APECET 2024 Application: ఏపీఈసెట్ - 2024 రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం, దరఖాస్తుకు చివరితేది ఎప్పుడంటే?

ఏపీలోని ఇంజినీరింగ్ కళాశాలల్లో రెండో సంవత్సరం లేటరల్ ఎంట్రీ ప్రవేశాలకు నిర్వహించే ఏపీఈసెట్-2024 దరఖాస్తు ప్రక్రియ మార్చి 15న ప్రారంభమైంది. అభ్యర్థులు ఏప్రిల్ 15 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు.

Continues below advertisement

AP ECET 2024 Online Application: ఆంధ్రప్రదేశ్‌లోని ఇంజినీరింగ్ కళాశాలల్లో రెండో సంవత్సరం లేటరల్ ఎంట్రీ ప్రవేశాలకు నిర్వహించే ఏపీఈసెట్-2024 నోటిఫికేషన్‌ (AP ECET 2024 Notification) మార్చి 14న విడుదలైన సంగతి తెలిసిందే. ఈసెట్ ప్రవేశ పరీక్షకు దరఖాస్తు ప్రక్రియ మార్చి 15న ప్రారంభమైంది. అభ్యర్థులు ఎలాంటి దరఖాస్తు రుసుము లేకుండా ఏప్రిల్ 15 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. పాలిటెక్నిక్ డిప్లొమా (ఇంజినీరింగ్), బీఎస్సీ (మ్యాథమెటిక్స్) ఉత్తీర్ణత ఉన్నవారు ఈసెట్ పరీక్ష రాయడానికి అర్హులు. చివరి సంవత్సరం చదువుతున్నవారు కూడా దరఖాస్తుకు అర్హులు. 

Continues below advertisement

రిజిస్ట్రేషన్ ఫీజుగా ఓసీ అభ్యర్థులు రూ.600; బీసీ అభ్యర్థులు రూ.550; ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.500 చెల్లించాల్సి ఉంటుంది. విద్యార్థుల నుంచి రూ.500 ఆలస్యరుసుముతో  ఏప్రిల్ 30 వరకు, రూ.1000 ఆలస్యరుసుముతో  మే 5 వరకు, రూ.5000 ఆలస్యరుసుముతో  మే 10 వరకు, రూ.10,000 ఆలస్యరుసుముతో  మే 12 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం మే 8న ఈసెట్ ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు.  ఈ ఏడాది జేఎన్‌టీయూ అనంతపురం ఈసెట్ పరీక్ష నిర్వహణ బాధ్యతను చేపట్టింది. ఈసెట్ కన్వీనర్‌గా యూనివర్సిటీ సివిల్ ఇంజినీరింగ్ ప్రొఫెసర్ పి. ఆర్. భానుమూర్తి వ్యవహరిస్తున్నారు.

వివరాలు..

* ఏపీఈసెట్ - 2024

కోర్సులు: బీటెక్, బీఫార్మసీ.

అర్హత: పాలిటెక్నిక్ డిప్లొమా (ఇంజినీరింగ్), బీఎస్సీ (మ్యాథమెటిక్స్) ఉత్తీర్ణులై ఉండాలి. చివరి సంవత్సరం చదువుతున్నవారు కూడా దరఖాస్తుకు అర్హులు.

దరఖాస్తు ఫీజు: రిజిస్ట్రేషన్ ఫీజుగా ఓసీ అభ్యర్థులు రూ.600; బీసీ అభ్యర్థులు రూ.550; ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.500 చెల్లించాల్సి ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.

ఎంపిక విధానం: ప్రవేశపరీక్షలో ర్యాంకు ఆధారంగా. 

పరీక్ష విధానం: మొత్తం 200 మార్కులకుగాను ఈసెట్ ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు. మొత్తం 200 ఆబ్జె్క్టివ్ తరహా ప్రశ్నలు ఉంటాయి. ప్రశ్నల తీరు ఇంజినీరింగ్, ఫార్మసీ, బీఎస్సీ (మ్యాథ్స్) విభాగాలకు వేర్వేరుగా ఉంటాయి. పరీక్షలో అర్హత మార్కులను 25 శాతంగా నిర్ణయించారు. అంటే 200 మార్కులకుగాను కనీస 50 మార్కులు సాధిస్తేనే అర్హతగా పరిగణిస్తారు. ఎస్సీ, ఎస్టీ అబ్యర్థులకు ఎలాంటి కనీసం అర్హత మార్కులు ఉండవు.  ఇంగ్లిష్‌లో మాత్రమే ప్రశ్నపత్రం ఉంటుంది.

ముఖ్యమైన తేదీలు...

➥ నోటిఫికేషన్ వెల్లడి: 14.03.2024.

➥ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 15.03.2024. 

➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 15.04.2024.

➥ రూ.500 ఆలస్య రుసుముతో ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 22.04.2024.

➥ రూ.2000 ఆలస్య రుసుముతో ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 29.04.2024.

➥ రూ.5000 ఆలస్య రుసుముతో ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 02.05.2024.  

➥ దరఖాస్తుల సవరణకు అవకాశం:  25.04.2024 - 27.04.2024. 

➥ హాల్‌టికెట్ల డౌన్‌లోడ్: 01.05.2024. 

➥ పరీక్ష తేది: 08.05.2024. 

పరీక్షసమయం: ఉ.9 గం.- మ. 12 గం. వరకు, మ.2.30 గం.-సా.5.30 గం. వరకు.

➥ ప్రిలిమినరీ ఆన్సర్ కీ విడుదల: 10.05.2024. 

➥ ప్రిలిమినరీ ఆన్సర్ కీపై అభ్యంతరాల స్వీకరణ: 12.05.2024 వరకు. 

APECET 2024 Details

Fee Payment for AP ECET - 2024

Application Form for AP ECET - 2024

Know Your Payment Status

Print Application Form

Syllabus

Website

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..

Continues below advertisement