AUEET 2024: విశాఖపట్నంలోని ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజినీరింగ్‌ కళాశాలలో 2024-25 విద్యా సంవత్సరానికిగాను సెల్ఫ్‌ సపోర్ట్‌ విధానంలో పలు ఇంజినీరింగ్‌ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఏయూ ఇంజినీరింగ్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌(AUEET-2024) ప్రవేశ పరీక్ష నోటిఫికేషన్‌ వెలువడింది. దీనిద్వారా బీటెక్ కోర్సుల్లో ప్రవేశాలు కల్పించనున్నారు. ఇందులో సీఎస్ఈ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్, సివిల్ ఇంజినీరింగ్, మెకానికల్ ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ విభాగాలు ఉన్నాయి. ప్రవేశ పరీక్ష ఆధారంగా సీట్ల కేటాయింపు ఉంటుంది. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.1,200 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులు రూ.1000 చెల్లిస్తే సరిపోతుంది.


కోర్సు వివరాలు..


* బీటెక్‌ డిగ్రీ ప్రోగ్రామ్‌ (సెల్ఫ్‌ సపోర్ట్‌ విధానం)


సీట్ల సంఖ్య: 510.


➥ బీటెక్- సీఎస్‌ఈ: 360 సీట్లు


➥ బీటెక్- ఎలక్ట్రానిక్స్ అండ్‌ కమ్యూనికేషన్స్ ఇంజినీరింగ్: 60 సీట్లు


➥ బీటెక్- మెకానికల్ ఇంజినీరింగ్: 30 సీట్లు


➥ బీటెక్- సివిల్ ఇంజినీరింగ్: 30 సీట్లు


➥ బీటెక్- ఎలక్ట్రికల్ అండ్‌ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్: 30 సీట్లు


అర్హత: కనీసం 45 శాతం మార్కులతో మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టుల్లో ఇంటర్ లేదా తత్సమాన విద్యార్హత ఉండాలి. రిజర్వుడ్‌ కేటగిరీ అభ్యర్థులకు 40 శాతం మార్కులు ఉంటే సరిపోతుంది.


దరఖాస్తు ఫీజు: రూ.1,200. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులు రూ.1000 చెల్లించాలి.


దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా. 


ఎంపిక విధానం: ప్రవేశ పరీక్ష ఆధారంగా సీట్ల కేటాయింపు ఉంటుంది.


పరీక్ష కేంద్రాలు: విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, రాజమహేంద్రవరం, విజయవాడ, గుంటూరు, తిరుపతి, కడప.


ముఖ్యమైన తేదీలు...


➥ ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 24.04.2024.


➥ రూ.750 ఆలస్య రుసుముతో దరఖాస్తుకు చివరి తేది: 01-05-2024.


➥ హాల్‌టికెట్‌ డౌన్‌లోడ్ ప్రారంభం: 03.05.2024.


➥ ప్రవేశ పరీక్ష తేది: 05-05-2024.


➥ ఫలితాల విడుదల: 07-05-2024.


➥ ప్రవేశాల ప్రక్రియ ప్రారంభం: తర్వాత ప్రకటిస్తారు.


Notification


Registration


Fill Application


Online Payment


Website


ALSO READ:


తెలంగాణ ఓపెన్ స్కూల్ టెన్త్, ఇంటర్ ఎగ్జామ్స్ షెడ్యూలు విడుదల
తెలంగాణ ఓపెన్ స్కూల్ పది, ఇంటర్ పరీక్షల షెడ్యూలును అధికారులు మార్చి 16న విడుదల చేశారు. అధికారిక వెబ్‌సైట్‌లో పరీక్షల టైమ్ టేబుల్‌ను అందుబాటులో ఉంచారు. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం ఏప్రిల్ 25 నుంచి మే 2 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. ఆయాతేదీల్లో రెండు సెషన్లలో పరీక్షలు నిర్వహించనున్నారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మొదటి సెషన్‌; మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు రెండో సెషన్‌లో పరీక్షలు నిర్వహించనున్నారు. ఇక మే 3 నుంచి 10 వరకు ఇంటర్ జనరల్, ఒకేషనల్ విద్యార్థులకు ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించనున్నారు. తెలంగాణ సార్వత్రిక విద్యాపీఠం ఆధ్వర్యంలో నిర్వహించే పదోతరగతి, ఇంటర్మీడియట్‌ పబ్లిక్‌ పరీక్షల హాల్‌టికెట్లు పరీక్షలకు వారం ముందునుంచి అందుబాటులో ఉంచనున్నారు. అధికారిక వెబ్‌సైట్‌లో టెన్త్, ఇంటర్ పరీక్షల హాల్‌టికెట్లను అందుబాటులో పెడతారు. విద్యార్థులు వారిపేరుతోపాటు వారు చదివే స్కూల్ వివరాలు, జిల్లా వివరాలు నమోదుచేసి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
ఓపెన స్కూల్ టెన్త్, ఇంటర్ పరీక్షల షెడ్యూలు కోసం క్లిక్ చేయండి..


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి...