాంపోజిట్ విద్యార్థులకు ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్-2, ఓపెన్ స్కూల్ విద్యార్థులకు మెయిన్ లాంగ్వేజ్ పేపర్-1 పరీక్ష

➥ జూన్ 3న: ఓపెన్ స్కూల్ విద్యార్థులకు పేపర్-2 పరీక్ష. 

రాష్ట్రంలో ఈ ఏడాది మార్చి 18 నుంచి 30 వరకు నిర్వహించిన పదోతరగతి పబ్లిక్ పరీక్షల్లో మొత్తం 5,34,574 (86.69 %) విద్యార్థలు అర్హత సాధించారు. పాసైనవారిలో 89.17 శాతం బాలికలు, 84.32 శాతం బాలురు ఉత్తీర్ణులయ్యారు. ఫలితాల్లో పార్వతీపురం మన్యం జిల్లా 96.37 శాతంతో మొదటి స్థానంలో నిలవగా.. 62.47 శాతంతో చివరిస్థానంలో నిలిచింది. ఫలితాల్లో 69.26 శాతం ఫస్ట్ క్లాస్‌లో పాసయ్యారు. 11.87 శాతం సెకండ్ క్లాస్ లో పాసయ్యారు. 5.66 శాతం మూడో క్లాస్ లో ఉత్తీర్ణత సాధించారు. ఇక హిందీ మీడియంలో వంద శాతం ఉత్తీర్ణత సాధించారు. మొత్తం 12 మంది ఎగ్జామ్ రాయగా, అందరూ పాసయ్యారు. పదోతరగతి ఫలితాల్లో 2,803 స్కూల్స్100 శాతం ఉత్తీర్ణత సాధించాయి. ఇక 17 పాఠశాలల్లో జీరో ఉత్తీర్ణత నమోదైంది.

ALSO READ:

తెలంగాణ పదోతరగతి అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూలు ఇలా
తెలంగాణలో పదోతరగతి అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలను జూన్ 3 నుంచి 13 మధ్య నిర్వహించనున్న సంగతి తెలిసిందే . సైన్స్‌ పరీక్షలు ఉదయం 9.30 నుంచి 11 గంటల వరకు, ప్రథమ భాషలో కాంపోజిట్‌ కోర్సుల పరీక్షలు ఉదయం 9.30 నుంచి 12.50 గంటల వరకు నిర్వహిస్తారు. ఇక మిగిలిన అన్ని పరీక్షలు ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు నిర్వహించనున్నారు. పదోతరగతి పరీక్షలో ఫెయిలైన విద్యార్థులు ఆలస్య రుసుము లేకుండా ఫీజు చెల్లింపు గడువు మే 16తో ముగిసిన సంగతి తెలిసిందే. అయితే పరీక్షల ప్రారంభానికి రెండు రోజుల ముందు వరకు అంటే జూన్ 1 వరకు రూ.50 ఆలస్య రుసుం చెల్లించి దరఖాస్తులు సమర్పించవచ్చు. సప్లిమెంటరీ పరీక్షకు సంబంధించి ఒకటి నుంచి మూడు సబ్జెక్టుల వరకు దరఖాస్తు చేసుకునేవారు రూ.110, మూడు కంటే ఎక్కువ సబ్జెక్టులకు రూ.125 ఫీజుగా చెల్లించాలి.
పరీక్ష షెడ్యూలు, ఫీజు చెల్లింపు వివరాల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..

Continues below advertisement