AP EAPCET Result 2021 Live Updates: నేడే ఈఏపీసెట్ ఫలితాలు.. రిజల్ట్ చెక్ చేసుకోండిలా..

ఆంధ్రప్రదేశ్‌లో ఈఏపీసెట్‌ ఫలితాలు మరికొద్ది గంటల్లో విడుదల కానున్నాయి. ఫలితాలకు సంబంధించిన లైవ్‌ అప్‌డేట్లను ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. తాజా అప్‌డేట్ల కోసం ఈ పేజీని రీఫ్రెష్ చేస్తుండండి.

Continues below advertisement

LIVE

Background

ఏపీ ఇంజనీరింగ్‌ కళాశాలల్లో ప్రవేశాలకు నిర్వహించే ఈఏపీసెట్‌ (పాత ఎంసెట్) ఫలితాలు ఈరోజు (సెప్టెంబర్ 8) ఉదయం 11 గంటలకు విడుదల కానున్నాయి. ఏపీ విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ఈఏపీసెట్‌ ఫలితాలను విడుదల చేయనున్నారు. మొదట ఎంపీసీ విభాగాల ఫలితాలను విడుదల చేయాలని అధికారులు నిర్ణయించారు. అభ్యర్థులు ఈఏపీసెట్ ఫలితాల కోసం sche.ap.gov.in వెబ్‌సైట్‌ను సంప్రదించవచ్చు. 
రాష్ట్ర వ్యాప్తంగా ఈ పరీక్షలకు 1.76 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 1,66,460 మంది పరీక్షలకు హాజరయ్యారు. ఆగస్టు 19, 20, 23, 24, 25 తేదీల్లో ఈఏపీసెట్ ఇంజనీరింగ్ విభాగం పరీక్షలు నిర్వహించారు. సెప్టెంబర్ 3, 6, 7 తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మసీ విభాగాల పరీక్షలు జరిగాయి. కంప్యూటర్‌ ఆధారిత విధానం ద్వారా ఈ పరీక్షలను నిర్వహించారు. ఈ నెల 18 నుంచి మొదటి విడత కౌన్సెలింగ్ ప్రారంభం అయ్యే అవకాశం ఉంది.  
ఈఏపీసెట్ పరీక్షల ద్వారా ఇంజనీరింగ్, బీటెక్‌ డెయిరీ టెక్నాలజీ, బయోటెక్నాలజీ, బీటెక్‌ ఫుడ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ, బీటెక్‌ అగ్రి ఇంజనీరింగ్, బీఎస్సీ (హార్టికల్చర్‌), బీఎస్సీ (అగ్రి), బీ-ఫార్మసీ, ఫార్మా డీ, బీవీఎస్సీ అండ్‌ ఏహెచ్‌/ బీఎఫ్‌ఎస్సీ కోర్సులలో ప్రవేశాలు పొందవచ్చు. ఈఏపీసెట్ పరీక్షలను రాష్ట్ర ఉన్నత విద్యా మండలి తరఫున జేఎన్టీయూ కాకినాడ నిర్వహిస్తోంది. 

Continues below advertisement
11:00 AM (IST)  •  08 Sep 2021

మరికాసేపట్లో విడుదల కానున్న ఫలితాలు..

ఈఏపీసెట్ ఫలితాలు మరికాసేపట్లో విడుదల కానున్నాయి. ఫలితాలను విడుదల చేసేందుకు ఏపీ విద్యా శాఖ మంత్రి సహా అధికారులు సిద్ధమయ్యారు. దీనికి సంబంధించిన ప్రెస్ మీట్ ఇప్పుడే ప్రారంభమైంది. 

10:13 AM (IST)  •  08 Sep 2021

ఫలితాలు డౌన్‌లోడ్ చేసుకోండిలా..


  1. sche.ap.gov.in వెబ్‌సైట్‌ను తెరవండి. 

  2. ఈఏపీసెట్ 2021 రిజల్ట్స్ లింక్ మీద క్లిక్ చేయండి. 

  3. లాగిన్ క్రెడిన్షియల్ వివరాలు ఎంటర్ చేయండి.

  4. ఫలితాలు మీ స్క్రీన్ మీద కనిపిస్తాయి.

  5. భవిష్యత్ అవసరాల కోసం వీటిని డౌన్‌లోడ్ చేసుకోండి.  

06:34 AM (IST)  •  08 Sep 2021

ఈసారి ఇంట‌ర్ వెయిటేజీ ఉండదు

ఇంజనీరింగ్‌, అగ్రికల్చర్‌, ఫార్మా కాలేజీల‌లో ప్రవేశాలకు ఇంటర్మీడియెట్ మార్కుల వెయిటేజ్‌ తొల‌గించిన‌ట్లు ఏపీ ఇంట‌ర్ బోర్డు ప్ర‌క‌టించింది. గ‌తేడాది వ‌ర‌కు ఈ ఎంట్ర‌న్స్ ప‌రీక్ష‌ల‌లో విద్యార్థులకు వారి ఇంట‌ర్ మార్కులకు గానూ 25 శాతం వెయిటేజీ ఇచ్చేవారు. ఈ ఏడాది కోవిడ్ వల్ల ఇంట‌ర్ ప‌రీక్ష‌ల‌ను నిర్వ‌హించ‌ని నేపథ్యంలో వెయిటేజ్ తొలిగిస్తున్నట్లు బోర్డు తెలిపింది. 

06:33 AM (IST)  •  08 Sep 2021

ప్రశాంతంగా ముగిసిన అగ్రి, ఫార్మసీ విభాగాల పరీక్షలు

ఈఏపీసెట్ పరీక్షలు నిన్నటితో (సెప్టెంబర్ 7) ముగిశాయి. అగ్రికల్చర్, ఫార్మసీ ప్రవేశాలకు ఈ నెల 3 నుంచి మొత్తం ఐదు విడతలుగా పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షలకు 88,822 మంది దరఖాస్తు చేసుకోగా.. 78,066 మంది హాజరయ్యారు. ఇంజనీరింగ్ విభాగాల కోసం 1,76,603 మంది దరఖాస్తు చేసుకోగా.. 1,66,460 మంది పరీక్ష రాశారు.