ఆంధ్రప్రదేశ్‌లో 18 బీఈడీ కళాశాలలకు అనుమతులు నిలిపివేస్తూ ఉన్నత విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. ఉన్నత విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ ఫీజులు నిర్ణయించని కారణంగా వాటిని కౌన్సెలింగ్ జాబితా నుంచి తొలగించారు. మొదట ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం సెప్టెంబరు 30 నుంచి కౌన్సెలింగ్ ప్రారంభం కావాల్సి ఉండగా.. వాయిదా వేశారు. దాంతో కౌన్సెలింగ్‌లో తీవ్ర జాప్యం జరుగుతోంది.
గతేడాది కూడా కౌన్సెలింగ్ ప్రక్రియ ఇలానే ఆలస్యం కావడంతో విద్యార్థులు దాదాపు ఏడాది సమయం కోల్పోయారు. ఇప్పుడు అక్టోబరు వచ్చినా ఎప్పటి నుంచి ప్రారంభిస్తారనే దానిపై స్పష్టత కొరవడింది. అది ఇలాగే కొనసాగితే ఈసారీ విద్యార్థులు విలువైన సమయాన్ని కోల్పోయే అవకాశం ఉంది.
రాష్ట్రవ్యాప్తంగా బీఈడీ కోర్సుల్లో ప్రవేశాలకు జూన్ 14న నిర్వహించిన ఏపీ ఎడ్‌సెట్-2023 ప్రవేశ పరీక్షకు 13,672 మంది దరఖాస్తు చేసుకోగా.. 11,235 (82.17 శాతం) మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. వీరిలో 10,908 (97.08 శాతం) మంది ఉత్తీర్ణత సాధించారు. రాష్ట్ర వ్యాప్తంగా 77 పరీక్ష కేంద్రాల్లో పరీక్ష నిర్వహించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న టీచర్ ట్రైనింగ్ కాలేజీల్లో 2023-24 విద్యాసంవత్సరానికి సంబంధించి బీఈడీ, బీఈడీ (స్పెషల్) కోర్సుల్లో ప్రవేశాల కోసం ఏపీ ఎడ్‌సెట్ 2023 నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. బీఈడీ, స్పెషల్ బీఈడీలో ప్రవేశాలకు నిర్వహించనున్న ఏపీ ఎడ్‌సెట్-2023 పరీక్ష జూన్ 14న నిర్వహించారు. ఈ ఏడాది ఆంధ్ర విశ్వవిద్యాలయం పరీక్ష బాధ్యతను చేపట్టింది.
ALSO READ:
నిట్ అరుణాచల్ ప్రదేశ్‌లో పీహెచ్‌డీ ప్రోగ్రామ్, అర్హతలివే
అరుణాచల్ ప్రదేశ్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్) విశ్వేశ్వరయ్య ఫెలోషిప్ పథకం 2023-24 కింద పీహెచ్‌డీ కోర్సులో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. సంబంధిత విభాగంలో ఎంఈ, ఎంటెక్ ఉత్తీర్ణతతో పాటు వ్యాలిడ్ గేట్/ నెట్ స్కోరు ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు. సరైన అర్హతలున్నవారు అక్టోబరు 10లోగా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది.
ప్రోగ్రామ్ వివరాల కోసం క్లిక్ చేయండి..
ఐఐటీ భువనేశ్వర్‌లో పీహెచ్‌డీ ప్రోగ్రామ్, వివరాలు ఇలా
భువనేశ్వర్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ విశ్వేశ్వరయ్య ఫెలోషిప్ పథకం 2023-24 కింద పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. సంబంధిత విభాగంలో ఎమ్మెస్సీ, ఎంఈ, ఎంటెక్ ఉత్తీర్ణులైనవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు. సరైన అర్హతలున్నవారు అక్టోబరు 5లోగా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది.
ప్రోగ్రామ్ వివరాల కోసం క్లిక్ చేయండి..
తిరుపతి ఐఐటీలో పీహెచ్‌డీ ప్రోగ్రామ్, వివరాలు ఇలా
తిరుపతిలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఐఐటీ) 2023 విద్యా సంవత్సరానికి పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్, బీఎస్, ఎంఈ, ఎంటెక్, ఎంఎస్, ఎంఎస్సీ, పీజీతో పాటు గేట్/ యూజీసీ- నెట్/ సీఎస్‌ఐఆర్- నెట్/ ఎన్‌బీహెచ్‌ఎం/ ఇన్‌స్పైర్‌లో అర్హత సాధించినవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు. సరైన అర్హతలున్న అభ్యర్థులు అక్టోబరు 3లోగా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది.
కోర్సు పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..