ఏపీలోని 16 యూనివర్సిటీలలో పీహెచ్‌డీ ప్రోగ్రామ్స్(ఫుల్ టైమ్/పార్ట్ టైమ్) ప్రవేశాల కోసం నిర్వహించే APRCET-2022 (ఆంధ్రప్రదేశ్ రిసెర్చ్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్)-2022 ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ సెప్టెంబరు 01న ప్రారంభమైంది. 55 శాతం మార్కులతో సంబంధిత విభాగంలో మాస్టర్ డిగ్రీ పూర్తిచేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు 50 శాతం మార్కులు ఉంటే సరిపోతుంది. సరైన అర్హతలు ఉన్న అభ్యర్ధులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తుచేసుకోవచ్చు. ఏపీఆర్‌సెట్ పరీక్షలను ఈ ఏడాది అక్టోబర్ 16 నుంచి 19 వరకు నిర్వహించనున్నారు. మొత్తం 62 సబ్జెక్టుల్లో పరీక్ష నిర్వహించనున్నారు. 



వివరాలు...



* ఏపీ రిసెర్చ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (ఏపీఆర్‌సెట్)-2022



విభాగాలు: సైన్స్, ఆర్ట్స్, హ్యుమానిటీస్, సోషల్ సైన్స్, ఫైన్ ఆర్ట్స్, ఎడ్యుకేషన్, ఫిజికల్ ఎడ్యుకేషన్, కామర్స్ అండ్ మేనేజ్మెంట్ స్టడీస్, ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ, ఆర్కిటెక్చర్ ప్లానింగ్, లా అండ్ ఫార్మాస్యూటికల్ సైన్సెస్ తదితరాలు.


అర్హతలు:  55 శాతం మార్కులతో మాస్టర్స్ డిగ్రీ(సైన్స్, ఆర్ట్స్, మేనేజ్మెంట్, కామర్స్, లా, ఫార్మసీ, ఇంజినీరింగ్ తదితర కోర్సులు) ఉత్తీర్ణులై ఉండాలి. బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఇతర రిజర్వేషన్కేటగిరీ అభ్యర్థులు 50శాతం మార్కులు సాధించాలి. పీజీ చివరి సంవత్సరం ఫలితాల కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులూ అర్హులే.


 


Also Read: NMAT 2022: మేనేజ్‌మెంట్‌ కోర్సులకు మెరుగైన మార్గం 'ఎన్‌మాట్', దరఖాస్తు చేసుకోండి!



దరఖాస్తు ఫీజు: సరైన అర్హతలు ఉన్నవారు దరఖాస్తు ఫీజుగా అభ్యర్ధులు జనరల్ రూ.1500,బీసీ రూ.1300 చెల్లించి ఆన్‌‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు రూ.1000 చెల్లిస్తే సరిపోతుంది. ఒక్కో అభ్యర్థి గరిష్ఠంగా రెండు సబ్జెక్టుల వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. 
రూ.2000 ఆలస్య రుసుముతో అక్టోబరు 05,రూ.5000 ఆలస్య రుసుముతో అక్టోబరు 11 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. అనంతరం అక్టోబరు 10,11 తేదీలలో దరఖాస్తుల సవరణకు అవకాశం ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా. 

ఎంపిక విధానం: ప్రవేశ పరీక్షలో సాధించిన మార్కులు, ఇంటర్వ్యూలో చూపిన ప్రతిభ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.యూజీసీ నెట్, సీఎస్ఐఆర్; నెట్, గేట్, స్లెట్, జీప్యాట్, ఎంఫిల్ విద్యార్థులు రిసెర్చ్ మెథడాలజీ పరీక్ష రాయాల్సి ఉంటుంది.



పరీక్ష విధానం: ఆర్‌సెట్ అనేది కంప్యూటర్ బేస్‌డ్ టెస్ట్. బహుళైచ్ఛిక ప్రశ్నలుంటాయి. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు ఉంటుంది. నెగెటివ్ మార్కులు లేవు. పరీక్షలో జనరల్ అభ్యర్థులు 50 శాతం మార్కులు, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, దివ్యాంగ అభ్యర్థులు 45 శాతం మార్కులు సాధిస్తే ఇంటర్వ్యూకు అర్హులవుతారు.



