AP DEECET - 2024 Results: ఏపీలో రెండేళ్ల డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్(డీఎడ్) కోర్సులో ప్రవేశానికి నిర్వహించిన AP DEECET-2024 ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. మే 24న ఆన్‌లైన్ విధానంలో జరిగిన ఈ పరీక్ష ఫలితాలను పాఠశాల విద్యాశాఖ మే 29న విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను అందుబాటులో ఉంచింది. అభ్యర్థులు తమ ఐడీ నెంబరు, పుట్టిన తేదీ వివరాలు నమోదుచేసి ర్యాంక్ కార్డు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
AP DEECET 2024 ఫలితాలు ఇలా చూసుకోండి..
Step 1: ఏపీ డీసెట్ ఫలితాల కోసం అభ్యర్థులు మొదటగా అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి-https://apdeecet.apcfss.in/
Step 2: అక్కడ హోంపేజీలో కిందిభాగంలో కనిపించే AP DEECET 2024 ఫలితాల లింక్ మీద క్లిక్ చేయాలి.
Step 3: ఆ తర్వాత వచ్చే పేజీలో అభ్యర్థులు తమ ఐడీ నెంబరు, పుట్టినతేదీ, వెరిఫికేషన్ కోడ్ వివరాలు నమోదు చేయాలి.
Step 4: డీసెట్ ఫలితాలు కంప్యూటర్ స్క్రీన్ మీద కనిపిస్తాయి.
Step 5: ఫలితాలను డౌన్‌లోడ్ చేసుకొని, ప్రింట్ తీసుకోవాలి. భవిష్యత్ అవసరాల కోసం భద్రపరచుకోవాలి.
ఏపీ డీఈఈసెట్ ర్యాంకు కార్డు కోసం క్లిక్ చేయండి..
ప్రకటించిన షెడ్యూలు ప్రకారం పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు మొదటి విడత కౌన్సెలింగ్‌కు వెబ్ ఐచ్ఛికాలను జూన్ 6 నుంచి 8 వరకు నమోదు చేసుకునేందుకు అవకాశం కల్పిస్తారు. వెబ్‌ఆప్షన్ల ఆధారంగా మెరిట్ జాబితాను (సీట్ల కేటాయింపు) జూన్ 10న వెల్లడించనున్నారు. సంబంధిత డైట్ కళాశాలల్లో జూన్ 12 నుంచి 15 వరకు ధ్రువపత్రాల పరిశీలన నిర్వహించనున్నారు. డీఈఈసెట్ ర్యాంకు ద్వారా ఏపీలోని ప్రభుత్వ డైట్ కళాశాలలు, ప్రైవేట్ ఎలిమెంటరీ టీచర్ ఎడ్యకేషన్ ఇన్‌స్టిట్యూషన్స్‌లో ప్రవేశాలు కల్పిస్తారు.
రాష్ట్రవ్యాప్తంగా మే 24న 19 కేంద్రాల్లో ఏపీ డీఈఈసెట్ 2024 పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు ఈ పరీక్ష నిర్వహించారు. ఈ పరీక్షకు మొత్తం 4,949 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. డీఈఈఈసెట్‌లో సాధించిన ర్యాంకు, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా ఈ కోర్సులో సీటు కేటాయిస్తారు. మొత్తం సీట్లలో మ్యాథమెటిక్స్- 25%, ఫిజికల్ సైన్స్- 25%, బయోలాజికల్ సైన్స్- 25%, సోషల్ స్టడీస్- 25% సీట్లను కేటాయిస్తారు.
పరీక్ష విధానం:
మొత్తం 100 మార్కులకు ప్రవేశ పరీక్ష నిర్వహించారు. మొత్తం 100 ప్రశ్నలు ఉన్నాయి. ఇందులో పార్ట్-ఎ: 60 మార్కులు-60 ప్రశ్నలు, పార్ట్-బి: 40 మార్కులు-40 ప్రశ్నలు అడిగారు. ఆబ్జెక్టివ్ విధానంలోనే ప్రశ్నలు ఇచ్చారు. పార్ట్-ఎలో టీచింగ్ ఆప్టిట్యూడ్, జనరల్ నాలెడ్జ్, ఇంగ్లిష్, తెలుగు, ఆప్టెడ్ లాంగ్వేజ్ (తెలుగు/తమిళం/ఉర్దూ/ఇంగ్లిష్), మ్యాథమెటిక్స్, జనరల్ సైన్స్, సోషల్ స్టడీస్ సబ్జెక్టుల నుంచి ప్రశ్నలు ఉంటాయి. ఇక పార్ట్-బిలో మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీ, హిస్టరీ, ఎకనామిక్స్, సివిక్స్, హిస్టరీ/ఎకనామిక్స్/ సివిక్స్ సబ్జెక్టుల నుంచి ప్రశ్నలు ఉంటాయి.
ముఖ్యమైన తేదీలు..
➥ ఏపీ డీఈఈసెట్-2024 నోటిఫికేషన్ విడుదల: 22.04.2024.
➥ ఆన్‌లైన్‌లో ఫీజు చెల్లింపు తేదీలు: 23.04.2024 నుంచి 08.05.2024 వరకు.
➥ ఆన్‌లైన్‌లో దరఖాస్తు తేదీలు: 24.04.2024 నుంచి 09.05.2024 వరకు.
➥ డీఈఈసెట్ పరీక్ష హాల్‌టిక్కెట్లు విడుదల: 21.05.2024.
➥ డీఈఈసెట్ ప్రవేశ పరీక్ష తేదీ: 24.05.2024.
➥ పరీక్ష ఫలితాల వెల్లడి: 30.05.2024.
➥ మొదటి కౌన్సెలింగ్‌కు వెబ్ ఐచ్ఛికాల నమోదు: 06.06.2024 నుంచి 08.06.2024 వరకు.
➥ సీట్ల కేటాయింపు: 10.06.2024.
➥ సర్టిఫికేట్ వెరిఫికేషన్ తేదీలు: 12.06.2024 నుంచి 15.06.2024 వరకు.