AP Inter Supplementary Exams: ఏపీలో ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు నేటి నుంచి (మే 24) ప్రారంభంకానున్నాయి. జూన్ 1 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. ఆయాతేదీల్లో ఒకేరోజు రెండు విడతలుగా సప్లిమెంటరీ పరీక్షలు జరుగనున్నాయి. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ప్రథమ సంవత్సరం విద్యార్థులకు, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు పరీక్షలు నిర్వహించనున్నారు. ఇక సప్లిమెంటరీ పరీక్షలు ముగియగానే.. ఇంటర్నల్ పరీక్షలు నిర్వహించనున్నారు. విద్యార్థులకు జూన్ 6న నైతికత, మానవ విలువల పరీక్ష; జూన్ 7న పర్యావరణ విద్య పరీక్షలు నిర్వహించనున్నారు. ఆయా తేదీల్లో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్షలు నిర్వహిస్తారు.


Download I.P.A.S.E Theory Hall Tickets May 2024


ఇంట‌ర్‌ ఫస్టియర్ ఎగ్జామ్స్ షెడ్యూలు..


➥ మే 24- శుక్రవారం -  సెకండ్ లాంగ్వేజ్ పేపర్-1


➥ మే 25- శనివారం - ఇంగ్లిష్ పేపర్-1


➥ మే 27 - సోమవారం - మ్యాథ్స్‌ పేపర్‌-1ఎ, బోటనీ పేపర్-1, సివిక్స్-1.


➥ మే 28 - మంగళవారం - మ్యాథ్స్ పేపర్‌-1బి, జువాలజీ పేపర్-1, హిస్టరీ పేపర్-1


➥ మే 29 - బుధవారం - ఫిజిక్స్ పేపర్-1, ఎకనావిుక్స్‌ పేపర్-1


➥ మే 30 - గురువారం - కెవిుస్ట్రీ పేపర్-1, కామర్స్ పేపర్-1, సోషియాలజీ పేపర్-1, ఫైన్ ఆర్ట్స్& మ్యూజిక్ పేపర్-1


➥ మే 31 - శుక్రవారం - పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్ పేపర్-1, లాజిక్ పేపర్-1, బ్రిడ్జి కోర్సు మ్యాథ్స్‌ పేపర్-1 (బైపీసీ విద్యార్థులకు).


➥ జూన్ 1 - శనివారం - మోడ్రన్ లాంగ్వేజ్ పేపర్-1, జియోగ్రఫీ పేపర్-1


ఇంటర్ సెకండియర్ ఎగ్జామ్స్ షెడ్యూలు..


➥ మే 24- శుక్రవారం -  సెకండ్ లాంగ్వేజ్ పేపర్-2


➥ మే 25- శనివారం - ఇంగ్లిష్ పేపర్-2


➥ మే 27 - సోమవారం - మ్యాథ్స్‌ పేపర్‌-2ఎ, బోటనీ పేపర్-2, సివిక్స్-2.


➥ మే 28 - మంగళవారం - మ్యాథ్స్ పేపర్‌-2బి, జువాలజీ పేపర్-2, హిస్టరీ పేపర్-2


➥ మే 29 - బుధవారం - ఫిజిక్స్ పేపర్-2, ఎకనావిుక్స్‌ పేపర్-2


➥ మే 30 - గురువారం - కెవిుస్ట్రీ పేపర్-2, కామర్స్ పేపర్-2, సోషియాలజీ పేపర్-2, ఫైన్ ఆర్ట్స్& మ్యూజిక్ పేపర్-2.


➥ మే 31 - శుక్రవారం - పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్ పేపర్-2, లాజిక్ పేపర్-2, బ్రిడ్జి కోర్సు మ్యాథ్స్‌ పేపర్-2 (బైపీసీ విద్యార్థులకు).


➥ జూన్ 1 - శనివారం - మోడ్రన్ లాంగ్వేజ్ పేపర్-2, జియోగ్రఫీ పేపర్-2.


IPASE May 2024 - TIME TABLE (English Version)


IPASE May 2024 - TIME TABLE (Telugu Version)


FIRST YEAR VOCATIONAL TIME TABLE


SECOND YEAR VOCATIONAL TIME TABLE


ఏపీలో ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల ఫలితాలు ఏప్రిల్ 12న విడుదలైన సంగతి తెలిసిందే. ఫలితాలకు సంబంధించి ఇంటర్ మొదటి సంవత్సరంలో  67 %, ద్వితీయ సంవత్సరంలో 78 % విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. జనరల్ విభాగంలో ప్రథమ సంవత్సరం నుంచి 4,61,273 మంది పరీక్షలకు హాజరుకాగా.. వీరిలో 3,10,875 మంది ఉత్తీర్ణత సాధించారు. మొత్తం 67 శాతం విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. ఇక ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఫలితాలకు సంబంధించి 3,93,757 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా.. 3,06,528 మంది పరీక్షలో అర్హత సాధించారు. మొత్తం 78 శాతం విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. ఇక ఇంటర్ ఒకేషనల్ విభాగంలో ప్రథమ సంవత్సరం నుంచి 38,483 మంది పరీక్షలకు హాజరుకాగా.. వీరిలో 23,181 మంది ఉత్తీర్ణత సాధించారు. మొత్తం 60 శాతం విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. ఇక ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఫలితాలకు సంబంధించి 32,339 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా.. 23,000 మంది పరీక్షలో అర్హత సాధించారు. మొత్తం 80 శాతం విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థులకు మే 24 నుంచి సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తున్నారు.


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..