ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు మే 24 నుండి జూన్‌ 1 వరకు జరగనున్నాయి. ఈ మేరకు షెడ్యూలును ఇంటర్‌బోర్డు ఏప్రిల్ 27న విడుదల చేసింది. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం ఇంటర్‌ ఫస్టియర్‌, సెకండియర్‌లో తప్పిన వారితోపాటు ఇంప్రూమెంట్‌ కోసం రాసే వారు కూడా ఈ పరీక్షలు రాయవచ్చు. ఆయా తేదీల్లో ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు ఫస్టియర్‌ విద్యార్ధులకు, అదేరోజు మధ్యాహ్నం 2.30 నుండి 5.30 గంటల వరకు సెకండియర్‌ విద్యార్ధులకు పరీక్షలు నిర్వహిస్తారు.


ఏపీ ఇంటర్ ఫస్టియర్ రిజల్ట్స్ 


ఏపీ ఇంటర్ సెకండియర్ రిజల్ట్స్ 


పరీక్షలు ఇలా..


* మే 24న ఉదయం సెకండ్‌ లాంగ్వేజ్‌ పేపర్‌-1, మధ్యాహ్నం సెకండ్‌ లాంగ్వేజ్‌ పేపర్‌-2 పరీక్షలు జరుతాయి.


* మే 25న ఉదయం ఇంగ్లిష్‌ పేపర్‌- 1, మధ్యాహ్నం ఇంగ్లిష్‌ పేపర్‌-2 పరీక్షలు జరుగుతాయి.


* మే 26న ఉదయం మ్యాథమెటిక్స్-1ఎ, బోటనీ పేపర్‌-1, సివిక్స్‌-పేపర్‌-1 పరీక్షలు జరుగుతాయి. మద్యాహ్నం మ్యాథ్స్‌-2ఎ, బోటనీ పేపర్‌-2, సివిక్స్‌ పేపర్‌-2 జరుగుతాయి.


* మే 27న మ్యాథ్స్‌-1బి, జువాలజీ పేపర్‌-1, హిస్టరీ పేపర్‌-1 పరీక్షలు జరుగుతాయి. అదే రోజు మధ్యాహ్నం మ్యాథ్స్‌-2బి, జువాలజీ పేపర్‌-2, హిస్టరీ పేపర్‌-2 పరీక్షలు జరుగుతాయి.


* మే 29న ఫిజిక్స్‌ పేపర్‌-1, ఎకనమిక్స్‌ పేపర్‌-1 పరీలు జరుగుతాయి. అదేరోజు మధ్యాహ్నం ఫిజిక్స్‌ పేపర్‌-2, ఎకనమిక్స్‌ పేపర్‌-2 పరీక్షలు జరుగుతాయి.


* మే 30న కెమిస్ట్రీ పేపర్‌-1, కామర్స్‌ పేపర్‌-1, సోషియాలజీ పేపర్‌-1, ఫైన్‌ ఆర్ట్స్‌, మ్యూజిక్‌ పేపర్‌-1 పరీక్షలు జరుగుతాయి. అదే రోజు మధ్యాహ్నం కెమిస్ట్రీ పేపర్‌-2, కామర్స్‌ పేపర్‌-2, సోసియాలజీ పేపర్‌-2, ఫైన్‌ ఆర్ట్స్‌, మ్యూజిక్‌ పేపర్‌-2 పరీక్షలు నిర్వహిస్తారు.


* మే 31న పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌ పేపర్‌-1, లాజిక్‌ పేపర్‌-1, బ్రిడ్జి కోర్సు మ్యాథ్స్‌ పేపర్‌-1 జరుగుతాయి. అదే రోజు మధ్యాహ్నం పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌ పేపర్‌-2, లాజిక్‌ పేపర్‌-2, బ్రిడ్జి కోర్సు మ్యాథ్స్‌ పేపర్‌-2 పరీక్షలు జరుగుతాయి. జూన్‌ 1న ఉదయం మోడ్రన్‌ లాంగ్వేజ్‌ పేపర్‌-1, జాగ్రఫీ పేపర్‌-1 పరీక్షలు జరుగుతాయి. అదే రోజు మధ్యాహ్నం మోడ్రన్‌ లాంగ్వేజ్‌ పేపర్‌-2, జాగ్రఫీ పేపర్‌-2 పరీక్షలు జరుగుతాయి.


కాగా పరీక్షలకు హాజరయ్యే విద్యార్ధులు చెల్లించాల్సిన ఫీజుల వివరాలను కూడా ఇంటర్మీడియట్‌ బోర్డు వెల్లడించింది. జనరల్‌ కోర్సులకు పరీక్ష ఫీజు రూ.510 రూపాయలుగా నిర్ణయించారు. అదే ఓకేషనల్‌ కోర్సులకు రూ.720గా నిర్ణయించారు. ఇంప్రూమెంట్‌ పరీక్ష రాసే అభ్యర్ధులు, అర్ట్స్‌ విద్యార్ధులకు పరీక్ష ఫీజును రూ.1,230గా, సెన్స్‌ విధ్యార్ధులకు రూ.1430గా నిర్ణయించారు.



Also Read:


ఇంటర్‌ ఫలితాలు ప్రతికూలంగా వచ్చిన వారికి మరో ఛాన్స్- ఇవాళే అప్లై చేయండీ
ఇంటర్‌ ఫలితాల్లో తక్కువ మార్కులు వచ్చాయనో... బాగా రాసినా మంచి ఫలితం రాలేదనో బాధపడుతున్న వాళ్లకు మరో అవకాశం. ఫలితాలపై ఎలాంటి సందేహాలు ఉన్నా... అభ్యంతరాలు ఉన్నా ఇంటర్ బోర్డుకు ఫిర్యాదు చేయవచ్చు. ఇవాల్టి నుంచి మే 6 వరకు ఇంటర్ విద్యార్థులు తమ సందేహాలను బోర్డుకు విన్నవించుకోవచ్చు. రీకౌంటింగ్, రీ వెరిఫికేషన్ కోసం అప్లై చేసుకోవచ్చు. ఈ ప్రక్రియ కొనసాగిస్తూనే అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీకి కూడా అప్లై చేసుకోవాలంటున్నారు ఇంటర్ అధికారులు. రీ వెరిఫికేషన్‌లో ఫలితం ఆలస్యమైనా, లేకుంటే మొదటి లాంటి ఫలితమే వచ్చినా అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ రాసుకునే వీలుంటుంది అంటున్నారు. అందుకే ఎవరూ రీ వెరిఫికేషన్, రీ కౌంటింగ్‌కు అప్లై చేశామని ధీమాతో అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ అప్లై చేయడం నిర్లక్ష్యం వద్దంటున్నారు. 
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..