AP Inter Supplementary Exam Date | ఏపీ ఇంటర్ ఫస్టియర్ లో 77 శాతం మంది పాస్ కాగా, సెకండియర్ లో 81 శాతం విద్యార్థులు పాసయ్యారు. ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రీకౌంటింగ్, రివెరిఫికేషన్ తో పాటు సప్లిమెంటరీ ఎగ్జామ్స్ షెడ్యూల్ విడుదల చేశారు.  ఆన్సర్ షీట్ వాల్యుయేషన్స్ అత్యంత జాగ్రత్తగా చేసినప్పటికీ విద్యార్థుల సౌకర్యార్థం రీకౌంటింగ్, రివెరిఫికేషన్ చేసుకునే అవకాశాన్ని ఇంటర్ బోర్డు కల్పిస్తోంది. ఫస్టియర్, సెకండియర్ విద్యార్థులు తమ మార్కులను మళ్లీ లెక్కించడానికి లేదా మూల్యాంకనం చేసిన జవాబు పత్రాల స్కాన్ చేసిన కాపీతో రివాల్యుయేషన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఆసక్తి గల అభ్యర్థులు ఏప్రిల్ 20 నుండి ఏప్రిల్ 27, 2026 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. 

Continues below advertisement

సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్ (IPASE May 2026)మే 2026లో నిర్వహించనున్న అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ థియరీ పరీక్షలు మే 21, 2026 నుండి జూన్ 04, 2026 వరకు జరుగుతాయి. ఈ పరీక్షలు ప్రతిరోజూ రెండు సెషన్లలో (ఉదయం 09 నుంచి మధ్యాహ్నం 12 వరకు, అదే విధంగా మధ్యాహ్నం 02:30 నుండి సాయంత్రం 05:30 వరకు నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన ఎగ్జామ్ ఫీజును కాలేజీలో ఏప్రిల్ 20 నుండి ఏప్రిల్ 27 లోపు చెల్లించాలి.

Continues below advertisement

ఇంప్రూవ్‌మెంట్ పరీక్షలకు రూల్స్మార్చి 2026 వార్షిక పరీక్షల్లో అన్ని సబ్జెక్టులలో ఉత్తీర్ణత సాధించిన ఫస్టియర్ విద్యార్థులకు మాత్రమే తమ మార్కులను మెరుగుపరుచుకునేందుకు ఇంప్రూవ్ మెంట్ అవకాశం కల్పించారు.  అయితే, సెకండియర్ ఉత్తీర్ణులైన విద్యార్థులు ఎవరైనా తమ మార్కులను మెరుగుపరుచుకోవాలనుకుంటే, వారు గతంలో సాధించిన ఫలితాలను రద్దు చేసుకుని, ప్రాక్టికల్స్‌తో సహా అన్ని పేపర్లకు తిరిగి హాజరుకావాల్సి ఉంటుందని తెలిపారు.

ప్రాక్టికల్, ఇతర పరీక్షల వివరాలుప్రాక్టికల్ పరీక్షలు జూన్ 07 నుంచి జూన్ 11, 2026 వరకు కేవలం జిల్లా కేంద్రాలలో మాత్రమే నిర్వహించనున్నారు. వీటితో పాటు ఎథిక్స్ & హ్యూమన్ వాల్యూస్ (Ethics & Human Values) పరీక్ష జూన్ 05 న, ఎన్విరాన్‌మెంటల్ ఎడ్యుకేషన్ ఎగ్జామ్ జూన్ 06 న నిర్వహించనున్నారు.