AP Tenth Class Supplimentary Results: ఏపీలో పదోతరగతి వార్షిక పరీక్షల ఫలితాలు ఏప్రిల్ 22న వెలువడిన సంగతి తెలిసిందే. పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేశ్ కుమార్ ఉదయం 11 గంటలకు ఫలితాలను విడుదల చేశారు. ఈ ఏడాది పదోతరగతి పరీక్షల ఫలితాల్లో మొత్తం 86.69 శాతం ఉత్తీర్ణత నమోదైంది. . పాసైనవారిలో 89.17 శాతం బాలికలు, 84.32 శాతం బాలురు ఉత్తీర్ణులయ్యారు.


పదోతరగతి పబ్లిక్ పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థులకు మే 24 నుంచి జూన్ 3 వరకు సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నారు. విద్యార్థులు ఏప్రిల్ 23 నుంచి 30 వరకు సప్లిమెంటరీ పరీక్షల ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. రూ.50 ఆలస్య రుసుముతో మే 1 నుంచి 23 వరకు ఫీజు చెల్లించవచ్చు. త్వరలోనే సప్లిమెంటరీ పరీక్షల పూర్తిస్థాయి టైమ్‌టేబుల్‌ను అధికారులు వెల్లడించనున్నారు.

రీవాల్యుయేషన్, రీకౌంటింగ్ ఆన్‌లైన్ ద్వారానే..
అదేవిధంగా రీవాల్యుయేషన్, రీకౌంటింగ్ కోసం ఏప్రిల్ 23 నుంచి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్‌లైన్‌లోనే రీవాల్యుయేషన్, రీకౌంటింగ్ దరఖాస్తులు స్వీకరించనున్నారు. 4 రోజుల్లో అధికారిక వెబ్‌సైట్ నుంచి మెమోలు డౌన్‌లోడ్ చేసుకునే అవకాశం కల్పించనున్నారు.


పదోతరగతి పరీక్షల ఫలితాల కోసం క్లిక్ చేయండి.. 


 



ఏపీలో పదోతరగతి వార్షిక పరీక్షల ఫలితాలు సోమవారం (ఏప్రిల్ 22) వెలువడ్డాయి. విజయవాడలో ఏపీ పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేశ్ కుమార్ ఉదయం 11 గంటలకు ఫలితాలను విడుదల చేశారు. ఎస్‌ఎస్‌సీ బోర్డు అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను అందుబాటులో ఉంచారు. దీంతోపాటు ఏబీపీ దేశం వెబ్‌సైట్‌లోనూ ఏపీ టెన్త్ క్లాస్ ఫలితాలు చూసుకోవచ్చు. ఈ ఏడాది ఏపీలో మార్చి 18 నుంచి 30 వరకు పదోతరగతి పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే. పరీక్షలకు దాదాపు 7 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. వీరిలో రెగ్యులర్ విద్యార్థులు 6.23 లక్షలు, గతేడాది ఫెయిలై రీ ఎన్‌రోల్ అయిన విద్యార్ధులు లక్షకుపైగా ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 3473 పరీక్షా కేంద్రాల్లో పదోతరగతి పరీక్షలు నిర్వహించారు. విద్యార్థులు తమ ఫలితాలు తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.


ఈ ఏడాది పదోతరగతి పబ్లిక్ పరీక్షల్లో మొత్తం 5,34,574 (86.69 %) విద్యార్థలు అర్హత సాధించారు. ఫలితాల్లో బాలికలే పైచేయి సాధించారు. పాసైనవారిలో 89.17 శాతం బాలికలు, 84.32 శాతం బాలురు ఉత్తీర్ణులయ్యారు. ఫలితాల్లో పార్వతీపురం మన్యం జిల్లా 96.37 శాతంతో మొదటి స్థానంలో నిలవగా.. 62.47 శాతంతో చివరిస్థానంలో నిలిచింది. ఫలితాల్లో 69.26 శాతం ఫస్ట్ క్లాస్‌లో పాసయ్యారు. 11.87 శాతం సెకండ్ క్లాస్ లో పాసయ్యారు. 5.66 శాతం మూడో క్లాస్ లో ఉత్తీర్ణత సాధించారు. ఇక హిందీ మీడియంలో వంద శాతం ఉత్తీర్ణత సాధించారు. మొత్తం 12 మంది ఎగ్జామ్ రాయగా, అందరూ పాసయ్యారు. పదోతరగతి ఫలితాల్లో 2,803 స్కూల్స్100 శాతం ఉత్తీర్ణత సాధించాయి. ఇక 17 పాఠశాలల్లో జీరో ఉత్తీర్ణత నమోదైంది.


పదోతరగతి ఫలితాల్లో 2,803 స్కూల్స్100 శాతం ఉత్తీర్ణత సాధించాయి. ఇక 17 పాఠశాలల్లో జీరో ఉత్తీర్ణత నమోదైంది. ఏపీ రెసిడెన్షియల్ స్కూళ్లల్లో 98.43 %, ఏపీ రెసిడెన్షియల్ స్కూళ్లల్లో 98.43 %, ఏపీ బీసీ వెల్ఫేర్ స్కూళ్లలో 98.40 %, ఏపీ మోడల్ స్కూళ్లలో 92.88 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఇక సోషల్ వెల్ఫేర్ 94.55 %, ఆశ్రమ పాఠశాలల్లో 90.13 %, ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్లు 89.46 %, కస్తూర్బా విద్యాలయాల్లో 88.96 %, ప్రైవేటు అన్‌ఎయిడెడ్ పాఠశాలల్లో 96.72 శాతం, ప్రైవేటు ఎయిడెడ్ పాఠశాలల్లో 80.01 శాతం, జిల్లా పరిషత్ పాఠశాలల్లో 79.38 శాతం, మున్సిపల్ హైస్కూల్స్‌లో 75.42 శాతం, ప్రభుత్వ పాఠశాలల్లో 74.40 శాతం ఉత్తీర్ణత నమోదైంది.


రాష్ట్రంలో మార్చి 18 నుంచి 30 వరకు టెన్త్ పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం.. మార్చి 18న ఫస్డ్ లాంగ్వేజ్ పేపర్-1, మార్చి 19న సెకండ్ లాంగ్వేజ్‌, మార్చి 20న ఇంగ్లిష్, మార్చి 22న మ్యాథమెటిక్స్, మార్చి 23న ఫిజికల్ సైన్స్, మార్చి 26న బయాలజీ, మార్చి 27న సోషల్ స్టడీస్ పరీక్షలు నిర్వహించగా.. మార్చి 28, 30 తేదీల్లో వొకేషనల్ పరీక్షలు నిర్వహించారు.


ఏపీ పదోతరగతి ఫలితాల కోసం క్లిక్ చేయండి..