AP EAPCET Results 2024: ఆంధ్రప్రదేశ్‌లో ఇంజినీరింగ్, అగ్రికల్చర్ అండ్ ఫార్మా కోర్సుల్లో ప్రవేశాల కోసం మే 16 నుంచి 23 వరకు ఏపీ ఎప్‌సెట్-2024 పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఇందులో మే 16, 17 తేదీల్లో అగ్రికల్చర్‌, ఫార్మసీ విభాగాలకు; మే 18 నుంచి 23 వరకు ఇంజినీరింగ్‌ విభాగానికి పరీక్షలు నిర్వహించారు. హైదరాబాద్‌తోపాటు రాష్ట్రవ్యాప్తంగా 142 పరీక్ష కేంద్రాల్లో ఎప్‌సెట్ పరీక్షలు నిర్వహించారు. ఎప్‌సెట్ పరీక్షలకు మొత్తం 93.47 శాతం విద్యార్థులు హాజరయ్యారు. ఈ నేపథ్యంలో ఎప్‌సెట్ ఫలితాల వెల్లడికి ఉన్నత విద్యామండలి సమాయత్తమవుతోంది. ఎప్‌సెట్ ఫలితాలను జూన్ మొదటివారంలో వెల్లడించే అవకాశం ఉంది. ఎప్‌సెట్ ఫలితాలతో పాటు కౌన్సెలింగ్‌ షెడ్యూలును కూడా అధికారులు ప్రకటించనున్నారు. 


➥ ఈ ఏడాది పరీక్షలకు మొత్తం 3,62,851 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా.. వీరిలో 3,39,139 మంది విద్యార్థులకు పరీక్షలకు హాజరయ్యారు. మొత్తం 93.47 శాతం హాజరు నమోదైంది. 


➥ ఇంజినీరింగ్‌ విభాగంలో మొత్తం 2,74,213 మందికి గాను 2,58,373 (94.22 శాతం) మంది పరీక్షలు రాశారు. 


➥ బైపీసీ విభాగానికి సంబంధించి మొత్తం 88,638 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా.. ఇందులో 80,766 (91.12 శాతం) విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు.


➥ ఏపీ ఎప్‌సెట్ పరీక్షలకు సంబంధించిన ప్రిలిమినరీ ఆన్సర్ 'కీ'ని జేఎన్‌టీయూ కాకినాడ మే 23న విడుదల చేసింది. ఆన్సర్ కీతోపాటు అభ్యర్థుల రెస్పాన్స్‌ షీట్లను కూడా విడుదల చేశారు. అభ్యర్థుల నుంచి మే 25న ఉదయం 10 గంటల వరకు ఆన్సర్ కీపై అభ్యంతరాలు స్వీకరించారు. 


➥ ఇక ఇంజినీరింగ్‌ విభాగం పరీక్షలకు సంబంధించిన ప్రాథమిక ‘కీ’, రెస్పాన్స్‌ షీట్లను మే 24న ఉదయం 10 గంటలకు విడుదల చేశారు. ఆన్సర్ ‘కీ’ పై మే 26న ఉదయం 10 గంటల వరకు అభ్యంతరాలు స్వీకరించారు. ఈ ప్రక్రియ పూర్తికావడంతో ఫలితాల వెల్లడికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.


ఇంటర్ మార్కులకు వెయిటేజీ..
ఏపీ ఎప్‌సెట్‌-2024లో ఇంటర్ మార్కులకు 25 శాతం వెయిటేజీ ఇవ్వనున్నారు. ఇందుకోసం ఇతర బోర్డులకు సంబంధించిన విద్యార్థులు తమ ఇంటర్‌ మార్కుల మెమోలను అధికారిక వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేయాల్సి ఉంటుంది. విద్యార్థులకు ఏమైనా సందేహాలుంటే పరిష్కరించేందుకు ఫోన్‌ నెంబర్లు: 0884-2359599, 2342499 అందుబాటులో ఉంచారు. వీటిద్వారా సందేహాలు నివృత్తి చేసుకోవచ్చు. 


ఆంధ్రప్రదేశ్‌ ఇంజినీరింగ్, అగ్రికల్చర్ &‌ ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (ఏపీ ఈఏపీసెట్) - 2024 ద్వారా ప్రవేశాలు కల్పించే కోర్సులు:


➥ ఇంజినీరింగ్, బయో టెక్నాలజీ, బీటెక్‌(డెయిరీ టెక్నాలజీ), బీటెక్ (అగ్రికల్చరల్ ఇంజినీరింగ్), బీటెక్ (ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ)


➥ బీఎస్సీ(అగ్రికల్చర్), బీఎస్సీ(హార్టికల్చర్), బీవీఎస్సీ &‌ హెచ్, బీఎఫ్‌ఎస్సీ


➥ బీఫార్మసీ, ఫార్మా-డి.


➥ బీఎస్సీ (నర్సింగ్).


ALSO READ:


ఏపీ హార్టిసెట్‌ నోటిఫికేషన్ విడుదల, పరీక్ష ఎప్పుడంటే?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పశ్చిమగోదావరి జిల్లా వెంకటరామన్నగూడెంలోని డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ హార్టికల్చరల్‌ యూనివర్సిటీ, 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి బీఎస్సీ(ఆనర్స్) కోర్సులో ప్రవేశానికి 'ఏపీ హార్టిసెట్‌-2024' నోటిఫికేషన్ విడుదల చేసింది. సంబంధిత విభాగంలో డిప్లొమా పూర్తిచేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. హార్టిసెట్‌ పరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు. మొత్తం 101 సీట్లను భర్తీ చేస్తారు. వీటిలో యూనివర్సిటీ కాలేజీ సీట్లు 61 కాగా.. ప్రైవేట్ కాలేజీ సీట్లు 40 ఉన్నాయి. మొత్తం సీట్లులో లోకల్ అభ్యర్థులకు 85 శాతం సీట్లు, 15 శాతం సీట్లు అన్-రిజర్వ్‌డ్ కింద భర్తీ చేస్తారు. ఇప్పటికే ఇందుకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ మే 22న ప్రారంభంకాగా.. జూన్ 15న సాయంత్రం 4 గంటల్లోగా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. 
నోటిఫికేషన్, పరీక్ష వివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..