AP Sankranthi Holidays Extended: ఏపీలోని పాఠశాల విద్యార్థులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. సంక్రాంతి సెలవులు పొడిగిస్తున్నట్లు వెల్లడించింది. ఏపీలో సంక్రాంతి సెలవులు మరో 3 రోజులు పొడిగిస్తూ ప్రభుత్వం జనవరి 17న ఉత్తర్వులు జారీచేసింది. తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల విజ్ఞప్తి మేరకు సెలవులు మరో మూడు పొడిగించినట్లు విద్యాశాఖ ఒక ప్రకటనలో తెలిపింది. తాజా ఆదేశాలతో జనవరి 18న తెరచుకోవాల్సిన  పాఠశాలలు జనవరి 22న తిరిగి తెరుచుకోనున్నాయి. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు.  


ఏపీలోని అన్ని స్కూళ్లకు 10 రోజుల పాటు సంక్రాంతి సెలవులను (Sankranti Holidays) ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో పాఠశాలలకు జనవరి 9 నుంచి సంక్రాంతి సెలవులు అమల్లోకి వచ్చాయి. అయితే తొలుత జనవరి 16 వరకు సెలవులు ప్రకటించగా.. ఆ తరువాత మార్పులు చేసి సర్కార్.. జనవరి 18 వరకు సెలవులు ఇస్తున్నట్లు ప్రకటించింది. అయితే తాజాగా మరో మూడురోజులు సెలవులు పొడిగిస్తున్న ప్రభుత్వం ప్రకటించడంతో జనవరి 22న పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. 


ప్రభుత్వం విడుదల చేసిన ప్రకారం.. జనవరి 15న మకర సంక్రాంతి, 16న కనుమ పండుగ సెలవులను ప్రకటించింది. జనవరి 26న రిపబ్లిక్‌ డే, మార్చి 3న మహా శివరాత్రి, మార్చి 25న హోళీ, మార్చి 29న గుడ్‌ ఫ్రై డే సెలవులుంటాయని ప్రకటిస్తున్నట్లు ఉత్తర్వులో స్ఫష్టం చేశారు. ఏప్రిల్‌ 5న బాబు జగ్జీవన్‌రాం జయంతి, 9న ఉగాది, 11న రంజాన్‌, 17న శ్రీరామ నవమి, జూన్‌ 17న బక్రీద్‌ సెలవులుంటాయని తెలియజేసింది. జూలై 17న మొహర్రం, ఆగస్టు 15 ఇండిపెండెన్స్‌ డే, 26 శ్రీ కృష్ణాష్టమి, సెప్టెంబర్‌ 7న వినాయక చవితి సెలవులు, 16న ఈద్‌-ఉల్‌-ఉన్‌-నబీ పండుగల సందర్భంగా సెలవులను అమలు చేయనున్నట్లు ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది. అక్టోబర్‌ 2న గాంధీ జయంతి, అక్టోబర్‌ 11న దుర్గాష్టమి, 31న దీపావళి, డిసెంబర్‌ 25న క్రిస్మస్‌ సెలవులు ఉంటాయని వెల్లడించింది . వీటితో పాటు మరో 17 ఐచ్ఛిక సెలవుల తేదీలను ప్రకటించింది .


ఏపీలో 20 సాధారణ సెలవులు ఇదే..


➥ మకర సంక్రాంతి: 15.01.2024.


➥ కనుమ: 16.01.2024.


➥ రిపబ్లిక్ డే: 26.01.2024.


➥ మహాశివరాత్రి: 08.03.2024.


➥ హోలీ: 25.03.2024.


➥ గుడ్ ఫ్రైడే: 29.03.2024.


➥ బాబు జగ్జీవర్ రామ్ జయంతి: 05.04.2024.


➥ ఉగాది: 09.04.2024.


➥ ఈద్ ఉల్ ఫితర్ (రంజాన్): 11.04.2024.


➥ శ్రీరామ నవమి: 17.04.2024.


➥ బక్రీద్: 17.06.2024.


➥ మొహార్రం: 17.07.2024.


➥ ఇండిపెండెన్స్ డే: 15.08.2024. 


➥ శ్రీకృష్ట జన్మాష్టమి: 26.08.2024.


➥ వినాయక చవితి: 07.09.2024.


➥ ఈద్ మిలాద్-ఉన్-నబి: 16.09.2024.


➥ మహాత్మాగాంధీ జయంతి: 02.10.2024.


➥ దుర్గాష్టమి: 11.10.2024.


➥ దీపావళి: 31.10.2024.


➥ క్రిస్ట్‌మస్: 25.12.2024.


17 ఆప్షనల్ హాలిడేస్ (ఐచ్ఛిక సెలవులు) ఇవే..


➥ కొత్త సంవత్సరం దినోత్సవం (New Year Day): 01.01.2024.


➥ హజ్రత్ అలీ జయంతి: 25.01.2024.


➥ షబ్-ఈ-మెరాజ్: 07.02.2024.


➥ షహదత్ హజ్రత్ అలీ: 01.04.2024.


➥ జమాతుల్ వెద: 05.04.2024.


➥ బసవ జయంతి: 10.05.2024.


➥ బుద్ద పూర్ణిమ: 23.05.2024.


➥ ఈద్-ఎ-గదీర్: 25.06.2024.


➥ 9వ మొహార్రం: 16.07.2024.


➥ పార్సీ కొత్త సంవత్సరం దినోత్సవం: 15.08.2024.


➥ వరలక్ష్మి వ్రతం: 16.08.2024.


➥ మహాలయ అమావాస్య: 02.10.2024.


➥ యజ్-దహమ్-షరీఫ్: 15.10.2024.


➥ కార్తీక పూర్ణిమ/గురునానక్ జయంతి: 15.11.2024.


➥ హజ్రత్ సయ్యద్ మహ్మద్ జువాన్‌పూర్ మెహదీ జయంతి: 16.11.2024.


➥ క్రిస్ట్‌మస్ ఈవ్: 24.12.2024.


➥ బాక్సింగ్ డే: 26.12.2024.


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..