దసరా సెలవుల్లో తరగతులు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ హెచ్చరించింది. రాష్ట్రంలోని అన్ని ప్రైవేట్, ప్రభుత్వ విద్యాసంస్థలకు రాష్ట్ర విద్యా శాఖ ప్రకటించిన దసరా పండుగ సెలవులను విధిగా పాటించి తీరాలని కమిషన్ చైర్‌పర్సన్ కేసలి అప్పారావు అక్టోబరు 16న స్పష్టం చేశారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై ఖచ్చితంగా చర్యలుంటాయని స్పష్టం చేస్తూ అందుకు సంబంధించి ఉత్తర్వులు జారీ చేశారు.
దసరా సెలవుల్లో విద్యా సంస్థలు తరగతులు నిర్వహించినా లేదా ఆ్లనన్ తరగతులు నిర్వహించినా తప్పక ఆయా పాఠశాలలుపై చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కొన్ని జిల్లాలలో సెలవులు విషయములో ప్రభుత్వ నియమ నిబంధనలును కొన్ని ప్రైవేట్ కార్పోరేట్ పాఠశాలలు పాటించడం లేదని కమిషన్ కార్యాలయానికి ఫిర్యాదులు వస్తున్నట్లు తెలిపారు.
ఏపీలో కొన్ని కార్పొరేట్ విద్యాసంస్థలు ఆన్‌లైన్ తరగతులు నిర్వహిస్తున్నారని, మరికొన్ని విద్యా సంస్థలు మొబైల్ ఫోన్ ద్వారా హోం వర్క్ చేయమని పిల్లలను ఒత్తిడి తీసుకువస్తున్నట్లు ఫిర్యాదులున్నాయని పేర్కొన్నారు. ఎక్కడైనా పాఠశాలలు ప్రత్యేక తరగతులు, ఆన్‌లైన్ తరగతులు, ఆన్‌లైన్ పరీక్షలు నిర్వహిస్తే రాష్ట్ర బాలల హక్కుల కమిషన్‌కు మెయిల్ ద్వారా పిర్యాదు చేయాలని సూచించారు. అలాగే మండల, జిల్లా స్థాయి విద్యా శాఖ అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేయాలని, తరగతులు నిర్వహిస్తున్న పాఠశాలలను గుర్తించి తగు శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని ఈమేరకు అన్ని జిల్లాల కలెక్టర్లు, విద్యాశాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
ఎక్కడైనా పాఠశాలలు ప్రత్యేక తరగతులు లేదా ఆన్లైన్ తరగతులు లేదా ఆన్‌లైన్ పరీక్షలు నిర్వహిస్తూ ఉంటే రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ వారి మెయిల్ కి apscpcr2018@gmail.com కు మెయిల్ ద్వారా ఫిర్యాదు చేయాలని ఆయన కోరారు.
ALSO READ:
విద్యార్థుల కోసం 'అపార్' కార్డు, 'వన్ నేషన్-వన్ ఐడీ'కి కసరత్తు, రాష్ట్రాలను ఆదేశించిన కేంద్రం
‘ఆధార్’ తరహాలో విద్యార్థుల కోసం ప్రత్యేక గుర్తింపు కార్డు ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. దేశంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల విద్యార్థులకు అపార్(ఆటోమేటెడ్ పర్మినెంట్ అకడమిక్ అకౌంట్ రిజిస్ట్రీ) పేరుతో 'వన్ నేషన్-వన్ ఐడీ' కార్డును అందుబాటులోకి తేనున్నారు. విద్యార్థులకు ఈ గుర్తింపు కార్డులు ఇచ్చే ప్రక్రియను ప్రారంభించాలని అన్ని రాష్ట్రాలు, యూటీలను కేంద్ర విద్యాశాఖ తాజాగా ఆదేశించింది. అపార్ ఐడీ కార్డును దేశంలోని అన్ని ప్రభుత్వ, ప్రయివేట్ పాఠశాలల విద్యార్థులకు అందజేయనున్నారు. ఈ అపార్ నెంబర్‌నే విద్యార్థి జీవితకాల ఐడీగా పరిగణిస్తారు. దీంట్లో విద్యార్థి అకడమిక్ జర్నీ, విద్యా ప్రయాణం, విజయాలు నిక్షిప్తం అయ్యి ఉంటాయి. అవసరమైన సమయంలో ట్రాక్ చేయొచ్చని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి.
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..
ఇంటర్ పాసైన విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు, దరఖాస్తుకు డిసెంబరు 31 వరకు గడువు
తెలంగాణలో ఈ ఏడాది మార్చిలో నిర్వహించిన ఇంటర్ వార్షిక పరీక్షల్లో ఉత్తీర్ణులై... ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులు 'నేషనల్ మెరిట్ స్కాలర్‌షిప్'కు దరఖాస్తు చేసుకోవాలని ఇంటర్‌బోర్డు కార్యదర్శి నవీన్‌మిత్తల్ అక్టోబరు 6న ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థులు దరఖాస్తు చేసుకోవడానికి డిసెంబరు 31 వరకు గడువు ఉన్నట్లు ఆయన వెల్లడించారు. ఇంటర్ మార్కుల్లో టాప్-20 పర్సంటైల్‌లో నిలిచిన 53,107 మంది ఈ స్కాలర్‌షిప్‌కు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులని ఆయన పేర్కొన్నారు. కొత్త విద్యార్థులతోపాటు గతంలో స్కాలర్‌షిప్‌నకు ఎంపికైన వారు కూడా రెన్యువల్ కోసం డిసెంబరు 31లోపు దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు.
స్కాలర్‌షిప్ పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..