ఏపీలో ఇంజినీరింగ్, ఫార్మసీ, అగ్రికల్చర్, బీఎస్సీ నర్సింగ్ కోర్సుల ప్రవేశాలకు నిర్వహించే 'ఏపీ ఈఏపీసెట్'కు అపరాధ రుసుము లేకుండా దరఖాస్తు గడువు శనివారం(ఏప్రిల్ 15)తో ముగిసిన సంగతి తెలిసిందే. మొత్తం 3,26,315 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుసుకున్నారు. వీటిలో ఇంజినీరింగ్‌కు 2,22,850 దరఖాస్తులు వచ్చాయి. గతేడాదితో పోల్చితే ఈసారి 25 వేల దరఖాస్తులు పెరిగాయి. ఆ మేరకు పరీక్ష కేంద్రాలు మార్పు చేసినట్లు ఎంసెట్ కన్వీనర్ వెల్లడించారు.
మొదట ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఎంపీసీ స్ట్రీమ్ అభ్యర్థులకు మే 15 నుంచి 22 వరకు ఉదయం పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. పెరిగిన దరఖాస్తుల దృష్ట్యా అదనంగా మే 19న మధ్యాహ్నం సెషన్‌లోనూ పరీక్ష నిర్వహిస్తామని కన్వీనర్ పేర్కొన్నారు. పరీక్ష కేంద్రాలకు ప్రస్తుతం ఇచ్చిన ప్రాధాన్య క్రమంలో కొన్ని మార్పులు చేశామన్నారు. ఆన్‌లైన్ దరఖాస్తు మరోసారి డౌన్‌లోడ్ చేసుకోవాలన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సు్లో ప్రవేశాలకు నిర్దేశించిన ఏపీ ఈఏపీసెట్-2023 నోటిఫికేషన్ మార్చి 10న వెలువడిన సంగతి తెలిసిందే. దీనిద్వారా 2023 విద్యా సంవత్సరానికి ఏపీలోని విశ్వవిద్యాలయాలు, ప్రైవేట్ అన్‌ఎయిడెడ్, అఫిలియేటెడ్ ప్రొఫెషనల్ కళాశాలల్లో అండర్ గ్రాడ్యుయేట్ ప్రొఫెషనల్ ఇంజినీరింగ్, అగ్రికల్చర్/ హార్టికల్చర్, ఫార్మసీ, వెటర్నరీ/ ఫిషరీస్ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. అభ్యర్థుల నుంచి మార్చి 11 నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఆలస్య రుసుము లేకుండా దరఖాస్తు గడువు ఏప్రిల్ 15తో ముగిసింది. అయితే ఆలస్య రుసుముతో మే 14 వరకు దరఖాస్తుకు అవకాశం కల్పించారు.
అభ్యర్థులు రూ.500 ఆలస్య రుసుముతో ఏప్రిల్ 16 నుంచి 30 వరకు, రూ.1000 ఆలస్య రుసుముతో మే 1 నుంచి 5 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే రూ.5000 ఆలస్య రుసుముతో మే 6 నుంచి 12 వరకు, రూ.10,000 ఆలస్య రుసుముతో మే 13 నుంచి 14 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. దరఖాస్తుల్లో సవరణకు మే 4 నుంచి 6 వరకు అవకాశం కల్పించనున్నారు. పరీక్షకు సంబంధించిన హాల్‌టికెట్లను మే 7 నుంచి అందుబాటులో ఉంచనున్నారు. మే 15 నంచి 18 వరకు ఎంపీసీ స్ట్రీమ్ విభాగాలకు పరీక్ష నిర్వహిస్తారు. అలాగే మే 22, 23 తేదీల్లో బైపీసీ స్ట్రీమ్ విభాగాలకు పరీక్ష నిర్వహిస్తారు.
ముఖ్యమైన తేదీలు...
➥ నోటిఫికేషన్ వెల్లడి: 10.03.2023.
➥ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 11.03.2023.
➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 15.04.2023
➥ రూ.500 ఆలస్య రుసుముతో ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 30.04.2023
➥ రూ.1000 ఆలస్య రుసుముతో ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 05.05.2023
➥ దరఖాస్తుల సవరణకు అవకాశం: 04.05.2023 to 06.05.2023.
