AP 10th Results 2022: ఏపీలో పదో తరగతి ఫలితాలపై స్పష్టత వచ్చింది. జూన్ రెండో వారంలో విడుదల అవుతాయనుకున్న టెన్త్ రిజల్ట్స్ వారం ముందుగానే రిలీజ్ కానున్నాయి. జూన్ 4న (శనివారం) ఉదయం 11 గంటలకు ఏపీ టెన్త్ ఫలితాలు విడుదల చేయనున్నట్లు రాష్ట్ర విద్యాశాఖ గురువారం వెల్లడించింది. ప్రస్తుత విధానానికి భిన్నంగా ఈసారి టెన్త్ ఫలితాలను గ్రేడ్లకు బదులు మార్కుల రూపంలో ప్రకటించనున్నట్లు వెల్లడించారు. ఫలితాల్లో ర్యాంకులు ప్రకటించడకూడదని, ర్యాంకులను నిషేధిస్తున్నట్లు స్పష్టం చేశారు.


రిజల్ట్స్ ఈసారి గేడ్లు కాదు..  
ఏపీ టెన్త్ విద్యార్థుల బోర్డ్ ఎగ్జామ్స్ ఫలితాలను రాష్ట్ర విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి.రాజశేఖర్‌ విజయవాడలో విడుదల చేయనున్నారు. కొవిడ్‌ వ్యాప్తి కారణంగా రెండేళ్లు (2019 తర్వాత ) పరీక్షలు జరగలేదు. రెండేళ్ల తరువాత టెన్త్ పరీక్షలు నిర్వహించగా.. దాదాపు 6,21,799 మంది విద్యార్థులు ఎగ్జామ్స్‌కు హాజరయ్యారు. పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల్లో విద్యార్థులకు ర్యాంకులు వచ్చినట్లు ఏ విధంగానూ ప్రచారం చేయకూడదని, ఈ సారి ఫలితాలను గ్రేడ్లకు బదులు మార్కుల రూపంలో ప్రకటిస్తామని స్పష్టం చేశారు. తమ సూచనలు పాటించకుండా ఏవైనా విద్యా సంస్థలు, స్కూళ్లు కనుక ర్యాంకులు ప్రకటిస్తే వారు చట్టరీత్యా శిక్షార్హులని హెచ్చరించారు. టెన్త్ విద్యార్థులు తమ ఫలితాలను శనివారం నాడు అధికారిక వెబ్‌సైట్  https://www.bse.ap.gov.in/ లో చెక్ చేసుకోవాలని రాష్ట్ర విద్యాశాఖ సూచించింది.


నిబంధనలు ఉల్లంఘిస్తే జరిమానా, జైలుశిక్ష..
రెండేళ్ల తరువాత నిర్వహించిన ఏపీ టెన్త్ ఎగ్జామ్స్ ఫలితాల ప్రక్రియ సజావుగా జరగాలని రాష్ట్ర విద్యాశాఖ భావిస్తోంది. ఈ నేపథ్యంలో ర్యాంకుల ప్రకటనపై నిషేధం విధించింది. విద్యార్థులు గ్రేడ్లకు బదులుగా మార్కుల రూపంలో ఫలితాలు అందుకుంటారు. ర్యాంకుల ప్రకటనపై నిబంధనలు ఉల్లంఘించిన సంస్థలు, యాజమాన్యాలపై 3 నుంచి ఏడేళ్ల వరకు జైలు శిక్షతో పాటు లక్ష రూపాయల వరకు జరిమానా విధిస్తామని విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి.రాజశేఖర్ పేర్కొన్నారు. విద్యార్థులు, తల్లిదండ్రులు ప్రయోజనాల దృష్ట్యా ఎస్ఎస్సీ పరీక్షల్లో ర్యాంకులతో ప్రకటనలు జారీ చేయడాన్ని నిషేధిస్తూ పాఠశాల విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఈమేరకు టెన్త్ ఫలితాల ప్రకటనపై జీవో జారీ చేశారు. 


Also Read: UPSC Results Update : 2013లో 1228 - ఇప్పుడు 710 మాత్రమే ! యూపీఎస్సీ పోస్టుల భర్తీని ఇంత భారీగా తగ్గించేశారేంటి ?


Also Read: AP Govt On Private Schools : ప్రైవేట్ విద్యాసంస్థలకు ఏపీ ప్రభుత్వం వార్నింగ్, ర్యాంకుల ప్రకటనలపై కఠిన చర్యలు