AP 10th Class Exam Dates | అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి పబ్లిక్ పరీక్షల షెడ్యూల్‌ చాలా రోజుల కిందటే విడుదల కాగా, తాజాగా స్వల్ప మార్పు చేశారు. ఈ మేరకు బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ అధికారికంగా విడుదల చేసింది. ఏపీ టెన్త్ పరీక్షలు షెడ్యూల్ ప్రకారం మార్చి 16, 2026న ప్రారంభం కానుండగా, ఏప్రిల్ 01, 2026 వరకు కొనసాగుతాయి. ఇంగ్లీష్ ఎగ్జామ్ మొదట మార్చి 20న షెడ్యూల్ చేయగా, పండుగ కారణంగా విద్యార్థుల సౌకర్యార్థం మార్చి 21 తేదీకి మార్చారు.

Continues below advertisement

దాదాపు అన్ని ప్రధాన పరీక్షలు ఉదయం 9:30 గంటలకు ప్రారంభం కాగా, మధ్యాహ్నం 12:45 గంటల వరకు ముగుస్తాయి.  అయితే ఫిజికల్ సైన్స్, బయోలాజికల్ సైన్స్, వొకేషనల్ వంటి కొన్ని ఎగ్జామ్స్ టైమ్ కాస్త భిన్నంగా ఉంటుంది. ఈ మేరకు ఏపీ పాఠశాల విద్యాశాఖ మార్చి 2026లో నిర్వహించనున్న పదో తరగతి వార్షిక పరీక్షల షెడ్యూల్ ప్రకటించింది. 

SSC అకడమిక్ కోర్సుతో పాటు OSSC కోర్సు అభ్యర్థులకు కూడా ఒకటే ఎగ్జామ్ షెడ్యూల్ వర్తిస్తుందని అధికారులు తెలిపారు.  నిర్ణీత సమయం కంటే ముందే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని విద్యార్థులకు విద్యాశాఖ అధికారులు సూచించారు. ప్రభుత్వం ప్రకటించిన సెలవు దినాలను పరిగణనలోకి తీసుకుని ఈ టైమ్ టేబుల్ తయారుచేశారు.   

Continues below advertisement

ఏపీ పదో తరగతి పరీక్షల షెడ్యూల్ - మార్చి 2026

తేదీ  సబ్జెక్టు సమయం మార్కులు
16.03.2026 (సోమవారం) ఫస్ట్ లాంగ్వేజ్ (గ్రూప్-A) / ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్-I (కాంపోజిట్ కోర్సు) ఉ. 09:30 నుండి మ. 12:45 వరకు 100/70
18.03.2026 (బుధవారం) సెకండ్ లాంగ్వేజ్ ఉ. 09:30 నుండి మ. 12:45 వరకు 100
21.03.2026 (శనివారం) ఇంగ్లీష్ (English) ఉ. 09:30 నుండి మ. 12:45 వరకు 100
23.03.2026 (సోమవారం) గణితం (Mathematics) ఉ. 09:30 నుండి మ. 12:45 వరకు 100
25.03.2026 (బుధవారం) భౌతిక శాస్త్రం (Physical Science) ఉ. 09:30 నుండి ఉ. 11:30 వరకు 50
28.03.2026 (శనివారం) జీవ శాస్త్రం (Biological Science) ఉ. 09:30 నుండి ఉ. 11:30 వరకు 50
30.03.2026 (సోమవారం) సాంఘిక శాస్త్రం (Social Studies) ఉ. 09:30 నుండి మ. 12:45 వరకు 100
31.03.2026 (మంగళవారం) ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్-II (కాంపోజిట్ కోర్సు) / OSSC మెయిన్ లాంగ్వేజ్ పేపర్-I ఉ. 09:30 నుండి ఉ. 11:15/12:45 వరకు 30/100
01.04.2026 (బుధవారం) OSSC మెయిన్ లాంగ్వేజ్ పేపర్-II / SSC వొకేషనల్ కోర్సు (థియరీ) ఉ. 09:30 నుండి ఉ. 11:30/12:45 వరకు 100/40

ఉమ్మడి సిలబస్: SSC అకడమిక్ కోర్సు, OSSC కోర్సు అభ్యర్థులందరికీ అన్ని అకడమిక్ సబ్జెక్టులు/పేపర్లు సమానంగా ఉంటాయి. విద్యార్థులు తమకు కేటాయించిన సరైన ప్రశ్నపత్రాన్ని (Correct combination) మాత్రమే తీసుకోవాలి. పొరపాటున వేరే ప్రశ్నపత్రానికి సమాధానాలు రాస్తే, వారికి మార్కులు కేటాయించారు. విద్యార్థులు కనీసం 30 నిమిషాల ముందే (ఉదయం 9:00 గంటలకు) పరీక్షా కేంద్రానికి చేరుకోవడం మంచిది. సబ్జెక్టును బట్టి పరీక్షా పత్రాలు 100 మార్కులు లేదా 50 మార్కులకు ఉంటాయి.

ల్యాంగ్వేజ్ సబ్జెక్టులు, మ్యాథ్స్ /సోషల్ పేపర్లు 100 మార్కులకు ఉంటాయి. ఫిజికల్ సైన్స్ (50 మార్కులు), బయాలజీ (50 మార్కులు) వేర్వేరు రోజుల్లో జరుగుతాయి. ఫిబ్రవరి నాటికే సిలబస్ పూర్తి చేసి, రివిజన్, మోడల్ పేపర్ల సాధనపై విద్యా సంస్థలు ఫోకస్ చేయాలని అధికారులు సూచిస్తున్నారు. టెన్త్ క్లాస్ బోర్డ్ ఎగ్జామ్ హాల్ టికెట్ విడుదలైన వెంటనే దాన్ని డౌన్‌లోడ్ చేసుకుని, అందులో మీ పేరు, ఫోటో, పుట్టిన తేదీ, ఎగ్జామ్ సెంటర్ వివరాలు సరిగ్గా ఉన్నాయో లేదో చూసుకోవాలి. ఎగ్జామ్ మధ్యలో ఉన్న సెలవులను ఆయా సబ్జెక్టుల Revisionకు వినియోగించుకోవాలని విద్యార్థులకు సూచించారు.