2022-23 విద్యాసంవత్సరానికి సంబంధించిన ఇంటర్‌మీడియెట్‌ సెకండ్‌ ఇయర్‌ రిజల్ట్‌ను విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విడుదల చేశారు. మే 7 నుంచి మే 25 వరకు జరిగిన ఇంటర్‌ ద్వితీయ సంవత్సర పరీక్షలకు 4,23,455 మంది హాజరయ్యారు. ఇందులో  2,58,446 మంది పాస్‌ అయ్యారు. 61 శాతం మంది పాస్‌ అయ్యారన్నమాట. ఇందులో బాలికల ఉత్తీర్ణత శాతమే ఎక్కువగా ఉంది. ఇంటర్‌ రెండో సంవత్సరంలో బాలురు 54శాతం పాస్‌ అయితే.. బాలికలు 68 శాతం పాస్‌ అయ్యారు. 


ఇంటర్‌ ఫలితాల శాతం తగ్గడంపై మంత్రి బొత్స వివరణ ఇచ్చారు. ఇంటర్‌ రిజల్ట్స్‌ ఎప్పుడూ ఇలానే వస్తున్నాయన్నారు. 2017లో మాత్రమే 73 శాతం వచ్చిందని... 2018లో 69 శాతం, 2019లో 68శాతం 2020లో 59శాతం వచ్చిందన్నారు. గతేడాది కరోనా కారణంగా తరగతులు జరగలేదని.. పరీక్షలు కూడా పెట్టలేకపోయినందున అందర్నీ పాస్‌ చేశామని వివరించారు. అందుకే 2021లో వంద శాతం రిజల్ట్స్‌ వచ్చాయన్నారు. మాల్‌ప్రాక్టీస్‌లు చేయిస్తే గొప్ప రిజల్ట్స్‌ వస్తాయని ఎద్దేవా చేశారు బొత్స సత్యనారాయణ. విద్యార్థు భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకొని మంచి విద్యను అందిస్తున్నామన్నారు. అందుకే కాలేజీల డెవలప్‌మెంట్స్‌పై ఈ ప్రభుత్వం ఫోకస్ చేసిందని వివరించారు. 


ఇప్పుడు ఈ ఏడాది ఫలితాలపై అనుమానం ఉన్న వాళ్లు జూన్‌  25 నుంచి  జూలై 5 లోపు రీకౌంటింగ్‌, రీ వెరిఫికేషన్‌కు అప్లై చేసుకోవచ్చని సూచించారు బొత్స సత్యనారాయణ. తప్పిన వాళ్లు సప్లమెంటరీ కోసం కూడా ఇదే టైంలో ఫీజులు చెల్లించాలన్నారు. సప్లమెంటరీ ఎగ్జామ్స్‌ను ఆగస్టు 3 నుంచి 12 వరకు నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు. ఒకరోజు రెండు ఎగ్జామ్స్‌ చొప్పును నిర్వహిస్తారు. ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు ఫస్ట్‌ ఇయర్ ఎగ్జామ్‌ ఉంటే... మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు రెండో సంవత్సరం పరీక్ష ఉంటుందని పేర్కొన్నారు.  


ఈ సంవత్సరం ఇంటర్‌ పరీక్షల్లో ఫస్ట్‌ ఇయర్‌ 4,45,604 రాస్తే 2,41,591 మంది అంటే 54 శాతం ఉత్తీర్ణులయ్యారు. 4,23,455 మంది రాస్తే... 2,58,446 మంది పాస్‌ అయ్యారు. అత్యధికంగా ఉమ్మడి కృష్ణా జిల్లాలో 72 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. అత్యల్పంగా ఉమ్మడి కడప జిల్లాలో 50 శాతం మంది పాస్ అయినట్లు మంత్రి బొత్స వెల్లడించారు.


ఏపీ ఇంటర్ ఫలితాల కోసం క్లిక్ చేయండి
https://telugu.abplive.com/exam-results/ap-board-result-62b2b1aa8d556.html/amp


ఏపీ ఇంటర్ ఫస్టియర్ రిజల్ట్స్ 
https://telugu.abplive.com/exam-results/ap-inter-results-11-62b2b6cc2734e.html/amp


ఏపీ ఇంటర్ సెకండియర్ రిజల్ట్స్ 
https://telugu.abplive.com/exam-results/ap-inter-results-12-62b2b7e4abc44.html/amp


ఏపీ ఇంటర్ ఫస్టియర్ ఒకేషనల్ రిజల్ట్స్ 
https://telugu.abplive.com/exam-results/ap-intermediate-first-year-vocational-result-62b2b8e1b5a02.html/amp


ఏపీ ఇంటర్ సెకండియర్ ఒకేషనల్ రిజల్ట్స్ 
https://telugu.abplive.com/exam-results/ap-inter-2nd-year-vocational-result-62b2b9fd5344a.html/amp


ఏపీ ఇంటర్ ఫలితాలు ఇలా చెక్ చేసుకోండి 
Step 1: ఏపీ ఇంటర్ విద్యార్థులు మొదటగా అధికారిక వెబ్ సైట్   https://bie.ap.gov.in/ సందర్శించండి
Step 2: హోం పేజీలో ఏపీ ఇంటర్ ఫలితాలు 2022 లింక్ (Andhra Pradesh Inter Results 2022 link) మీద క్లిక్ చేయండి
Step 3: హాల్ టికెట్ నెంబర్ (రిజిస్ట్రేషన్ నెంబర్), పుట్టిన తేదీ లాంటి వివరాలు నమోదు చేయాలి
Step 4: విద్యార్థుల ఫలితాలు మీ స్క్రీన్ మీద కనిపిస్తాయి
Step 5: రిజల్ట్స్‌ను విద్యార్థులు పీడీఎఫ్ రూపంలో డౌన్‌లోడ్ చేసుకోండి
Step 6: ఇంజినీరింగ్, మెడిసిన్, డిగ్రీల ప్రవేశాలు లాంటి భవిష్యత్ అవసరాల కోసం మీ ఫలితాలను ప్రింటౌట్ తీసుకోవడం మంచిది