ఆంధ్రప్రదేశ్‌లో లాసెట్‌, పీజీ ఎల్‌‌సెట్‌ - 2023 పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ వీసీ రాజశేఖర్‌ జూన్‌ 16న ఫలితాలను విడుదల చేశారు. అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను అందుబాటులో ఉంచారు. లాసెట్ పరీక్షలకు హాజరైన అభ్యర్థులు తమ ఫలితాలను చూసుకోవచ్చు.


అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ నెంబరు, హాల్‌టికెట్ నెంబరు వివరాలు నమోదుచేసి ఫలితాలు చూసుకోవచ్చు. అదేవిధంగా రిజిస్ట్రేషన్ నెంబరు, హాల్‌టికెట్ నెంబరు, పుట్టినతేదీ వివరాలు నమోదుచేసి ఐసెట్ ర్యాంకు కార్డులు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.


ఏపీ లాసెట్/ పీజీెఎల్‌సెట్ - 2023 ఫలితాల కోసం క్లిక్ చేయండి..


ఏపీ లాసెట్/ పీజీెఎల్‌సెట్ - 2023 ర్యాంకు కార్డుల కోసం క్లిక్ చేయండి..


ఏపీలో న్యాయ కళాశాలల్లో మూడేళ్లు, ఐదేళ్ల ఎల్‌ఎల్‌బీ, రెండేళ్ల ఎల్‌ఎల్‌ఎం కోర్సుల్లో ప్రవేశాల కోసం మే 20న ఈ పరీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ ప్రవేశ పరీక్షలకు మొత్తం 16,203మంది హాజరు కాగా.. వారిలో 13,402మంది క్వాలిఫై అయినట్టు వీసీ వెల్లడించారు.


Also Read:


డిగ్రీ కోర్సుల్లో ప్రవేశానికి జూన్ 18న నోటిఫికేషన్‌, ఇతర తేదీలు ఇలా!
ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ, ఎయిడెడ్‌, ప్రైవేట్ డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాలకు సంబంధించి జూన్ 18న నోటిఫికేషన్ వెలువడనుంది. ఆంధ్రప్రదేశ్‌ ఉన్నత విద్యా మండలి ఆధ్వర్యంలో అన్‌లైన్‌ విధానంలో ప్రవేశ ప్రక్రియ కొనసాగనుంది. విద్యార్థులు ప్రవేశాల కోసం జూన్ 19 నుండి 24 వరకు వెబ్‌సైట్‌ ద్వారా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. ఇక జూన్ 21 నుండి 23 వరకు స్పెషల్‌ కేటగిరీ అభ్యర్థులకు సర్టిఫికేట్ల పరిశీలన చేపడతారు. తదనంతరం జూన్ 26 నుండి 30 వరకు వెబ్‌ అప్షన్లకు అవకాశం కల్పిస్తారు. వెబ్‌ఆప్షన్లు నమోదుచేసుకున్న అభ్యర్థులకు జులై 3న  సీట్లను కేటాయిస్తారు. డిగ్రీ కళాశాలల్లో జులై 4 నుంచి తరగతులు ప్రారంభంకానున్నాయి.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..


నిమ్స్‌లో బీఎస్సీ(నర్సింగ్) కోర్సు, వివరాలు ఇలా!
హైదరాబాద్‌లోని నిజాం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(నిమ్స్) 2023 విద్యా సంవత్సరానికి బీఎస్సీ(నర్సింగ్) కోర్సులో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 100 సీట్లను భర్తీ చేయనున్నారు. ఈ కోర్సులకు ఇంటర్మీడియట్‌(ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ)ఉత్తీర్ణతతో పాటు టీఎస్‌ ఎంసెట్‌-2023లో అర్హత సాధించిన వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు జూన్ 28 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.  
కోర్సు పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..


'దోస్త్'లకు సీట్ల కేటాయింపు, తొలి విడతలో 73,220 మందికి ప్రవేశాలు!
తెలంగాణ రాష్ట్రంలోని డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాల‌కు సంబంధించి విద్యార్థులకు 'దోస్త్' తొలిదశ సీట్లను కేటాయించారు. మొద‌టి విడత‌లో 73,220 మంది సీట్లు కేటాయించిన‌ట్లు ఉన్నత విద్యామండ‌లి జూన్ 16న ఒక ప్రకటనలో తెలిపింది. సీట్లు పొందిన విద్యార్థుల్లో 44,113 మంది అమ్మాయిలు, 29,107 మంది అబ్బాయిలు ఉన్నారు. దోస్త్‌ ద్వారా ప్రవేశాలకు అందుబాటులో 889 కళాశాలలు ఉండగా.. వాటిల్లో  మొత్తం సీట్లు 3,56,258 సీట్లు ఉన్నాయి. ఇక 63 కళాశాలల్లో ఎలాంటి ప్రవేశాలు జరుగలేదు. డిగ్రీ కామ‌ర్స్ కోర్సుల్లో చేరేందుకే విద్యార్థులు సుముఖ‌త చూపించడం విశేషం. మొత్తం 33,251 మంది విద్యార్థులు కామ‌ర్స్ కోర్సుల‌ను ఎంపిక చేసుకున్నారు. సీట్లు పొందిన విద్యార్థుల జూన్ 16 నుంచి 25 వరకు సంబంధిత కళాశాలల్లో ఆన్‌లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది.
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..