ఏపీలో ఇంటర్మీడియట్ ఫస్టియర్, సెకండియర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు జూన్ 13న విడుదల కానున్నాయి. ఇంటర్ బోర్డు కార్యదర్శి ఎంవీ శేషగిరిబాబు జూన్ 13న సాయంత్రం 5 గంటలకు ఫలితాలను విడుదల చేయనున్నారు. ఇంటర్ రెగ్యులర్, ఒకేషనల్ సప్లిమెంటరీ ఫలితాలను ఒకేసారి వెల్లడించనున్నారు. ఈ ఏడాది మే 24 నుంచి జూన్ 1 వరకు ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలను నిర్వహించిన సంగతి తెలిసిందే. పదిరోజుల్లో మూల్యాంకన ప్రక్రియను పూర్తి చేసి ఫలితాల వెల్లడకి సిద్ధమైంది ఇంటర్ బోర్డు. విద్యార్థులు తమ ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌లో చూసుకోవచ్చు.
ఫలితాల కోసం వెబ్‌సైట్: https://resultsbie.ap.gov.in/
ఈ ఏడాది ఇంటర్మీడియట్ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు మే 24వ తేదీ నుంచి జూన్ 1వ తేదీ వరకు జరిగిన సంగతి తెలిసిందే. ఆయా తేదీల్లో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు, మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5:30 వరకు ఇంటర్ సెకండియర్ పరీక్షలు జరిగాయి. ఇంటర్ ఫస్టియర్, సెకండియర్‌లో తప్పిన వారితోపాటు ఇంప్రూమెంట్ కోసం రాసే వారు కూడా ఈ పరీక్షలకు హాజరయ్యారు.
ఈ ఏడాది ఇంటర్ వార్షిక పరీక్షలను రాష్ట్రవ్యాప్తంగా 1489 కేంద్రాల్లో నిర్వహించారు. ఇంటర్మీడియట్ పరీక్షలకు సుమారు 10 లక్షల మంది విద్యార్ధులు హాజరయ్యారు. వీరిలో ఫస్ట్ ఇయర్ విద్యార్థులు 4,84,197 కాగా, సెకండియర్ విద్యార్ధులు 5,19,793గా ఉన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఫస్టియర్, సెకండియర్ కలిపి మొత్తం 5,38,327 మంది ఉత్తీర్ణత సాధించారు. మొత్తం 72 శాతం ఉత్తీర్ణత నమోదైంది. పరీక్షలో ఫెయిల్ అయిన విద్యార్థులకు సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించారు. వీటి ఫలితాలను జూన్ 13న వెల్లడించనున్నారు.
Also Read:
విద్యా శాఖలో వర్కింగ్ గ్రూప్, సీఎం జగన్ నిర్ణయం - భవిష్యత్ టెక్నాలజీ టీచింగ్ పై సర్కార్ ఫోకస్
రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులను గ్లోబల్ సిటిజన్స్‌గా తీరిదిద్దేందుకు సీఎం వైయస్ జగన్ మరిన్ని చర్యలు ప్రారంభించారు. ప్రపంచ స్థాయిలో పోటీని తట్టుకునేలా, మారుతున్న టెక్నాలజీ రంగంలో విద్యార్థులను సుశిక్షితులుగా తీర్చిదిద్దేలా మరో అడుగు ముందుకేశారు. భవిష్యత్తు టెక్నాలజీ రంగానికి అవసరమయ్యే నైపుణ్యాలతో ప్రభుత్వ విద్యార్థులను సుశిక్షితులుగా తీర్చిదిద్ది వారికి హైఎండ్ టెక్నాలజీ రంగంలోని ఉన్నత ఉద్యోగాల సాధనే లక్ష్యంగా ఆయన ముందుకు సాగుతున్నారు. దీనికోసం ప్రభుత్వంలోని ఉన్నతాధికారులు, గ్లోబల్ టెక్ కంపెనీల ప్రతినిధులతో ఉన్నత స్థాయి వర్కింగ్ గ్రూపును ఏర్పాటుచేశారు. పాఠ్యప్రణాళిక, ఉండాల్సిన మానవనవరులు, సదుపాయాలపై వచ్చేనెల జులై 15 కల్లా వర్కింగ్ గ్రూపు నివేదిక ఇవ్వనుంది.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
'జోసా' కౌన్సెలింగ్ షెడ్యూలు వచ్చేసింది, ముఖ్యమైన తేదీలివే!
దేశవ్యాప్తంగా ఐఐటీలు, ఎన్‌ఐటీలు, ట్రిపుల్‌ఐటీలు, ఇతర కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సహకారంతో నడిచే విద్యాసంస్థల్లో బీటెక్ సీట్ల భర్తీకి నిర్దేశించిన జోసా(జాయింట్ సీట్ అలొకేషన్ అథారిటీ) షెడ్యూలు జూన్ 7న విడుదలైంది. జేఈఈ అడ్వాన్స్‌డ్ ఫలితాలు జూన్ 18న వెలువడనున్నాయి. ఫలితాలు విడుదలైన మరుసటిరోజు నుంచే అంటే.. జూన్ 19 నుంచి జోసా కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభంకానుంది. జేఈఈ మెయిన్‌లో అర్హత సాధించిన విద్యార్థులకు జూన్ 4న జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. జోసా రిజిస్ట్రేషన్ ప్రక్రియ జూన్ 19 నుంచి 29 వరకు కొనసాగనుంది.
కౌన్సెలింగ్ పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..