పరీక్ష కేంద్రాలు: ఈ ఏడాది 14 పరీక్ష కేంద్రాలు అందులో ఆంధ్రప్రదేశ్ 13,తెలంగాణ 01. శ్రీకాకుళం, విజయవాడ, కడప, విజయనగరం, గుంటూరు, కర్నూలు, విశాఖపట్నం, ఒంగోలు, అనంతపురం, కాకినాడ, నెల్లూరు, భీమవరం, తిరుపతి, హైదరాబాద్.


 


Also Read: భారతీయ విద్యార్థులకు గుడ్ న్యూస్, ఒక్కరోజులోనే వీసా!



ముఖ్యమైన తేదీలు...


✦ నోటిఫికేషన్ వెల్లడి: ఆగస్ట్ 28,29.


✦ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం:01.09.2022


✦ ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్, దరఖాస్తులకు చివరి తేదీ: 24.09.2022.


✦ రూ.2000, రిజిస్ట్రేషన్ ఫీజు ఆలస్య రుసుముతో దరఖాస్తు తేదీలు: 25.09.2022 నుండి 05.10.2022 వరకు.


✦ రూ.5000, రిజిస్ట్రేషన్ ఫీజు ఆలస్య రుసుముతో దరఖాస్తు తేదీలు: 06.10.2022 నుండి 11.10.2022 వరకు.


✦ దరఖాస్తుల సవరణకు అవకాశం: అక్టోబర్ 10,11.


✦ హాల్‌టికెట్ డౌన్‌లోడ్: 13.10.2022.


✦ పరీక్ష తేదీలు: 16.10.2022 నుండి 19.10.2022 వరకు.



Notification



Information Brochure APRCET – 2022


 


Website


 


 


Also Read:


BRAOU: ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్ - మార్కెట్‌లోకి అంబేద్కర్‌ వ‌ర్సిటీ స్టడీ మెటీరియల్‌! ధర ఎంతంటే?
తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే నిరుద్యోగ యువత కోసం డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ సార్వత్రిక విశ్వవిద్యాలయం (బీఆర్‌ఏవోయూ) నాలుగు పుస్తకాలతో కూడిన స్టడీ మెటీరియల్‌ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ పుస్తకాలకు అభ్యర్థుల నుంచి మంచి స్పందన వస్తోంది. పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే అభ్యర్థుల కోసం తీసుకొచ్చిన ఈ మెటీరియల్‌ను ఆవిష్కరించిన రెండురోజుల్లోనే బుకింగ్స్​‍ మొదలయ్యాయి. వర్సిటీ అధికారులు నాలుగు పుస్తకాల ధరను రూ. 1,150గా నిర్ణయించారు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..


 


Also Read:


TS Govt Jobs : నిరుద్యోగులకు గుడ్ న్యూస్, మరో 2910 పోస్టులకు తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
TS Govt Jobs : తెలంగాణ ప్రభుత్వం మరో 2910 ఉద్యోగాల భర్తీకి అనుమతి ఇచ్చింది.  663 గ్రూప్‌-2 ఉద్యోగాలు, 1373 గ్రూప్‌-3 ఉద్యోగాల భర్తీకి తాజాగా ఉత్తర్వులు ఇచ్చింది. ఈ నోటిఫికేషన్ తో ఉద్యోగాల నియామక ప్రక్రియలో 50 వేల మైలురాయిని దాటేశామని ఆర్థికశాఖ మంత్రి హరీష్ రావు ట్విట్టర్ వేదికగా ప్రకటించారు.  సీఎం కేసీఆర్ అసెంబ్లీ ఇచ్చిన హామీ  మేరకు గడిచిన మూడు నెలలుగా ఇప్పటి వరకు 52,460 ఉద్యోగాల భర్తీకి ఉత్తర్వులు జారీ చేశామని మంత్రి తెలిపారు. మిగతా ఉద్యోగాల భర్తీకి కూడా త్వరలోనే అనుమతులు ఇస్తామని తెలిపారు. 
పూర్తి వివరాలు జీవోల కోసం క్లిక్  చేయండి..


 


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..