AP Schools: స్కూళ్లకు వేసవి సెలవులు ప్రకటించిన ఏపీ ప్రభుత్వం

ఏపీ ప్రభుత్వం స్కూళ్లకు వేసవి సెలవులు ప్రకటించింది. ఏప్రిల్ 24 నుంచి పాఠశాలలకు సమ్మర్ హాలీడేస్ ప్రారంభంకానున్నాయి. జూన్ 11 వరకు పాఠశాలలకు సెలవులు కొనసాగనున్నాయి.

Continues below advertisement

AP Summer Holidays: ఏపీ ప్రభుత్వం స్కూళ్లకు వేసవి సెలవులు ప్రకటించింది. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం పాఠశాలలకు ఏప్రిల్ 24 నుంచి సమ్మర్ హాలీడేస్ ప్రారంభంకానున్నాయి. జూన్ 11 వరకు సెలవులు కొనసాగనున్నాయి. ఈ మేరకు విద్యాశాఖ ఏప్రిల్ 2న అధికారక ప్రకటన విడుదల చేసింది. మార్చి 18 నుంచి ఒంటిపూట బడులు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఉదయం 7.45 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు ఒంటిపూట ఒడులు నిర్వహిస్తున్నారు. కాగా.. ఏపీ వ్యాప్తంగా ఏప్రిల్ 23 నాటికి అన్ని తరగతుల విద్యార్థులకు పరీక్షలు పూర్తి చేసి.. ఏప్రిల్ 24 నుంచి వేసవి సెలవులు ఇవ్వనున్నారు.

Continues below advertisement

ఏపీలోని పాఠశాలలకు గతేడాది మే 1న వేసవి సెలవులు ప్రారంభంకాగా.. 42 రోజుల సెలవుల తర్వాత జూన్ 12న తిరిగి తెరచుకున్నాయి. అయితే రాష్ట్రంలో ఎండల తీవ్రత కారణంగా  ఏప్రిల్ 24 నుంచి పాఠశాలలకు వేస‌వి సెల‌వులు(AP Summer Holidays) మొదలుకానున్నాయి. జూన్ 11 వ‌రకు అంటే.. దాదాపుగా 50 రోజులు పాటు పాఠశాలలకు వేస‌వి సెల‌వులు రానున్నాయి. గతేడాది కంటే ఈసారి సమ్మర్ హాలీడేస్ ఎక్కువగా ఉండనున్నాయి.  

ఏప్రిల్ 6 నుంచి ఎస్ఏ-2 పరీక్షలు..
ఏపీలోని పాఠశాల విద్యార్థులకు ఏప్రిల్ 6 నుంచి సమ్మెటివ్ అసెస్‌మెంట్(SA)-2 పరీక్షలు ప్రారంభం కానున్నాయి. దీనికి సంబంధించిన షెడ్యూలును పాఠశాల విద్యాశాఖ విడుదల చేసింది. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం ఏప్రిల్ 6 నుంచి 19 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. ఆయా తేదీల్లో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. అయితే 9వ తరగతి విద్యార్థులకు మాత్రం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12.15 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలతోపాటు, సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో పరీక్షల నిర్వహణకు ఏమైనా ఇబ్బందులు ఎదురైతే షెడ్యూలులో మార్పులుంటాయని విద్యాశాఖ తెలిపింది.

ప్రకటించిన షెడ్యూలు ప్రకారం..

➥ ఏప్రిల్ 6 నుంచి 16 వరకు 1 నుంచి 5 తరగతి విద్యార్థులకు పరీక్షలు జరగనున్నాయి.  

➥ ఏప్రిల్ 6 నుంచి 18 వరకు 6 - 8 వ తరగతులకు పరీక్షలు నిర్వహించనున్నారు. 

➥ ఏప్రిల్ 19న కాంపొజిట్ కోర్సు విద్యార్థులకు పరీక్ష నిర్వహిస్తారు. ఇందులో 8, 9వ తరగతి విద్యార్థులకు పేపర్-1, పేపర్-2 పరీక్షలు; 6, 7వ తరగతులకు కేవలం ఒక పేపరు మాత్రమే నిర్వహిస్తారు.

ఒకటి నుంచి 5వ తరగతి విద్యార్థులకు పరీక్షలు ఇలా..

➥ ఏప్రిల్ 6న: ఫస్ట్ లాంగ్వేజ్.

➥ ఏప్రిల్ 8న: ఇంగ్లిష్ పార్ట్-ఎ.

➥ ఏప్రిల్ 10న: ఇంగ్లిష్ పార్ట్-బి (టోఫెల్).

➥ ఏప్రిల్ 12న: మ్యాథమెటిక్స్.

➥ ఏప్రిల్ 13న: పర్యావరణ శాస్త్రం(ఈవీఎస్) (3, 4, 5వ తరగతులకు).

➥ ఏప్రిల్ 15న: ఓపెన్ స్కూల్ (3, 4, 5వ తరగతులకు)

➥ ఏప్రిల్ 16న: SLAS 2024 (గ్రేడ్-4 విద్యార్థులకు)

6వ తరగతి నుంచి 9వ తరగతి విద్యార్థులకు పరీక్షలు ఇలా..

➥ ఏప్రిల్ 6న: ఫస్ట్ లాంగ్వేజ్.

➥ ఏప్రిల్ 8న: సెకండ్ లాంగ్వేజ్.

➥ ఏప్రిల్ 10న: ఇంగ్లిష్ పార్ట్-ఎ.

➥ ఏప్రిల్ 12న: ఇంగ్లిష్ పార్ట్-బి (టోఫెల్).

➥ ఏప్రిల్ 13న: మ్యాథమెటిక్స్.

➥ ఏప్రిల్ 15న: జనరల్ సైన్స్/ఫిజికల్ సైన్స్ (3, 4, 5వ తరగతులకు)

➥ ఏప్రిల్ 16న: బయోలాజికల్ సైన్స్.

➥ ఏప్రిల్ 18న: సోషల్ స్టడీస్.

➥ ఏప్రిల్ 19న: కాంపొజిట్ కోర్సు పరీక్ష. ఇందులో 8, 9వ తరగతి విద్యార్థులకు పేపర్-1, పేపర్-2 పరీక్షలు; 6, 7వ తరగతులకు కేవలం ఒక పేపరు మాత్రమే నిర్వహిస్తారు.

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి...

Continues below advertisement