APICET 2024 Application: ఆంధ్రప్రదేశ్‌లోని ఎంసీఏ, ఎంబీఏ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఏపీఐసెట్-2024 నోటిఫికేషన్ మార్చి 3న వెలువడిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ మార్చి 6న ప్రారంభమైంది. విద్యార్థులు ఎలాంటి అపరాధ రుసుము లేకుండా ఏప్రిల్ 7 వరకు దరఖాస్తు చేసుకోచ్చు. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.650 చెల్లించాలి. బీసీ అభ్యర్థులు రూ.600; ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.550 చెల్లించాల్సి ఉంటుంది.
రూ.1000 ఆలస్య రుసుముతో ఏప్రిల్ 8 నుంచి 12 వరకు, రూ.2000 ఆలస్య రుసుముతో ఏప్రిల్ 13 నుంచి 17 వరకు, రూ.3000 ఆలస్య రుసుముతో ఏప్రిల్ 18 నుంచి 22 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. అలాగే రూ.5000 ఆలస్య రుసుముతో ఏప్రిల్ 23 నుంచి 27 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. ఇక దరఖాస్తు వివరాల్లో తప్పులుంటే సరిదిద్దుకునేందుకు ఏప్రిల్ 28, 29 తేదీల్లో అవకాశం కల్పించారు. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం మే 6, 7 తేదీల్లో ఐసెట్ ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. ఐసెట్ పరీక్షకు సంబంధించిన హాల్‌టికెట్లను మే 2 నుంచి అందుబాటులో ఉండనున్నాయి.
వివరాలు..
* ఏపీ ఐసెట్-2024
కోర్సుల వివరాలు..
1) ఎంసీఏ
అర్హత: 50 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ (బీసీఏ, బీఎస్సీ-కంప్యూటర్స్, బీకామ్, బీఏ). ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు 45 శాతం మార్కులు ఉంటే సరిపోతుంది. అయితే ఇంటర్ స్థాయిలో కచ్చితంగా మ్యాథ్స్ ఒక సబ్జెక్టుగా చదివి ఉండాలి.
2) ఎంబీఏ
అర్హత: 50 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ (బీఏ/ బీఎస్సీ/ బీకామ్/ బీబీఏ/ బీబీఎం/ బీసీఏ/ బీఈ/ బీటెక్/ బీఫార్మసీ). ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు 45 శాతం మార్కులు ఉంటే సరిపోతుంది. అయితే ఇంటర్ స్థాయిలో కచ్చితంగా మ్యాథ్స్ ఒక సబ్జెక్టుగా చదివి ఉండాలి.
వయోపరిమితి: 19 సంవత్సరాలు నిండి ఉండాలి. ఎలాంటి గరిష్ఠ వయసు లేదు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఎంపిక విధానం: ఐసెట్ ర్యాంకు ఆధారంగా.
దరఖాస్తు ఫీజు: అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.650 చెల్లించాలి. బీసీ అభ్యర్థులు రూ.600; ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.550 చెల్లిస్తే సరిపోతుంది.
పరీక్ష విధానం: మొత్తం 200 మార్కులకు ఐసెట్ ఆన్‌లైన్ ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు. పరీక్షలో మొత్తం 200 ప్రశ్నలు ఉంటాయి. పరీక్ష సమయం 150 నిమిషాలు. పరీక్షలో మూడు సెక్షన్లు (సెక్షన్-ఎ, బి, సి) ఉంటాయి. వీటిలో సెక్షన్-ఎ: అనలిటికల్ ఎబిలిటీ-75 ప్రశ్నలు-75 మార్కులు, సెక్షన్-బి: కమ్యూనికేషన్ ఎబిలిటీ-70 ప్రశ్నలు-70 మార్కులు, సెక్షన్-సి: మ్యాథమెటికల్ ఎబిలిటీ-55 ప్రశ్నలు-55 మార్కులు ఉంటాయి. పరీక్ష సమయం 150 నిమిషాలు (రెండున్నర గంటలు).
ఏపీ ఐసెట్-2024 ముఖ్యమైన తేదీలు:
➽ ఏపీఐసెట్-2024 నోటిఫికేషన్: 03.03.2024.
➽ దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం: 06.03.2024.
➽ దరఖాస్తుల సమర్పణకు చివరితేది: 07.04.2024.
➽ రూ.1000 ఆలస్య రుసుముతో దరఖాస్తు: 08.04.2024 - 12.04.2024.
➽ రూ.2000 ఆలస్య రుసుముతో దరఖాస్తు: 13.04.2024 - 17.04.2024.
➽ రూ.3000 ఆలస్య రుసుముతో దరఖాస్తు: 18.04.2024 - 22.04.2024.
➽ రూ.5000 ఆలస్య రుసుముతో దరఖాస్తు: 23.04.2024 - 27.04.2024.
➽ దరఖాస్తుల్లో తప్పుల సవరణకు అవకాశం: 28.04.2024 - 29.04.2024.
➽ పరీక్ష హాల్‌టికెట్లు: 02.05.2024 నుంచి అందుబాటులో.
➽ ఏపీ ఐసెట్ పరీక్ష నిర్వహణ: 06.05.2024, 07.05.2024 తేదీల్లో.
పరీక్ష సమయం: 09.00 AM - 11.30AM, 02.30 PM to 05.00 PM
➽ ప్రిలిమినరీ ఆన్సర్ కీ: 08.05.2024 – 06.00 PM
➽ ప్రిలిమినరీ ఆన్సర్ కీపై అభ్యంతరాల స్వీకరణ: 10.05.2024 – 06.00 PM
➽ ఫైనల్ ఆన్సర్ కీ, ఫలితాల వెల్లడి: 20.06.2024