ఏపీలో పదో తరగతి, ఇంటర్మీడియట్ బోర్డు పరీక్షలకు సంబంధించి షెడ్యూల్‌ విడుదలైంది. ఈ మేరకు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ వెల్లడించారు. మే 2 నుంచి మే 13 వరకు పదో తరగతి, ఏప్రిల్‌ 8 నుంచి 28 వరకు ఇంటర్మీడియట్ పరీక్షలు నిర్వహిస్తారని ప్రకటించారు. మార్చి నెలలో 11 నుంచి 31 వరకు ఇంటర్మీడియట్ విద్యార్థులకు ప్రాక్టికల్స్‌ ఉంటాయని తెలిపారు. పదో తరగతి పరీక్షలు ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 వరకు నిర్వహించనున్నారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఇంటర్‌ పరీక్షలు నిర్వహించనున్నారు.

Continues below advertisement


ఏపీలో మొత్తం 6,39,888 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలు రాయనున్నారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ టెన్త్, ఇంటర్ పరీక్షలు నిర్వహిస్తామని మంత్రి ఆదిమూలపు సురేష్ వెల్లడించారు.


ఇదే పదోతరగతి షెడ్యూల్:


మే 02(సోమవారం)- ఫస్ట్‌ లాంగ్వేజ్‌


మే 04(బుధవారం )- సెకండ్‌ లాంగ్వేజ్


మే 05(గురువారం)-ఇంగ్లీష్‌


మే 07(శనివారం)- గణితం


మే 09(సోమవారం)-ఫిజికల్ సైన్స్


మే 10(మంగళవారం)బయోలాజికల్ సైన్స్


మే 11(బుధవారం)సోషల్ స్టడీస్


మే 12(గురువారం) ఫస్ట్‌ లాంగ్వేజ్ పేపర్‌ 2(కాంపోజిట్ కోర్స్‌/ఓఎస్‌ఎస్‌సీఎన్ఈన్‌ లాంగ్వేజ్)  పేపర్‌ 1 (సంస్కృతం, అరబిక్‌, పర్షియన్)


మే 13(శుక్రవారం) ఓఎస్‌ఎస్‌సీఎన్ఈన్‌ లాంగ్వేజ్ పేపర్‌ 2(సంస్కృతం, అరబిక్‌, పర్షియన్)/ ఎస్‌ఎస్‌సీ ఒకేషనల్‌ కోర్స్‌ థియరీ