జేఎన్‌టీయూ కాకినాడ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా జులై 22న ఆన్‌లైన్ విధానంలో నిర్వహించిన ఏపీ ఈసెట్-2022 ఫలితాలను ఆగస్టు 10న విడుదల చేయనున్నట్లు కన్వీనర్ ఆచార్య ఎ.కృష్ణమోహన్. మంగళగిరిలోని రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఆధ్వర్యంలో ఫలితాలను ప్రకటించనున్నామన్నారు. వాస్తవానికి ఆగస్టు 6న ఈసెట్ ఫలితాలు ప్రకటించాల్సి ఉన్నప్పటికీ.. అనివార్య కారణాల వల్ల ఫలితాల వెల్లడి ఆలస్యమైంది. దీంతో ఆగస్టు 10న ఫలితాల వెల్లడికి అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.

Also Read: TS EAMCET Results: టీఎస్‌ ఎంసెట్‌ ఫలితాలు వచ్చేస్తున్నాయ్, రిజల్ట్స్ ఎప్పుడంటే?


ఏపీ ఈసెట్ పరీక్షలో కనీస అర్హత మార్కులు 25 శాతంగా ఉంది. అంటే 200 మార్కులకు గాను అభ్యర్థులకు కచ్చితంగా 50 మార్కులు సాధించాల్సి ఉంటుంది. కనీస అర్హత మార్కులు సాధించిన అభ్యర్థులకు మాత్రమే ర్యాంకులు కేటాయిస్తారు. ఇక కటాఫ్ మార్కుల విషయానికొస్తే.. ఒక్కో అభ్యర్థికి ఒక్కో విధంగా ఉంటాయి. అభ్యర్థుల సామాజికవర్గం, గతేడాది కటాఫ్ మార్కులు, పరీక్ష కాఠిన్యత, పరీక్షకు హాజరైన విద్యార్థుల సంఖ్య మీద ఆధారపడి ఉంటుంది.

డిప్లొమా విద్యార్థులకు ఇంజనీరింగ్‌ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఇంజినీరింగ్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్టు మన రాష్ట్రంతో పాటు తెలంగాణలోని 103 కేంద్రాలలో జూలై 22న ఉదయం, మధ్యాహ్నం నిర్వహించారు.


ఏపీ ఈసెట్-2022 పరీక్షకు మొత్తం 38,741 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఉదయం నిర్వహించిన ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్, అగ్రికల్చర్, సివిల్, కంప్యూటర్ సైన్స్, కెమికల్ ఇంజినీరింగ్ విభాగాలకు సంబంధించి 17,180 మంది హాజరు కాగా, 1,138 మంది గైర్హాజరయ్యారు.

ఇక మధ్యాహ్నం నిర్వహించిన ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్స్‌ ఇంజినీరింగ్, ఫార్మసీ, మెటలర్జికల్, ఎలక్ట్రానిక్స్‌ ఇన్‌స్ట్రుమెంటేషన్, మెకానికల్, మైనింగ్‌ విభాగాలకు సంబంధించి 19,238 మంది హాజరయ్యారు. పరీక్ష ప్రాథమిక కీ ఈ జులై 24న విడుదల చేశారు. ప్రాథమిక కీపై అభ్యంతరాలకు జులై 26వ తేదీ ఉదయం 10 వరకు అవకాశం కల్పించారు. 
Website

AP ECET-2022 ఫలితాలు ఇలా చూసుకోండి..



  • ఫలితాల కోసం అభ్యర్థులు మొదటగా https://cets.apsche.ap.gov.in/APSCHEHome.aspx  వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి.


  • అక్కడ హోంపేజీలో కనిపించే 'AP ECET - 2022' టాబ్‌పై క్లిక్ చేయాలి.


  • క్లిక్ చేయగానే ఈసెట్-2022కు సంబంధించిన వెబ్‌సైట్ ఓపెన్ అవుతుంది. -https://cets.apsche.ap.gov.in/ECET/ECET/ECET_HomePage.aspx


  • అక్కడ పేజీలో కనిపించే AP ECET - 2022 Results/Rank Cards ఆప్షన్‌పై క్లిక్ చేసి ఫలితాలు చూసుకోవచ్చు.


  • ఫలితాలతోపాటు ర్యాంకు కార్డులు కూడా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.



JEE Advanced 2022 దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం

జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) అడ్వాన్స్‌డ్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) బాంబే ఆగస్టు 8న దరఖాస్తు ప్రక్రియను ప్రారంభించింది. జేఈఈ మెయిన్ పరీక్షల్లో అర్హత సాధించిన అభ్యర్థులు జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష కోసం ఆగస్టు 8 నుంచి 11 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

షెడ్యూలు ప్రకారం ఆగస్టు 28న జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్షలను నిర్వహించనున్నారు. పరీక్షలో రెండు పేపర్లు (పేపర్-1, పేపర్-2) ఉంటాయి. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పేపర్-1, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పేపర్-2 పరీక్ష నిర్వహిస్తారు. ఒక్కో పేపర్‌కు మూడు గంటల సమయం కేటాయించారు.


 



Also Read:


హైదరాబాద్ విద్యార్థికి బంపర్ ఆఫర్, ఏకంగా రూ.1.30కోట్ల స్కాలర్‌షిప్!!


బీసీ విద్యార్థులకు గుడ్‌న్యూస్, పీఎం యశస్వీ స్కాలర్‌షిప్ దరఖాస్తులు షురూ!



పేద విద్యార్థుల జీవితాల్లో ‘పరివర్తనం’ - హెచ్‌డీఎఫ్‌సీ పరివర్తన్‌ స్కాలర్‌షిప్‌



పేద విద్యార్థులకు 'ఉపకారం' - పోస్ట్‌ మెట్రిక్‌ స్కాలర్‌షిప్ కోసం దరఖాస్తు చేశారా?


 


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..