AP Polycet 2022 : ఏపీలో పాలిసెట్-2022 నోటిఫికేషన్ విడుదల అయింది. రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్‌ పాలిటెక్నిక్‌ కళాశాలల్లో వివిధ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు పాలిటెక్నిక్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్-2022 నోటిఫికేషన్‌ జారీ చేశారు. ఏపీ సాంకేతిక విద్యా, శిక్షణామండలి నోటిఫికేషన్ ను రిలీజ్ చేసింది. విద్యార్థులు ఏప్రిల్‌ 11 నుంచి polycetap.nic.in వెబ్ సైట్ లో దరఖాస్తు చేసుకోవచ్చని సాంకేతిక విద్యా కమిషనర్‌ పోలా భాస్కర్‌ తెలిపారు. టెన్త్‌ లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు పాలిసెట్ కు దరఖాస్తు చేసుకోవచ్చు. ఏప్రిల్‌, మే 2022 టెన్త్‌ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు కూడా పాలిసెట్ కు అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తు రుసుం రూ.400లు చెల్లించాల్సి ఉంటుంది. ఏప్రిల్‌ 11 నుంచి మే 18 వరకు విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. విద్యార్థులు చివరితేదీ వరకు వేచి ఉండకుండా ముందుగా దరఖాస్తు చేసుకోవాలని సాంకేతిక విద్యా మండలి సూచించింది. మే 29వ తేదీన పాలిటెక్నిక్‌ ఎంట్రన్స్ ఎగ్జామ్ నిర్వహించనున్నారు. 


తెలంగాణ పాలిసెట్ 


TS Polycet : తెలంగాణ పాలిసెట్‌ నోటిఫికేషన్‌(Polycet Notification) విడుదల అయింది. ఏప్రిల్‌ రెండో వారం నుంచి జూన్‌ 4వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో పాలిసెట్ అప్లికేషన్లు(Applications) స్వీకరిస్తారు. వంద రూపాయల ఆలస్య రుసుంతో జూన్‌ 5వ తేదీ వరకు దరఖాస్తులను స్వీకరిస్తారు. జూన్‌ 30న పాలిసెట్‌ పరీక్షను రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించనున్నారు. పాలిసెట్ జరిగిన 12 రోజుల తర్వాత ఫలితాలు వెల్లడించనున్నారు. తెలంగాణ‌లో పాలిటెక్నిక్ కామ‌న్ ఎంట్రెన్స్ టెస్ట్ నోటిఫికేషన్ విడుదలైంది. హైద‌రాబాద్‌లోని స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నిక‌ల్ ఎడ్యుకేష‌న్ అండ్ ట్రైనింగ్ తెలంగా(Telangana)ణ పాలిసెట్ నోటిఫికేష‌న్‌ను గురువారం విడుద‌ల చేసింది. ఏప్రిల్‌ రెండో వారం నుంచి ఆన్‌లైన్‌లో అప్లికేషన్లు స్వీకరించనుంది. జూన్‌ 4 వరకు పాలిసెట్‌ ఆన్‌లైన్‌ దరఖాస్తులు స్వీకరిస్తారు. పాలీసెట్ ద్వారా ప‌దో త‌ర‌గ‌తి(10th Class) పూర్తి చేసుకున్న విద్యార్థులు ఇంజ‌నీరింగ్‌, నాన్ ఇంజినీరింగ్ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలు పొందుతారు. పాలిసెట్ ద్వారా పాలిటెక్నీక్ కాలేజీలు, ప్రైవేటు ఇంజినీరింగ్ కాలేజీల్లో సెకండ్ ఫిప్ట్ పాలిటెక్నిక్ కాలేజీలు, ప్రొఫెస‌ర్ జ‌య‌శంక‌ర్ అగ్రిక‌ల్చర్ యూనివ‌ర్సిటీ, పీవీ న‌ర్సింహా రావు తెలంగాణ యూనివ‌ర్సిటీతో పాటు వీటికి అనుబంధంగా ఉన్న పాలిటెక్నిక్ కాలేజీల్లోని సీట్లను భ‌ర్తీ చేస్తారు. పాలిసెట్ ఎంట్రన్స్ ప‌రీక్షకు ద‌ర‌ఖాస్తు చేసుకునే విద్యార్థులు ప‌దో త‌ర‌గ‌తి పాస్ అయి ఉండాలి. 


Also Read : TS EAMCET 2022 : తెలంగాణ ఎంసెట్, ఈసెట్ నోటిఫికేషన్ విడుదల, ఇంటర్ మార్కుల వెయిటేజీకి నో ఛాన్స్