ఏపీలో పదోతరగతి అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు జూన్‌ 26న సాయంత్రం విడుదలైన సంగతి తెలిసిందే. అధికారిక వెబ్‌సైట్‌లో విద్యార్థుల మార్కుల మెమోలను అందుబాటులో ఉంచారు. ఈ ఏడాది సప్లిమెంటరీ పరీక్షలకు మొత్తం 1,61,877 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా..మొత్తం 67,115 మంది (62.21 శాతం) విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఇందులో బాలురు 59.99 శాతం ఉత్తీర్ణులుకాగా.. బాలికలు 65.96 శాతం ఉత్తీర్ణులయ్యారు. విద్యార్థులు వ్యక్తిగతంగా తమ రోల్ నెంబరు నమోదుచేసి మార్కుల మెమోలు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అలాగే ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు లాగిన్ వివరాలతో స్కూల్ వారీగా మార్కుల మెమోరాండం, మార్క్స్ మెమోలను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.  


పదోతరగతి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలను మే 24 నుంచి జూన్ 10 వరకు నిర్వహించిన సంగతి తెలిసిందే. జూన్ 6 నుంచి 9 వరకు జవాబు పత్రాల మూల్యాంకనం నిర్వహించారు. పరీక్షల ఫలితాలను ఏపీ విద్యాశాఖ మంత్రి నారాలోకేశ్ జూన్ 26న విడుదల చేశారు. ఈసందర్భంగా సప్లిమెంటరీ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులందరికీ ఆయన శుభాకాంక్షలు తెలిపారు. 


రీకౌంటింగ్, రీవెరిఫికేషన్‌కు అవకాశం..
పదోతరగతి సప్లిమెంటరీ ఫలితాల పట్ల సందేహాలుంటే రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ కోసం అవకాశం కల్పించారు. విద్యార్థులు జూన్ 27 నుంచి జులై 1 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రతి సబ్జెక్టు జవాబు పత్రం రీకౌంటింగ్ కోసం రూ.500 చొప్పున విద్యార్థులు చెల్లించాల్సి ఉంటుంది. అలాగే రీవెరిఫికేషన్ కోసం రూ.1000 ఫీజుగా చెల్లించాలి.


S.S.C ADVANCED SUPPLEMENTARY EXAMINATIONS Individual Results Download MAY - 2024 


S.S.C ADVANCED SUPPLEMENTARY EXAMINATIONS School Wise Results Download MAY - 2024 


రాష్ట్రంలో మార్చి 18 నుంచి 30 వరకు పదోతరగతి పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది పరీక్షలకు దాదాపు 7 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. వీరిలో రెగ్యులర్ విద్యార్ధులు 6,16,615 మంది ఉన్నారు. గతేడాది ఫెయిలై రీ ఎన్‌రోల్ అయిన విద్యార్ధులు లక్షకుపైగా ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 3473 పరీక్షా కేంద్రాల్లో పదోతరగతి పరీక్షలు నిర్వహించారు. పదోతరగతి వార్షిక పరీక్షల ఫలితాలను ఏప్రిల్ 22న విడుదల చేశారు. ఫలితాల్లో మొత్తం 86.69 శాతం విద్యార్థుల ఉత్తీర్ణులయ్యారు. ఇందులో బాలురు 84.32 శాతం, బాలికలు 86.69 శాతం ఉత్తీర్ణులయ్యారు. పరీక్షలో ఫెయిల్ అయిన విద్యార్థులకు మే 24 నుంచి జూన్ 10 వరకు సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించారు. వీటి ఫలితాలను జూన్ 26న విడుదల చేశారు.


ఇంటర్ ఫస్లియర్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల..
ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్ ఫస్టియర్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు (Inter First Year Supplementary Results) జూన్ 26న విడుదలయ్యాయి. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ఫలితాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా సప్లిమెంటరీ పరీక్షలో మెరుగైన ఫలితాలు సాధించిన విద్యార్థినీ, విద్యార్థులకు లోకేశ్ శుభాకాంక్షలు తెలిపారు. అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను అందుబాటులో ఉంచినట్లు ఆయన తెలిపారు. ఇంటర్ ఫస్టియర్ జనరల్, వొకేషనల్ విద్యార్థులు తమ హాల్‌టికెట్ నెంబరు, పుట్టినతేదీ వివరాలు నమోదుచేసి ఫలితాలు ఇక్కడ చూసుకోవచ్చు. ఇప్పటికే ఇంటర్ సెకండియర్ పరీక్షల ఫలితాలు వెలువడిన సంగతి తెలిసిందే. తాజాగా ప్రథమ సంవత్సరం ఫలితాలను విడుదల చేశారు.
ఫలితాల కోసం క్లిక్ చేయండి..








మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..