AP Inter Results: ఏపీలో ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాలు ఏప్రిల్ 12న విడుదల కానున్నాయి. ఏప్రిల్ 12న ఉదయం 11 గంటలకు ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ ఫలితాలను ప్రకటించనున్నారు. తాడేపల్లిలోని కార్యాలయంలో ఇంటర్ బోర్డు సెక్రటరీ ఫలితాలను విడుదల చేయనున్నారు. ఈ మేరకు ఇంటర్ బోర్డు ఏప్రిల్ 11న అధికారిక ప్రకటన విడుదల చేసింది. పరీక్షలు పూర్తయిన 22 రోజుల్లోనే  రికార్డుస్ధాయిలో ఇంటర్‌ బోర్డు ఫలితాలు ప్రకటించనుంది.


ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్రవ్యాప్తంగా 1,559 సెంటర్లలో మార్చి 1వ తేదీ నుంచి 20 వరకు ఇంటర్ ప‌బ్లిక్‌ పరీక్షలు జ‌రిగిన విష‌యం తెల్సిందే. ఈ ఏడాది ఇంట‌ర్ విద్యార్థులు మొత్తం 10,52,221 మంది ఉన్నారు. ఇందులో మొదటి  సంవత్సరం 4,73,058 మంది, రెండో  సంవత్సరం 5,79,163 మంది ఉన్నారు. ఒకేషనల్ పరీక్షలకు హాజరైన విద్యార్థులు దాదాపు లక్ష వరకు ఉన్నారు. ఇంటర్ పరీక్షలు ముగియడంతో.. మూల్యాంకన ప్రక్రియ కూడా మొదలుపెట్టారు. ఏప్రిల్‌ 4లోపు మూల్యాంకన ప్రక్రియ పూర్తి చేసేలా బోర్డు అధికారులు ఆదేశాలు ఇచ్చారు.


ఈ వాల్యుయేషన్ ప్రక్రియలో సుమారుగా 23వేల మంది అధ్యాపకులు  పాల్గొంటున్నారు. ఒక్కో అధ్యాపకుడూ రోజుకు 30 జవాబు పత్రాలను మూల్యాంకనం చేస్తారు. ఈ లెక్కన రోజూ 8 గంటల పాటూ వాల్యుయేషన్ చేస్తే.. గంటకు 4 పేపర్లను పరిశీలించాల్సి ఉంటుంది. అంటే పావు గంటకు ఒక పేపర్ పూర్తవ్వాలి. ఇది కొంతవరకూ సాధ్యమే. ఐతే.. విద్యార్థులు ఈ రోజుల్లో తెగ రాస్తున్నారు. విపరీతమైన పోటీలో.. ఎడిషన్ల మీద ఎడిషన్లు తీసుకొని రాస్తున్నారు. అందువల్ల వాల్యుయేషన్ చెయ్యడం అంత ఈజీ కాదనే వాదన ఉంది. అయినా అధ్యాపకులు మాత్రం చకచకా పని కానిస్తున్నారు.



ఏపీ ఇంటర్ ఫలితాలు ఇలా చెక్ చేసుకోండి..


Step 1: ఏపీ ఇంటర్ విద్యార్థులు మొదటగా అధికారిక వెబ్ సైట్   https://bie.ap.gov.in/ సందర్శించండి


Step 2: హోం పేజీలో ఏపీ ఇంటర్ రిజల్ట్స్ 2024 లింక్ (Andhra Pradesh Inter Results 2024 link) మీద క్లిక్ చేయండి


Step 3: హాల్ టికెట్ నెంబర్ (రిజిస్ట్రేషన్ నెంబర్), పుట్టిన తేదీ లాంటి వివరాలు నమోదు చేయాలి


Step 4: విద్యార్థుల ఫలితాలు మీ స్క్రీన్ మీద కనిపిస్తాయి


Step 5: విద్యార్థులు రిజల్ట్స్‌ స్కోర్ కార్డును పీడీఎఫ్ రూపంలో డౌన్‌లోడ్ చేసుకోండి


Step 6: ఇంజినీరింగ్, మెడిసిన్, డిగ్రీల ప్రవేశాల సమయంలో మీ ఇంటర్ స్కోర్ కార్డు అవసరాల కోసం రిజల్ట్ ు ప్రింటౌట్ తీసుకోవడం బెటర్.


ఫలితాల కోసం అధికారిక వెబ్‌సైట్లు..


https://examresults.ap.nic.in


www.bie.ap.gov.in 


ALSO READ:


తెలంగాణ ఇంటర్ విద్యార్థులకు అలర్ట్, ఈసారి ముందుగానే ఫలితాల వెల్లడి, రిజల్ట్స్ ఎప్పుడంటే?
తెలంగాణలో ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలను ఫిబ్రవరి 28 నుంచి మార్చి 19 వరకు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈసారి పరీక్షలకు దాదాపు 9 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. ఇందులో.. 4,78,527 మంది మొద‌టి సంవత్సరం విద్యార్థులు కాగా.. 4,43,993 మంది ద్వితీయ సంవత్సరం విద్యార్థులు ఉన్నారు. పరీక్షల ప్రక్రియ ముగియడంతో జవాబు పత్రాల మూల్యాంకనంపై ఇంటర్ బోర్డు దృష్టి సారించింది. ఇప్పటికే ఈ ప్రక్రియ ప్రారంభంకాగా.. పేప‌ర్ వాల్యూయేషన్ వేగంగా సాగుతోంది. దేశంలో సార్వత్రిక ఎన్నికల కారణంగా.. ఈసారి ఇంటర్ పరీక్షల మూల్యాంకాన్ని త్వరగా పూర్తిచేసి, ఫలితాలను కూడా త్వరగా విడుదల చేయాలని ఇంటర్మీడియట్ బోర్డు ప్రయత్నిస్తోంది. ఏప్రిల్ 25లోపు ఫలితాలు వెల్లడించే అవకాశమున్నట్లు తెలుస్తోంది.
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..



మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..