➥ రూ.5000 ఆలస్య రుసుముతో ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 12.05.2023.
➥ రూ.10,000 ఆలస్య రుసుముతో ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 14.05.2023.
➥ హాల్‌టికెట్ల డౌన్‌లోడ్: 09.05.2023.
➥ ఏపీఈఏపీ సెట్-ఎంపీసీ స్ట్రీమ్ (ఇంజినీరింగ్) విభాగాలకు: మే 15 నంచి 18 వరకు.
➥ ఏపీఈఏపీ సెట్-బైపీసీ స్ట్రీమ్ (అగ్రికల్చర్ & ఫార్మసీ) విభాగాలకు: మే 22, 23 తేదీల్లో.
➥ పరీక్ష సమయం: ఉ.9 గం.- మ. 12 గం. వరకు, మ.3 గం.-సా.6 గం. వరకు.
➥ ప్రిలిమినరీ కీ: 24.05.2023 9.00 am.
➥ ప్రిలిమినరీ ఆన్సర్ కీపై అభ్యంతరాల స్వీకరణ: 24.05.2023 9.00 am - 26.05.2023 9.00 am
APEAPCET 2023 నోటిఫికేషన్ & ఆన్‌లైన్ దరఖాస్తు కోసం క్లిక్ చేయండి..
Also Read:
JNVS Entrance Exam: నవోదయ ప్రవేశ పరీక్ష హాల్‌టికెట్లు వచ్చేశాయ్, పరీక్ష ఎప్పుడంటే?
ఆరో తరగతిలో ప్రవేశాలకు నవోదయ విద్యాలయ సమితి నిర్వహించే పరీక్షకు అడ్మిట్‌కార్డులు విడుదలయ్యాయి. ఏప్రిల్ 29న జరిగే ఈ పరీక్షకు జనవరి 31వరకు ఆన్‌లైన్ దరఖాస్తులు స్వీకరించిన విషయం తెలిసిందే. ఈ పరీక్షకు గడువు సమీపిస్తున్న వేళ తాజాగా హాల్‌టికెట్లను అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. ఈ పరీక్ష ఏప్రిల్ 29న ఉదయం 11.30 గంటలకు ప్రారంభం కానుంది. ఈ ఫలితాలను జూన్‌లోపు విడుదల చేసే అవకాశం ఉంది. అడ్మిట్ కార్డులు పొందాలంటే విద్యార్థులు తమ రిజిస్ట్రేషన్ నంబర్, పుట్టిన తేదీని ఎంటర్ చేయాల్సి ఉంటుంది.
హాల్‌టికెట్ల కోసం క్లిక్ చేయండి..
సిల్వర్ సెట్-2023 దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం, చివరితేది ఎప్పుడంటే?
కర్నూలులోని సిల్వర్ జూబ్లీ ప్రభుత్వ కళాశాలలో ప్రవేశాలకు నోటిఫికేషన్ వెలువడింది. 2023-24 విద్యా సంవత్సరానికి గాను డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే 'సిల్వర్ సెట్-2023' పరీక్షకు ఏప్రిల్ 7న ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకాగా.. మే 6 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. ప్రవేశ పరీక్షను మే 25న నిర్వహించాలని ప్రాథమికంగా నిర్ణయించారు. ఇంటర్ ఉత్తీర్ణత కలిగిన విద్యార్థులు ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన వారు దరఖాస్తుకు అర్హులు.ఆన్‌లైన్ ప్రవేశ పరీక్ష, రూల్ ఆఫ్ రిజర్వేషన్, ప్రత్యేక కేటగిరీ రిజర్వేషన్ ఆధారంగా సీటు కేటాయిస్తారు. ఎంపికైన విద్యార్థులకు విద్యా బోధనతో పాటు భోజనం, వసతి అందిస్తారు. ఏపీలో పాత 13 జిల్లాలతో పాటు తెలంగాణలో ఖమ్మం, వరంగల్, మహబూబ్ నగర్, ఆదిలాబాద్, హైదరాబాద్‌లో పరీక్ష నిర్వహించనున్నారు.
ప్రవేశ పరీక్ష పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..