AP Inter Supplementary Exam Dates 2023: 
ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదలయ్యాయి. వీటితో పాటే ఒకేషనల్ కోర్సు రిజల్స్ట్ కూడా వచ్చాయి. ఈ మేరకు మంత్రి బొత్స వివరాలను వెల్లడించారు. ఇక సప్లిమెంటరీ పరీక్షలు మే నెలలో నిర్వహించనున్నారు. మే 24 నుంచి జూన్ 1 వరకు సప్లిమెంటరీ ఎగ్జామ్స్ జరుగుతాయని మంత్రి బొత్స వెల్లడించారు. పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి 5.30 గంటల వరకు రెండు సెషన్స్‌లో ఉంటాయని స్పష్టం చేశారు. అదేవిధంగా ప్రాక్టికల్ పరీక్షలు జూన్ 5 నుంచి 9 వరకు నిర్వహించనున్నాట్లు మంత్రి తెలిపారు.



ఫలితాలపై రీవెరిఫికేషన్ కి మే 6 లోపు అప్లై చేసుకోవాలి
సప్లిమెంటరీ పరీక్షలు మే 24 నుంచి జూన్ 1 వరకు జరుగుతాయి
ప్రాక్టికల్స్ మే 6 నుంచి జూన్ 9 వరకు జరుగుతాయి
మే 3 లోపు సప్లిమెంటరీ పరీక్షలకి ఫీజు చెల్లించుకోవాలి



ఏపీ ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదలయ్యాయి. విజయవాడలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ బుధవారం సాయంత్రం 6.30 గంటలకు ఏపీ ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ ఫలితాలతో పాటు ఒకేషనల్ విద్యార్థుల ఫలితాలను సైతం విద్యాశాఖ మంత్రి బొత్స ఒకేసారి విడుదల చేశారు. ఇంటర్ ఫస్టియర్ లో 61 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించగా, సెకండియర్ లో 72 శాతం విద్యార్థులు పాస్ అయినట్లు మంత్రి బొత్స తెలిపారు. మొదటి సంవత్సరంలో బాలికలు పైచేయి సాధించగా, ద్వితీయ సంవత్సరంలో బాలురుది పైచేయి అని వెల్లడించారు.


ఏపీ ఇంటర్ సెకండియర్ పరీక్షలలో 72 శాతం ఉత్తీర్ణత సాధించారని మంత్రి బొత్స తెలిపారు. ఇంటర్ సెకండియర్ లో బాలురు 68% , బాలికలు 75%   ఉత్తీర్ణులయ్యారు. ఫలితాల్లో 83 శాతం ఉత్తీర్ణతతో కృష్ణా జిల్లా మొదటిస్థానంలో, 78 శాతం ఉత్తీర్ణతతో గుంటూరు జిల్లా రెండో స్థానంలో, 77 శాతం ఉత్తీర్ణతతో పశ్చిమగోదావరి జిల్లా మూడోస్థానంలో నిలిచింది.


ఫస్టియర్ పరీక్ష ఫలితాల్లో మొత్తం 61 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఇంటర్ ఫస్టియర్ లో బాలురు 58%, బాలికలు 65 % ఉత్తీర్ణత సాధించారు. ఇంటర్‌ ఫస్టియర్‌, సెకండియర్‌ పరీక్షల్లో బాలుర కంటే బాలికలదే పైచేయిగా నిలిచింది. ఇంటర్‌ ఫస్టియర్‌ పరీక్షల్లో 77 శాతం ఉత్తీర్ణతో కృష్ణా జిల్లా మొదటి స్థానంలో, 70 శాతం ఉత్తీర్ణతతో పశ్చిమగోదావరి జిల్లా రెండో స్థానంలో, 68 శాతం ఉత్తీర్ణతతో గుంటూరు జిల్లా మూడోస్థానంలో నిలిచాయి. 


ఈ ఏడాది ఏపీలో ఇంటర్ పరీక్షలకు మొత్తం 10,03,990 మంది విద్యార్థులు పరీక్షకు హాజ‌రయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా 1,489  కేంద్రాల్లో ఇంటర్ పరీక్షలు నిర్వహించారు. ఇంటర్‌ ఫస్టియర్‌ పరీక్షలు 4.84 లక్షల మంది విద్యార్థులు రాయగా, ఇంటర్‌ సెకండియర్‌ పరీక్షలు 5.19 లక్షల మంది విద్యార్థులు రాశారు. వీరిలో 9,20,552 మంది రెగ్యులర్‌, 83,749 మంది ఒకేషనల్‌ విద్యార్థులు ఉన్నారు.


ఏపీ ఇంటర్ ఫస్టియర్ రిజల్ట్స్ 
https://telugu.abplive.com/exam-results/ap-inter-results-11-62b2b6cc2734e.html/amp


ఏపీ ఇంటర్ సెకండియర్ రిజల్ట్స్ 
https://telugu.abplive.com/exam-results/ap-inter-results-12-62b2b7e4abc44.html/amp 


ఏపీలో ఒకవైపు ఇంటర్మీడియట్‌ కళాశాలలను జూన్‌ ఒకటి వరకు ప్రారంభించొద్దని, ఎలాంటి తరగతులు నిర్వహించరాదని ఇంటర్‌ విద్యామండలి ఆదేశించింది. ప్రవేశాలను సైతం నిర్వహించొద్దని సూచించింది. ఆదేశాలను ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. మరోవైపు కార్పొరేట్‌ కాలేజీలు ఇవేమీ పట్టడం లేదు. ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి. వేసవి సెలవుల్లోనూ క్లాసులు నిర్వహిస్తున్నారు. ఇప్పటి నుండే అడ్మిషన్ల ప్రక్రియను కూడా ప్రారంభించారు. వాస్తవానికి ఫిబ్రవరి నుండే అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. జేఈఈ, నీట్‌ వంటి పరీక్షలకు పోటీపడేవారు కార్పొరేట్‌ కాలేజీల్లో ముందే ప్రవేశాలు తీసుకుంటున్నారు. ముందుగా రూ.10,000 ఫీజు కట్టి అడ్మిషన్‌ ఖరారు చేసుకుంటున్నారు.