AP SSC Exams Halltickets: ఏపీలో పదోతరగతి పబ్లిక్ పరీక్షల హాల్‌‌టిక్కెట్లు మార్చి 4న విడుదలయ్యాయి. అధికారిక వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్లను అందుబాటులో ఉంచారు. విద్యార్థులు తమతమ పాఠశాలల లాగిన్‌ వివరాలతోపాటు.. తమ పేరు, జిల్లా పేరు, పాఠశాల పేరు, పుట్టిన తేదీ వివరాలు నమోదుచేసి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం మార్చి 18 నుంచి 30 వరకు పదోతరగతి పరీక్షలు నిర్వహించనున్నారు. ఆయాతేదీల్లో ప్రతిరోజు ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి. ఈ ఏడాది పదోతరగతి పబ్లిక్ పరీక్షలకు దాదాపు 6 లక్షల మంది విద్యార్థులు హాజరుకానున్నారు.


పదోతరగతి హాల్‌టికెట్లు ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి..





Step 1 : పదోతరగతి హాల్‌టికెట్ల కోసం అభ్యర్థులు మొదట అధికారిక వెబ్‌సైట్‌ సందర్శించాలి - bse.ap.gov.in


Step 2 : అక్కడ హోంపేజీలో 'AP SSC హాల్‌టికెట్లు'కు సంబంధించిన లింక్‌‌పై క్లిక్ చేయాలి.








Step 3 :  అక్కడ వివరాలు నమోదు చేసి, Submit బటన్‌ మీద క్లిక్ చేాయాలి.








Step 4 : తర్వాతి పేజీలో పదోతరగతి హాల్‌టికెట్‌ను కంప్యూటర్ స్క్రీన్ మీద కనిపిస్తుంది.







Step 5 : విద్యార్థులు తమ హాల్‌టికెట్‌ను డౌన్‌లోడ్ చేసుకుని, ప్రింటవుట్ తీసుకోండి.


SSC Public Examinations - 2024 Hall Tickets 


SSC Public Examinations - 2024 School Wise Hall Tickets 




బస్సులో ఉచిత ప్రయాణం..
ఏపీలో పదోతరగతి విద్యార్థులకు ఏపీఎస్‌ఆర్‌టీసీ గుడ్‌న్యూస్ తెలిపింది. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేయవచ్చని తెలిపింది. పరీక్షలు రాసే విద్యార్థులు ఆర్టీసీ బస్సుల్లో తమ హాల్‌టికెట్లు చూపించి ఇంటి నుంచి పరీక్ష కేంద్రాలకు, ఆ తర్వాత ఇళ్లకు ఉచితంగా వెళ్ళవచ్చని పేర్కొంది. పల్లె వెలుగు, ఆల్ట్రా పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ బస్సుల్లో ఈ సదుపాయం అందుబాటులో ఉంటుందని విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఏపీఎస్‌ఆర్‌టీసీ సూచించింది. 


ఏడు పేపర్లతో పరీక్ష..
ఆంధ్రప్రదేశ్‌లో పదోతరగతి పబ్లిక్ పరీక్షలను గతేడాది ఆరు పేపర్లతో నిర్వహించిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఏడాది నుంచి ఏడు పేపర్ల విధానం అమలు చేయనున్నారు. భౌతిక, రసాయనశాస్త్రాలు కలిపి ఒక పేపర్‌గా 50 మార్కులకు, జీవశాస్త్రం 50 మార్కులకు మరో పేపర్‌గా పరీక్ష నిర్వహించనున్నారు. ఈ రెండు పరీక్షలను వేర్వేరు రోజుల్లో నిర్వహిస్తారు. రెండింటిలోనూ 17 చొప్పున ప్రశ్నలు ఉంటాయి. రెండింటిలో కలిపి 35 మార్కులు సాధిస్తే ఉత్తీర్ణులైనట్లే. తెలుగు, హిందీ, ఇంగ్లిష్, మ్యాథమెటిక్స్, సోషల్ స్టడీస్ పేపర్లు యథావిధిగా ఉంటాయి. 


'కాంపోజిట్‌' పేపర్ కొనసాగింపు..
ఈ ఏడాది కాంపోజిట్ తెలుగు, కాంపోజిట్ సంస్కృతం పేపర్లను యథావిధిగా కొనసాగించనున్నారు. ఇదే విధానాన్ని ఉర్దూ/హిందీ, ఉర్దూ/అరబిక్, ఉర్దూ/పార్శి పేపర్లకు అమలు చేయనుంది. మొదట కాంపోజిట్ పేపర్లను రద్దు చేస్తున్నట్లు మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటించిన సంగతి తెలిసిందే. విద్యా సంవత్సరం మధ్యలో మార్పు చేయడంపై విమర్శలు రావడంతో ఈ నిర్ణయంపై ప్రభుత్వం వెనక్కి తగ్గింది. వచ్చే సంవత్సరం నుంచి తొలగించాలని నిర్ణయించింది. కాంపోజిట్ తెలుగు 70 మార్కులు, కాంపోజిట్ సంస్కృతం 30 మార్కులకు ఉంటుంది. 


పదోతరగతి పరీక్షల షెడ్యూలు..


➥ మార్చి 18: ఫస్డ్ లాంగ్వేజ్ పేపర్-1


➥ మార్చి 19: సెకండ్ లాంగ్వేజ్


➥ మార్చి 20: ఇంగ్లిష్


➥ మార్చి 22: తేదీ మ్యాథమెటిక్స్


➥ మార్చి 23: ఫిజికల్ సైన్స్


➥ మార్చి 26: బయాలజీ 


➥ మార్చి  27: సోషల్ స్టడీస్ పరీక్షలు


➥ మార్చి 28: మొదటి లాంగ్వేజ్ పేపర్-2 (కాంపోజిట్ కోర్సు)/ ఓఎస్ ఎస్ ఇ మెయిన్ లాంగ్వేహ్ పేపర్ -1 


➥ మార్చి 30:  ఓఎస్ఎస్ ఇ మెయిన్ లాంగ్వేజ్ పేపర్ -2 ( సంస్కృతం, అరబిక్,పర్షియన్), వొకేషనల్ కోర్సు పరీక్ష 


టెన్త్  మోడల్ పేపర్లు, బ్లూప్రింట్ కోసం క్లిక్ చేయండి..



మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి...