ఏపీలో ఇంటర్మీడియట్‌ పబ్లిక్‌ పరీక్షల రీవెరిఫికేషన్‌, రీకౌంటింగ్‌ ఫలితాలు మంగళవారం (జులై 11న) విడుదలయ్యాయి. ఇంటర్ బోర్డు అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను అందుబాటులో ఉంచారు. రీవెరిఫికేషన్, రీకౌంటింగ్ కోసం దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు తమ హాల్‌టికెట్ నెంబరు వివరాలు నమోదుచేసి ఫలితాలు చూసుకోవచ్చు.


ఇంటర్ రీవెరిఫికేషన్, రీకౌంటింగ్ ఫలితాలు ఇలా చూసుకోండి..


స్టెప్-1: ఇంటర్ రీవెరిఫికేషన్, రీకౌంటింగ్ ఫలితాల కోసం మొదట అధికారిక వెబ్‌సైట్ సందర్శించాలి.-https://bieap.apcfss.in/


స్టెప్-2: తర్వాత అక్కడ హోంపేజీలో కనిపించే 'Reverification /Recounting 2023 Results' లింక్ మీద క్లిక్ చేయాలి. 


స్టెప్-3: ఫలితాలకు సంబంధించిన లింక్ మీద క్లిక్ చేయగానే లాగిన్‌తో కూడిన కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. 


స్టెప్-4: లాగిన్ పేజీలో అభ్యర్థులు విద్యార్థులు తమ రూల్ నెంబరు, రిజిస్ట్రేషన్ నెంబరు, పుట్టినతేదీ వివరాలు నమోదుచేయాలి. 


స్టెప్-5: తర్వాత 'Results ' బటన్‌ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు ఫలితాలు కంప్యూటర్ హోం స్క్రీన్‌పై కనిపిస్తాయి.


స్టెప్-6: ఫలితాల కాపీని ప్రింట్ తీసుకుని, భవిష్యత్ అవసరాల కోసం భద్రపరుచుకోవాలి.


ఇంటర్ రీవెరిఫికేషన్, రీకౌంటింగ్ ఫలితాల కోసం క్లిక్ చేయండి..


ఏపీలో ఈ ఏడాది ఇంటర్ వార్షిక పరీక్షల ఫలితాలను ఏప్రిల్ 26న విడుదల చేసిన సంగతి తెలిసిందే. పరీక్షలో మొత్తం 4,33,278 మంది పరీక్షలకు హాజరుకాగా.. 2,66,326 మంది ఉత్తీర్ణులయ్యారు. ఇంటర్ ప్రథమ సంవత్సరంలో 61 శాతం, ద్వితీయ సంవత్సరంలో 72 శాతం ఉత్తీర్ణులయ్యారు. పరీక్షలో ఫెయిల్ అయిన అభ్యర్థులకు మే 24 నుంచి జూన్ 1 వరకు సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించారు. వీటి ఫలితాలను జూన్ 23న విడుదల చేశారు. రీవెరిఫికేషన్, రీకౌంటింగ్‌కు అవకాశం కల్పించారు. వీటి ఫలితాలను తాజాగా విడుదల చేశారు.


ALSO READ:


ఏపీ వైద్య కళాశాలల్లో పారామెడికల్ డిప్లొమా కోర్సులు, వివరాలు ఇలా!
విజయవాడలోని ఆంధ్రప్రదేశ్ స్టేట్ అలైడ్ అండ్ హెల్త్ కేర్ ప్రొఫెషన్స్ కౌన్సిల్(ఏపీఎస్ఏహెచ్‌పీసీ) 2023-2024 విద్యా సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ వైద్య కళాశాలలు, ప్రైవేటు పారామెడికల్‌ కళాశాలల్లో అందుబాటులో ఉన్న వివిధ పారామెడికల్‌ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతుంది. రెండేళ్ల కాలపరిమితితో అందిస్తున్న ఈ కోర్సులకు ఇంటర్మీడియట్‌ బైపీసీ ఉత్తీర్ణత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. జులై 24వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. 
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..


ఇంటిగ్రేటెడ్‌ బీఈడీ సీట్ల భర్తీకి ఎన్‌సెట్‌ నోటిఫికేషన్ వెల్లడి, ముఖ్యమైన తేదీలివే!
ఇంటర్‌ విద్యార్హతతో నాలుగేళ్ల ఇంటిగ్రేటెడ్‌ బీఈడీ కోర్సులో ప్రవేశాలకు 2023-24 విద్యా సంవత్సరానికి గాను కేంద్ర ప్రభుత్వం నేషనల్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌(NCET) పేరిట జాతీయ స్థాయిలో ఉమ్మడి ప్రవేశ పరీక్ష నిర్వహించనుంది. ఈ మేరకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఆసక్తి ఉన్నవారు జూన్ 27 నుంచి జులై 19 వరకు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. పరీక్షల తేదీలను ఎన్టీఏ తర్వాత ప్రకటించనుంది. నూతన జాతీయ విద్యావిధానంలో భాగంగా బీఏ-బీఈడీ, బీఎస్‌ఈ-బీఈడీ, బీకాం-బీఈడీలను ప్రవేశపెట్టాలనే కేంద్రం నిర్ణయం మేరకు ఆ కోర్సులను రాష్ట్రంలో ఐఐటీలు, ఎన్‌ఐటీలు, కేంద్ర, రాష్ట్ర విశ్వవిద్యాలయాల్లో ఈ సంవత్సరమే కొత్తగా ప్రవేశపెడుతున్నారు. ఇప్పటికే రీజనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌లు ఐదు ఉండగా వాటిలో ఉన్న కోర్సుల్లో సీట్ల భర్తీకి జాతీయ స్థాయిలో ఉమ్మడి ప్రవేశ పరీక్ష జరుపుతారు.
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..


Join Us on Telegram: https://t.me/abpdesamofficial