Celebrity Cars India: సెలబ్రిటీకి కారు అంటే కేవలం ప్రయాణ సాధనం కాదు. అది వారి అభిరుచి, వ్యక్తిత్వం, స్టేటస్‌, అవసరమైతే జనాల నుంచి ఎంత త్వరగా తప్పించుకోవాలనే ఆలోచనను కూడా చెప్పేస్తుంది. ముంబయిలో బాలీవుడ్‌ స్టార్లు నడిపే లగ్జరీ కార్లే కాదు... హైదరాబాద్‌, విజయవాడ, చెన్నై వంటి నగరాల్లోనూ ఓ ఖరీదైన కారు కనిపిస్తే చాలు, అది ఎవరిదో తెలుసుకోవాలనే ఆసక్తి అందరిలో కనిపిస్తుంది. వెంటాడే కెమెరాలు, సోషల్‌ మీడియా హడావిడి మధ్య సెలబ్రిటీలు ఎంచుకునే కార్లు పూర్తిగా వ్యూహాత్మక నిర్ణయమే.

లగ్జరీ కార్లు

ఇషా అంబానీ - బెంట్లీ ఆర్నేజ్‌ ఆర్‌బిలియనీర్‌ వారసురాలి గ్యారేజ్‌లో ఎన్నో ఖరీదైన కార్లు ఉన్నా, ఇంగ్లాండ్‌లో తయారైన బెంట్లీ ఆర్నేజ్‌ ఆర్‌ ప్రత్యేక ఆకర్షణ. టైమ్‌లెస్‌ డిజైన్‌, రాజసమైన లుక్‌ ఈ కార్‌కు ప్రత్యేకత.

అజయ్‌ దేవ్‌గణ్‌ - మసెరాటి క్వాట్రోపోర్టేతనను తాను కార్‌ ఎంథూజియాస్ట్‌గా చెప్పుకునే అజయ్‌ దేవ్‌గణ్‌ కలెక్షన్‌లో ఈ ఇటాలియన్‌ లగ్జరీ సెడాన్‌ కీలకం. శక్తిమంతమైన ఇంజిన్‌, ప్రీమియం ఇంటీరియర్‌ దీనికి బలం.

కరీనా కపూర్‌ ఖాన్‌ - BMW X7స్టైల్‌ విషయంలో రాజీ లేని కరీనా గ్యారేజ్‌లో BMW X7 ప్రత్యేకంగా నిలుస్తుంది. ఏడు సీట్లతో వచ్చే ఈ SUV కంఫర్ట్‌, పవర్‌, ప్రెస్టీజ్‌కు సరైన ఉదాహరణ.

ఓరీ - మెర్సిడెస్‌ బెంజ్‌ G-Wagon G350dబార్బీ పింక్‌ కలర్‌లో కనిపించే ఈ G-Wagon సోషల్‌ మీడియాలో హాట్‌ టాపిక్‌. ఆఫ్‌ రోడ్‌ సామర్థ్యంతో పాటు స్టైల్‌కు ఇది ఫేమస్‌.

అల్లు అర్జున్‌ - జాగ్వార్‌ XJLస్టైలిష్‌ స్టార్‌ కార్‌ టేస్ట్‌ కూడా అంతే స్టైలిష్‌. జాగ్వార్‌ ఫ్లాగ్‌షిప్‌ సెడాన్‌ XJL ఆయన కలెక్షన్‌లో క్రౌన్‌లా ఉంటుంది.

హృతిక్‌ రోషన్‌ - రోల్స్‌ రాయిస్‌ గోస్ట్‌ప్రపంచంలోనే అత్యంత లగ్జరీ సెడాన్‌లలో ఒకటైన రోల్స్‌ రాయిస్‌ గోస్ట్‌ హృతిక్‌ స్టైల్‌కు పర్ఫెక్ట్‌ మ్యాచ్‌.

స్పోర్ట్స్‌ కార్లు

రణ్‌బీర్‌ కపూర్‌ - ఆడి R8ఫాస్ట్‌, అగ్రెసివ్‌, టెక్నాలజీతో నిండిన ఆడి R8 రణ్‌బీర్‌ గ్యారేజ్‌లో స్పెషల్‌.

శ్రద్ధా కపూర్‌ - లాంబోర్గినీ హురాకాన్‌ టెక్నికాఎరుపు రంగులో వచ్చే ఈ లిమిటెడ్‌ ఎడిషన్‌ కార్‌ ముంబయి రోడ్లపై అందరి చూపులు తనవైపు తిప్పుకోగలదు.

నటాషా పూనావాల్లా - మెక్‌లారెన్‌ 720Sఫ్యాషన్‌లో ఎంత పర్‌ఫెక్ట్‌ టేస్ట్‌ ఉంటుందో, కార్లలోనూ అంతే. ఇండియాలో ఏకైక రైట్‌ హ్యాండ్‌ డ్రైవ్‌ మెక్‌లారెన్‌ 720S ఆమెదే.

ప్రభాస్‌ - లాంబోర్గినీ అవెంటడార్‌భారీ పవర్‌, వేగానికి కేరాఫ్‌ అయిన ఈ ఇటాలియన్‌ సూపర్‌కార్‌ ప్రభాస్‌ ఇమేజ్‌కు అద్దం పడుతుంది.

విన్టేజ్‌ కార్లు

ఎంఎస్‌ ధోనీ - పాంటియాక్‌ ఫైర్‌బర్డ్‌బైక్‌లతో పాటు విన్టేజ్‌ కార్లపై ప్రేమ ఉన్న ధోనీ, క్రికెట్‌ రిటైర్మెంట్‌ తర్వాత ఈ అమెరికన్‌ క్లాసిక్‌ను కొనుగోలు చేశారు.

జాకీ ష్రాఫ్‌ - SS జాగ్వార్‌ 1001930ల కాలానికి చెందిన ఈ అరుదైన కారు ఆయన క్లాసిక్‌ టేస్ట్‌ను చూపిస్తుంది.

అమితాబ్‌ బచ్చన్‌ - ఫోర్డ్‌ ప్రిఫెక్ట్‌తన బాల్య జ్ఞాపకాలతో ముడిపడిన ఈ కారు తిరిగి జీవితంలోకి రావడం బిగ్‌బీకి ఎమోషనల్‌ మోమెంట్‌.

అదార్‌ పూనావాల్లా - రోల్స్‌ రాయిస్‌ ఫాంటమ్‌ సిరీస్‌ I1920ల నాటి ఈ విన్టేజ్‌ రోల్స్‌ రాయిస్‌ టైమ్‌లెస్‌ క్రాఫ్ట్‌స్మన్‌షిప్‌కు నిదర్శనం.

మొత్తం మీద, ఇండియన్‌ సెలబ్రిటీల కార్లు వారి స్టేటస్‌కే కాదు, వారి వ్యక్తిత్వానికి కూడా స్పష్టమైన ప్రతిబింబంగా నిలుస్తున్నాయి.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.