ఆంధ్రప్రదేశ్‌లోని ఇంజినీరింగ్ కళాశాలల్లో రెండో సంవత్సరం లేటరల్ ఎంట్రీ ప్రవేశాలకు నిర్వహించే ఏపీఈసెట్-2023 నోటిఫికేషన్‌ మార్చి 8న విడుదలైన సంగతి తెలిసిందే. ఈసెట్ ప్రవేశ పరీక్షకు దరఖాస్తు ప్రక్రియ మార్చి 10న ప్రారంభంకాగా.. ఎలాంటి దరఖాస్తు రుసుము లేకుండా ఏప్రిల్ 10 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. అయితే రూ.500 ఆలస్య రుసుముతో ఏప్రిల్ 11 నుంచి 15 వరకు. రూ.2000 ఆలస్య రుసుముతో ఏప్రిల్ 16 నుంచి 19 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే రూ.5000 ఆలస్య రుసుముతో ఏప్రిల్ 20 నుంచి 22 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. పరీక్షకు సంబంధించిన హాల్‌టికెట్లను ఏప్రిల్ 28 నుంచి అందుబాటులో ఉంచనున్నారు. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం మే 5న ఈసెట్ ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు.  


వివరాలు..


* ఏపీఈసెట్ - 2023


కోర్సులు: బీటెక్, బీఫార్మసీ.


అర్హత: పాలిటెక్నిక్ డిప్లొమా (ఇంజినీరింగ్), బీఎస్సీ (మ్యాథమెటిక్స్) ఉత్తీర్ణులై ఉండాలి. చివరి సంవత్సరం చదువుతున్నవారు కూడా దరఖాస్తుకు అర్హులు.


దరఖాస్తు ఫీజు: రిజిస్ట్రేషన్ ఫీజుగా ఓసీ అభ్యర్థులు రూ.600; బీసీ అభ్యర్థులు రూ.550; ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.500 చెల్లించాల్సి ఉంటుంది.


దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.


ఎంపిక విధానం: ప్రవేశపరీక్షలో ర్యాంకు ఆధారంగా. 


పరీక్ష విధానం: మొత్తం 200 మార్కులకుగాను ఈసెట్ ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు. మొత్తం 200 ఆబ్జె్క్టివ్ తరహా ప్రశ్నలు ఉంటాయి. ప్రశ్నల తీరు ఇంజినీరింగ్, ఫార్మసీ, బీఎస్సీ (మ్యాథ్స్) విభాగాలకు వేర్వేరుగా ఉంటాయి. 


ముఖ్యమైన తేదీలు...


➥ నోటిఫికేషన్ వెల్లడి: 08.03.2023.


➥ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 10.03.2023. 


➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 10.04.2023.


➥ రూ.500 ఆలస్య రుసుముతో ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 15.04.2023. 


➥ రూ.2000 ఆలస్య రుసుముతో ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 19.04.2023. 


➥దరఖాస్తుల సవరణకు అవకాశం:  20.04.2023 - 22.04.2023. 


➥ రూ.5000 ఆలస్య రుసుముతో ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 24.04.2023.  


➥ హాల్‌టికెట్ల డౌన్‌లోడ్: 28.04.2023. 


➥ పరీక్ష తేది: 05.05.2023. 


➥ పరీక్ష సమయం: ఉ.9 గం.- మ. 12 గం. వరకు, మ.3 గం.-సా.6 గం. వరకు.


➥ ప్రిలిమినరీ కీ: 09.05.2023. 


➥ ప్రిలిమినరీ ఆన్సర్ కీపై అభ్యంతరాల స్వీకరణ: 11.05.2023.


Detailed Notification


Online Application



TSMJBC Admissions: తెలంగాణ బీసీ గురుకులాల్లో 6,7,8 తరగతి ప్రవేశాలు, నోటిఫికేషన్ వెల్లడి!
తెలంగాణ రాష్ట్ర మహాత్మా జ్యోతిబా ఫులే బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించే 294 (148 బాలురు, 146 బాలికలు) మహాత్మా జ్యోతిబా ఫులే బీసీ గురుకులాల్లో 2023-24 విద్యా సంవత్సరానికి గాను 6, 7, 8 తరగతుల్లో మిగిలిన (బ్యాక్‌లాగ్) సీట్ల భర్తీకి సంబంధించి బ్యాక్‌లాగ్ సెట్-2023 నోటిఫికేషన్ వెలువడింది. అర్హులైన బీసీ, ఎంబీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈబీసీ విద్యార్థులు ఏప్రిల్ 20లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. మే 10న ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు.
ప్రవేశాలకు సంబంధించిన పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..


డా.బీఆర్ అంబేడ్కర్ గురుకులాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల, వివరాలు ఇలా!
తాడేపల్లిలోని ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ(APSWREIS) పరిధిలోని డా. బి.ఆర్.అంబేడ్కర్ గురుకుల విద్యాలయాల్లో 2023-2024 విద్యా సంవత్సరానికిగాను 5వ తరగతి ప్రవేశాలకు సంబంధించిన నోటిఫికేషన్ వెలువడింది. అర్హులైన బాలబాలికలు ఆన్‌లైన్ ద్వారా మార్చి 24 లోగా దరఖాస్తు చేసుకోవాలి. ప్రవేశ పరీక్ష ద్వారా విద్యార్థుల ఎంపిక జరుగుతుంది. ఎంపికైన విద్యార్థులకు ఉచిత విద్య, వసతితో పాటు క్రీడలు/ వివిధ పోటీ పరీక్షలకు శిక్షణ అందిస్తారు. రాష్ట్రంలోని 189 గురుకులాల్లో మొత్తం 14,940 సీట్లు అందుబాటులో ఉన్నాయి.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..