ఆంధ్రప్రదేశ్‌లో 2023 ఏడాదిలో పలు డిగ్రీ, పీజీ, పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన ఉమ్మడి ప్రవేశ పరీక్షల తేదీలను ఉన్నత విద్యామండలి జనవరి 23న ప్రకటించింది. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం ఈ ఏడాది మే 15 నుండి 22 తేదీల మధ్య ఏపీఈఏపీసెట్(ఎంపీసీ) పరీక్ష నిర్వహించనున్నారు. అదేవిధంగా ఏపీ ఈఏపీసెట్ (బైపీసీ) ప్రవేశపరీక్షను మే 23 నుండి 25 తేదీల మధ్య నిర్వహించనున్నారు.


ఇక ఈసెట్ పరీక్షను మే 5న, పీజీఈసెట్ పరీక్ష మే 28 నుండి 30 తేదీల మధ్య నిర్వహించనున్నారు. అదేవిధంగా మే 25,26 తేదీల్లో ఐసెట్‌, మే 20న లాసెట్‌, మే 20న ఎడ్‌సెట్‌, జూన్‌ 6 నుండి 10వ తేదీల మధ్య పీజీసెట్ పరీక్ష నిర్వహించనున్నారు.


చివరగా జూన్‌ 12 నుండి 14 తేదీల మధ్య ఆర్‌సెట్‌ పరీక్ష నిర్వహించనున్నారు. అయితే ఏదైనా కారణాల రీత్యా ఈ తేదీల్లో కొంత మార్పులు ఉండే అవకాశం కూడా ఉందని ఉన్నత విద్యా మండలి తెలిపింది. 


పరీక్షల షెడ్యూలు..


➥ ఏపీఈఏపీసెట్(ఎంపీసీ) పరీక్ష మే 15 నుండి 22 వరకు


➥ ఏపీ ఈఏపీసెట్ (బైపీసీ) ప్రవేశపరీక్షను మే 23 నుండి 25 వరకు


➥ ఈసెట్ పరీక్ష మే 5న


➥ పీజీఈసెట్ మే 28 నుండి 30 వరకు


➥ ఐసెట్ పరీక్ష మే 25, 26 తేదీల్లో


➥ లాసెట్‌ పరీక్ష మే 20న


➥ ఎడ్‌సెట్‌ మే 20న, 


➥ పీజీసెట్‌ పరీక్ష జూన్‌ 6 నుండి 10వ తేదీల మధ్య నిర్వహించనున్నారు.


➥ ఇక జూన్‌ 12 నుండి 14 తేదీల మధ్య ఆర్‌సెట్‌ పరీక్ష నిర్వహించనున్నారు. 


Also Read:


విద్యార్థులకు గుడ్ న్యూస్, డ్యూయల్ డిగ్రీ విధివిధానాలు జారీ!
ఇంజినీరింగ్ కళాశాలల్లో డ్యూయల్ డిగ్రీ కోర్సులకు జేఎన్‌టీయూ(JNTU) అనుమతి ఇచ్చింది. ఈ మేరకు విధివిధానాలను యూనివర్సిటీ జారీ చేసింది. 2022-23 విద్యాసంవత్సరం నుంచి నిర్వహించాలని నిర్ణయించింది. దీనిప్రకారం ఒక్కో కాలేజీకి 60 సీట్లు కేటాయించింది. అయితే కనీసం 30 శాతం మంది విద్యార్థులు రిజిస్టర్ చేసుకొని ఉంటేనే కళాశాలకు అనుమతి లభిస్తుంది. ఇంజినీరింగ్ 2,3,4 ఏడాది చదువుతున్న విద్యార్థులు మాత్రమే రిజిస్టర్ చేసుకోవడానికి అర్హులు. వీరందరూ బీటెక్‌తోపాటే బీబీఏ(డేటా అనలిటిక్స్‌) కోర్సు కూడా చదువుకోవచ్చు. వారంలో రెండురోజులు అంటే శని, ఆదివారాల్లో ప్రత్యక్ష బోధన, మిగతా రోజుల్లో ఆన్‌లైన్ తరగతులు నిర్వహిస్తారు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..


బీఎస్సీ అలైడ్ హెల్త్ సైన్సెస్ కన్వీనర్ కోటా మొదటి విడత ప్రవేశ ప్రకటన విడుదల!
తెలంగాణలోని వైద్యకళాశాలల్లో బీఎస్సీ అలాయిడ్ హెల్త్ సైన్సెస్ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు కాళోజీ హెల్త్ యూనివర్సిటీ కౌన్సెలింగ్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ప్రవేశాలకు సంబంధించి జనవరి 24 నుండి 26 వరకు మొదటి విడత వెబ్ కౌన్సిలింగ్ నిర్వహించనున్నారు. దరఖాస్తు ప్రక్రియ ముగియడంతో యూనివర్సిటీ పరిధిలోని మొదటి విడత కన్వీనర్ కోటా సీట్లను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. అభ్యర్థులు జనవరి 24న ఉదయం 8 గంటల నుంచి జనవరి 26న సాయంత్రం 4 గంటల వరకు  తుది మెరిట్‌ జాబితాలోని అర్హులైన అభ్యర్థులు  కళాశాలల వారీగా ‌ఆప్షన్లు నమోదు చేసుకోవాలి. మెరిట్ జాబితా అదేవిదంగా కళాశాల వారిగా సీట్ల వివరాలను వెబ్‌సైట్‌లో చూసుకోవచ్చు. 
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..