AP SET 2024 Results: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర అర్హత పరీక్ష(AP SET)-2024కు పరీక్ష ఫలితాలను ఆంధ్ర యూనివర్సిటీ మే 24న విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను అందుబాటులో ఉంచింది. పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థుల వివరాలను పీడీఎఫ్ ఫార్మాట్‌లో పొందుపరిచింది. ఏపీసెట్ ఫలితాలకు సంబంధించి మొత్తం 2444 మంది అభ్యర్థులు అర్హత సాధించారు. ఫలితాలతో పాటు ఏపీసెట్ ఫైనల్ ఆన్సర్ 'కీ', సబ్జెక్టుల వారీ కటాఫ్‌ మార్కులు, ర్యాంక్‌ కార్డు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. అభ్యర్థుల తమ ఏపీసెట్ హాల్‌టికెట్ నెంబరు, పుట్టినతేదీ వివరాలు, సెక్యూరిటీ కీ వివరాలు నమోదుచేసి ర్యాంకు కార్డులు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. 


APSET 2024 Result 


APSET 2024 Score Card


APSET 2024 Final Answer Keys


Subject wise Cutff Marks


ఆంధ్ర విశ్వవిద్యాలయం ఫిబ్రవరి 10న ఏపీసెట్-2024 నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. అభ్యర్థుల నుంచి ఫిబ్రవరి 14 నుంచి మార్చి 14 వరకు ఎలాంటి ఆలస్యరుసుము లేకుండా దరఖాస్తులు స్వీకరించింది. ఇక రూ.2000 ఆలస్యరుసుముతో మార్చి 25 వరకు, రూ.5000 ఆలస్యరుసుముతో ఏప్రిల్ 5 వరకు దరఖాస్తులు స్వీకరించింది. పరీక్ష ఫీజుగా జనరల్, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులు రూ.1200 చెల్లించారు. బీసీ అభ్యర్థులు రూ.1000; ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ట్రాన్స్‌జెండర్‌ అభ్యర్థులు రూ.700 చెల్లించారు. కనీసం 55 శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టులో మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. పీజీ చివరి సంవత్సరం చదువుతున్నవారు కూడా దరఖాస్తు చేసుకున్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, థర్డ్ జెండర్ అభ్యర్థులకు 50 శాతం మార్కులు ఉండాలి.  పరీక్షకు సంబంధించిన హాల్‌టికెట్లను ఏప్రిల్ 19న విడుదల చేసి, ఏప్రిల్ 28న ఏపీసెట్-2024 ప్రవేశపరీక్ష నిర్వహించింది. మొత్తం 30 సబ్జెక్టులకు పరీక్ష నిర్వహించారు. విశాఖపట్నం, రాజమహేంద్రవరం, గుంటూరు, నెల్లూరు, అనంతపురం, తిరుపతి, కడప, కర్నూలు జిల్లా కేంద్రాల్లో పరీక్ష నిర్వహించారు. రూ.5000 ఆలస్యరుసుముతో ఫీజు చెల్లించినవారికి కేవలం విశాఖపట్నం కేంద్రంలో మాత్రమే పరీక్ష నిర్వహిస్తారు.


పరీక్ష విధానం: ఏపీ సెట్ పరీక్షలో రెండు పేపర్లు ఉంటాయి. పేపర్‌-1(జనరల్ పేపర్)లో 50 ప్రశ్నలకు 100 మార్కులు, పేపర్‌-2(అభ్యర్థులకు సంబంధించిన సబ్జెక్టు)లో 100 ప్రశ్నలకు 200 మార్కులు కేటాయించారు. పేపర్-1కు 60 నిమిషాలు (గంట), పేపర్-2కు 120 నిమిషాల (2 గంటల) సమయం కేటాయించారు. పేపర్-1 పరీక్షను ఇంగ్లిష్, తెలుగు మాధ్యమాల్లో నిర్వహించనుండగా.. పేపర్-2లో కామర్స్, ఎకనామిక్స్, ఎడ్యుకేషన్, హిస్టరీ, పొలిటికల్ సైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, సోషియాలజీ సబ్జెక్టులను ఇంగ్లిష్, తెలుగు మాధ్యమాల్లో నిర్వహించనున్నారు. తెలుగు, ఉర్దూ, సంస్కృతం, హిందీ సబ్జెక్టులు తప్ప మిగతా సబ్జెక్టులను ఇంగ్లిష్‌లో మాత్రమే నిర్వహిస్తారు.


పరీక్ష నిర్వహించిన సబ్జెక్టులు: ఆంత్రోపాలజీ, హిస్టరీ, కెమికల్ సైన్సెస్, కామర్స్, కంప్యూటర్ సైన్స్ అండ్‌ అప్లికేషన్, ఎకనామిక్స్, ఎడ్యుకేషన్, ఇంగ్లిష్, ఎర్త్- అట్మాస్పియరిక్‌- ఓషన్ అండ్‌ ప్లానెటరీ సైన్స్, ఎన్విరాన్‌మెంటల్ సైన్స్, జాగ్రఫీ, హిందీ, జర్నలిజం అండ్‌ మాస్ కమ్యూనికేషన్స్, లా, లైఫ్ సైన్సెస్, లైబ్రరీ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ సైన్స్, మేనేజ్‌మెంట్, మ్యాథమెటికల్ సైన్సెస్, ఫిజికల్ సైన్సెస్, ఫిజికల్ ఎడ్యుకేషన్, ఫిలాసఫీ, పొలిటికల్ సైన్స్, సైకాలజీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, సంస్కృతం, సోషియాలజీ, సోషల్ వర్క్, తెలుగు, ఉర్దూ, విజువల్ ఆర్ట్స్.


Notification


Website


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..